E-Paper
Advertisement

Upcoming Ola Electric Bikes 2026: లాంచింగ్ కు రెడీ అయిన సూపర్ ఓలా బైక్స్.. లుక్ చూస్తే మతిపోవాల్సిందే!

Upcoming Ola Electric Bikes 2026: లాంచింగ్ కు రెడీ అయిన సూపర్ ఓలా బైక్స్.. లుక్ చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

Ola Electric Bikes 2026: దేశీ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ సంస్థ ఓలా నుంచి అదిరిపోయే బైక్స్ లాంచ్ కాబోతున్నాయి. 2026లో మొత్తం 3 బైక్స్ విడుదల కానున్నాయి. వాటిలో ఆరో హెడ్, డైమండ్ హెడ్ తో పాటు మరో బైక్ ఉన్నాయి. ఈ బైక్స్ వచ్చే ఏడాది మిడ్ ఇయర్ లో లేదంటే ఎండింగ్ లో లాంచ్ కానున్నాయి.

ఓలా ఎలక్ట్రిక్ ను లాంచ్ కాబోకే క్రేజీ బైక్స్   

దేశీ మార్కెట్లోకి ఓలా ఎలక్ట్రిక్ నుంచి రాబోయే, ఇటీవల లాంచ్ అయిన ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్స్ గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే రోడ్‌ స్టర్ సిరీస్ ను లాంచ్ చేసింది. వీటికి సంబంధించి ఇప్పుడు బుకింగ్స్ మొదలయ్యాయి. డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి. మిగతా కాన్సెప్ట్ మోడల్స్ డైమండ్ హెడ్, అడ్వెంచర్, క్రూయిజర్ బైక్ లు ఇంకా లాంచ్ కాలేదు.

1.రోడ్‌స్టర్ సిరీస్ (Roadster Series)

Advertisement

 

⦿ Roadster X, Roadster X+

ధర: రూ.99,999 నుంచి ప్రారంభం అవుతుంది.

Advertisement

డెలివరీలు: మార్చి 10, 2025 నుంచి ప్రారంభం అయ్యాయి.

ఫీచర్స్: కామ్యూటర్ స్టైల్,  రెండు బ్యాటరీ ఆప్షన్స్(2.5kWh, 4.5kWh)లో అందుబాటులో ఉంటాయి. రేంజ్ 140-252 km. టాప్ స్పీడ్ 118 kmph వరకు ఉంటుంది.

⦿ Roadster

ధర: రూ.1,04,999 నుంచి ప్రారంభం అవుతుంది.

డెలివరీలు: మార్చి 2025 నుంచి మొదలయ్యాయి.

ఫీచర్స్: మిడ్ స్పెక్, 3.5-6 kWh బ్యాటరీ, రేంజ్ 200+ km, టాప్ స్పీడ్ 126 kmph, MoveOS 5, క్రూయిజ్ కంట్రోల్, ABSను కలిగి ఉంది.

⦿ Roadster Pro

ధర: రూ. 1,99,999 నుంచి ప్రారంభం అవుతుంది.

డెలివరీలు: జనవరి 2026 నుంచి ప్రారంభం అయ్యాయి.

ఫీచర్స్: ప్రీమియం, 8-16 kWh బ్యాటరీ, రేంజ్ 579 km వరకు, టాప్ స్పీడ్ 194 kmph, ADAS, ట్రాక్షన్ కంట్రోల్, రేస్ ట్రాక్ రెడీతో వస్తుంది. .

2.రాబోయే ఓలా మోడల్స్

 

⦿ Diamondhead

అంచనా ధర: దీని అంచనా ధర రూ. 3.5 లక్షలు పైనే ఉంటుంది.

లాంచ్: 2026 ఎండింగ్ లో లేదంటే 2027 ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ఫీచర్స్: సూపర్‌ స్పోర్ట్, ఫ్యూచరిస్టిక్ స్టైల్ లో ఆట్టుకోనుంది. హై పర్ఫార్మెన్స్, ADAS, ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్స్ ను కలిగి ఉంటుంది.

⦿ Adventure (అడ్వెంచర్ టూరర్)

అంచనా ధర: ఈ బైక్ అంచనా ధర రూ.3 లక్షలు ఉంటుంది.

లాంచ్: 2026 మిడ్ ఇయర్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ఫీచర్స్: ఆఫ్ రోడ్ కెపాబిలిటీ, టాల్ స్టాన్స్, లాంగ్ రేంజ్.

⦿ Cruiser (క్రూయిజర్ స్టైల్)

అంచనా ధర: రూ.3 లక్షలు ఉంటుంది.

లాంచ్: 2026లోని ఫస్ట్ లేదంటే సెకెండ్ ఫైనాన్షియల్ ఇయర్ లో లాంచ్ కావచ్చు.

ఫీచర్స్: రిలాక్స్డ్ రైడింగ్ పొజిషన్, లాంగ్ డిస్టెన్స్ కంఫర్ట్.

ఈ మూడు మోడల్స్ డెలివరీలు 2026 ఫస్ట్ క్వార్టర్ లో ప్రారంభం అవుతాయని కొన్ని సైట్లు అంచనా వేస్తుంటే, మరికొన్ని 2027 ఫస్ట్ క్వార్టర్ వరకు విడుదలయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నాయి.

Read Also: కియా To మహీంద్రా.. కొత్త ఏడాది సరికొత్తగా అడుగు పెట్టబోతున్న హైబ్రిడ్ కార్ల!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×