E-Paper
Advertisement

The Great Flood Review : ”ది గ్రేట్ ఫ్లడ్” మూవీ రివ్యూ

The Great Flood Review : ”ది గ్రేట్ ఫ్లడ్” మూవీ రివ్యూ
Advertisement

The Great Flood Review : దక్షిణ కొరియా సైన్స్ ఫిక్షన్ డిజాస్టర్ చిత్రం ”ది గ్రేట్ ఫ్లడ్”. ముందుగా ఈ మూవీ సెప్టెంబర్ 18న 30వ బుసాన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. అక్కడ ప్రశంసలు అందుకున్న అనంతరం డిసెంబర్ 19న నెట్‌ఫ్లిక్స్ లో గ్లోబల్ గా విడుదలైంది. ఈ దక్షిణ కొరియా చిత్రానికి కిమ్ బైయుంగ్-వూ దర్శకత్వం వహించారు. మరి ట్రైలర్ తోనే ఆసక్తిని క్రియేట్ చేసిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ : 

ఈ సినిమా కథ ఓ గ్రహం నుంచి భూమిపై స్టార్ పడిపోవడంతో ప్రారంభమవుతుంది. ఆ భారీ విపత్తు భూమి భౌగోళిక నిర్మాణాన్ని తీవ్రంగా మారుస్తుంది. ఫలితంగా భారీ హిమానీనదాలు కరగడంతో పెను ప్రమాదం ముంచుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద దేశాలలో భారీ వినాశనం ఏర్పడుతుంది. ప్రపంచాన్ని ముంచెత్తిన మహా వరద (గ్రేట్ ఫ్లడ్) వల్ల మానవజాతి అంతరించిపోతున్న ఆఖరి రోజు అది. సియోల్‌లోని ఒక హై-రైజ్ అపార్ట్‌మెంట్‌లో ఏఐ రీసెర్చర్ అన్నా (కిమ్ డా-మి) తన చిన్న కొడుకు జా-ఇన్‌తో ఇరుక్కుపోతుంది.

Advertisement

నీటి మట్టం పెరిగిపోతున్న తరుణంలో ఆమెకు ఒక క్రూషియల్ మిషన్ కాల్ వస్తుంది. రెస్క్యూ ఆఫీసర్ హీ-జో (పార్క్ హే-సూ) సాయంతో ఆమె భవనం పైకి చేరుకోవాలి. ప్రపంచాన్ని తుడిచి పెట్టేస్తున్న ఈ రాకాసి వరదల నుంచి ఆ తల్లి తన బిడ్డను కాపాడటానికి ప్రాణాలు పణంగా పెడుతుంది. ఈ వరద నిజంగా వచ్చిందా, లేక హీరోయిన్ ఊహనా ? చివరకు హీరోయిన్ తన కొడుకును కాపాడగలిగిందా? క్లైమాక్స్ ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :

ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా కోసం నిర్మాతలు సాంకేతికంగా బాగానే శ్రమించారు. ఫలితంగా ఇది కూడా ఒక మంచి విజువల్ వండర్ గా తెరపైకి వచ్చింది. మొదటి సగంలో డిజాస్టర్ సీక్వెన్సెస్, వాటర్ VFX రియలిస్టిక్, టెన్షన్ ఫుల్ గా అన్పిస్తాయి. సర్‌ప్రైజ్ ట్విస్టులు, టైమ్ లూప్, AI థీమ్స్ ఆసక్తికరంగా అన్పిస్తాయి. మొదటి 40 నిమిషాలు బ్రీత్‌టేకింగ్. కానీ కథను బెస్ట్ గా రూపొందించే ప్రయత్నంలో మేకర్స్ చాలా గందరగోళాన్ని క్రియేట్ చేశారు.

Advertisement

సెకండ్ హాఫ్ కన్ఫ్యూజింగ్… ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో, దాని వెనుక ఉన్న కారణం ఏమిటో అర్థం చేసుకోవడానికి టైమ్ పడుతుంది. అలాగే జానర్ సడన్ గా షిఫ్ట్ అవ్వడంతో ఎమోషనల్ కనెక్షన్ కొరవడింది. మొదట్లో క్లాసిక్ డిజాస్టర్ మూవీలా మొదలై, మధ్యలో సడన్‌గా సై-ఫై థ్రిల్లర్‌గా మారుతుంది. కథలోని ట్విస్టులు చివరి వరకు మూవీని ఉత్కంఠభరితంగా ముందుకు తీసుకెళ్తాయి. కానీ క్లైమాక్స్ నిరాశపరుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే “ది ఇంపాసిబుల్”, “ఇంటర్‌స్టెల్లార్”, “ఎడ్జ్ ఆఫ్ టుమారో” మిక్స్ లాగా అన్పిస్తుంది.

సినిమాలో ప్రధాన నటి కిమ్ డా-మి అద్భుతంగా నటించింది. తల్లి పాత్రలో ఆమె చేసిన యాక్టింగ్ కోసమైనా ఈ సినిమాను చూడవచ్చు. చైల్డ్ యాక్టర్ క్వాన్ ఉన్-సియోంగ్ క్యూట్, నేచురల్ గా నటించాడు. మిగతా నటులుతమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.

ప్లస్ పాయింట్స్ 

ఫస్టాఫ్
నటీనటులు
విజువల్స్

మైనస్ పాయింట్స్ 

సెకండ్ హాఫ్
ఎమోషనల్ డెప్త్ లేకపోవడం
క్లైమాక్స్

మొత్తంగా.. సై-ఫై డిజాస్టర్ థ్రిల్లర్ ప్రేమికులు, కొరియన్ సినిమా ఫ్యాన్స్‌లు ఒకసారి ట్రై చేయొచ్చు.

The Great Flood Rating : 2.5/5

Related News

గరివిడి లక్ష్మి మూవీ రివ్యూ

‘రణబాలి’ మూవీ రివ్యూ.. విరోష్ జంట హ్యాట్రిక్ కొట్టిందా?

అనుపమ ‘క్రేజీ కళ్యాణం’ మూవీ రివ్యూ.. తెలంగాణ పల్లెటూరి అమ్మాయి ఆకట్టుకుందా?

జైలర్ 2 మూవీ రివ్యూ.. రజినీకాంత్ జైలర్ మ్యాజిక్ రిపీట్ చేశారా?

మయూఖ మూవీ రివ్యూ..ఎలా ఉందంటే?

చకోర మూవీ రివ్యూ..

రివ్యూ: కామ్రేడ్‌ కళ్యాణ్‌.. మెప్పించిండా? 

‘ప్రేమనే ఊరిలో’ రివ్యూ.. ప్రేమ గెలిచిందా? తండ్రి మాట గెలిచిందా?

Big Stories

Advertisement
×