E-Paper
Advertisement

Kavitha Big Shock to BRS: బీఆర్ఎస్ పై కవిత మరో బ్రహ్మాస్త్రం.. ఈసారి దెబ్బ తండ్రికే!

Kavitha Big Shock to BRS: బీఆర్ఎస్ పై కవిత మరో బ్రహ్మాస్త్రం.. ఈసారి దెబ్బ తండ్రికే!

Kavitha Big Shock to BRS: కారు పార్టీపై అస్త్రాలను సంధించడమే పనిగా పెట్టుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఇప్పుడు మరోకటి వదిలారు. ఈసారి తన తండ్రి, మాజీ సీఎం అయిన కేసీఆర్‌ను కూడా వదల్లేదు. అంతేకాదు యూటీ, బీటీ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అసలింతకి ఈ ఉద్యమ బ్యాచ్ ఎవరు? బంగారు తెలంగాణ బ్యాచ్ ఎవరు? అసలు కవిత ఏమన్నారు? దాని అర్థం, పరమార్థం ఏంటి? ఇన్నాళ్లుగా లేనిది ఇప్పుడే కవితకు ఈ బ్యాచ్‌లు ఎందుకు గుర్తొచ్చాయి?

బీటీ అంటే బంగారు తెలంగాణ బ్యాచ్‌..
జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలు… ఉప్పల్, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్, మేడ్చల్ కూకట్‌పల్లిలో మొత్తం బీటీ బ్యాచ్ గెలిచిందంటున్నారు కవిత. ఇంతకీ ఈ బీటీ బ్యాచ్‌ ఏంటనదే కదా మీ సందేహం? బీటీ అంటే బంగారు తెలంగాణ బ్యాచ్‌ అని. ఈ పదం ఎప్పుడో ఎక్కడో విన్నట్టు ఉందా? ఉంటుంది. ఎందుకంటే సరిగ్గా దశాబ్ధం క్రితం.. అంటే తెలంగాణ వచ్చిన తొలినాళ్లలో వినిపించింది ఈ పదం. అప్పట్లో ఇతర పార్టీల్లో గెలిచి.. బీఆర్ఎస్‌లో చేరిన నేతలను బీటీ బ్యాచ్ అని పిలిచేవారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడీ పదాన్ని వాడుతున్నారు కవిత. ఎందుకు? అనేదే ఇప్పుడు ప్రశ్న.

టీడీపీ, కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్‌లో చేరిన నేతలు
2014 ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్‌లో చేరి పదవులు దక్కించుకున్న వాళ్లను ఇలా బీటీ బ్యాచ్‌ అని పిలిచేవారు. ఉద్యమంలో కష్టపడిన వాళ్లకు కాకుండా.. ఇలా పార్టీ మారి వచ్చిన వాళ్లకు పదవులు కట్టబెట్టడంపై అప్పట్లో తీవ్రంగా విమర్శలు కూడా వచ్చాయి. బంగారు తెలంగాణ ఫలాలను అందుకుంటున్నారంటూ వీళ్లను బీటీ బ్యాచ్ అంటూ బీఆర్‌ఎస్‌లోని కొంతమంది నేతలు సెటైరిక్‌గా పిలుచుకునేవాళ్లు. ఆ సమయంలో బీఆర్ఎస్‌లోనే కవిత.. అప్పుడు మాట్లాడలేదు.. కనీసం రెండోసారి గెలిచాక కూడా ఈ అంశంపై ఎలాంటి స్పందన లేదు.. దాదాపు పదేళ్లు మౌనంగా ఉండి.. ఇప్పుడు కవిత ఇలా మాట్లాడటం వెనక మతలబేంటి? అనే చర్చ ఇప్పుడు బీఆర్ఎస్‌ నేతలతో పాటు.. ప్రజల్లో జరుగుతున్న చర్చ.

కవిత యాంటీ బీఆర్ఎస్‌ స్టాండ్‌ తీసుకుంటున్నారనేది ఇప్పటికే అందరికి అర్థమైంది. కానీ ఇలాంటి యూటీ, బీటీ బ్యాచ్‌ అంటూ మాట్లాడటం ఎంత వరకు మేలు చేస్తుందో కానీ.. అంతో ఇంతో బ్యాక్ ఫైర్ అవ్వడం మాత్రం తప్పదు. నాట్ ఓన్లీ యూటీ, బీటీ.. బీఆర్ఎస్‌పై చేసే విమర్శలు, ఆరోపణలు విన్న ప్రతిసారీ ఇన్నాళ్లు ఏం చేశావు కవితమ్మ అనే ప్రశ్ననే ప్రజలు వేస్తున్నారట. ఇన్నాళ్లు నాకు తెలియదు.. ఇప్పుడే తెలిసింది అన్నట్టుగా కవిత మాట్లాడుతున్న అవి అస్సలు నమ్మబుల్‌గా లేవనేది జనం మాట. ఒక్కసారి ఈ మాటలు వినండి.. మీకు ఇంకొన్ని డౌట్స్‌ రాక మానదు

కవిత చేసిన అక్రమాల చిట్టా ఉందంటున్న ఎమ్మెల్యే కృష్ణారావు..
కవిత చేసిన అక్రమాల చిట్టా మా దగ్గర ఉంది.. ఆమె అక్రమాల గురించి మాట్లాడితే అస్సలు తట్టుకోలేరు అంటున్నారు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. అంటే జాగృతి కవిత తప్పులను ఆయన లెక్కవేస్తున్నట్టు కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జాగృతిని బరిలోకి దింపుతారని.. అందుకే ఈ ప్రాంతంలోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కవిత టార్గెట్ చేశారన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే.. ఇంతకాలం కవిత విషయంలో చూసీ చూడనట్లు వదిలేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.. ఇకపై మాత్రం మాటకు మాట ఇవ్వాల్సిందేనని డిసైడ్ అయ్యారట. అందుకే.. మాధవరం అంత ఫైర్ అయ్యారంటున్నారు.

Also Read: ఎవరి మాట వారిదే.. డాలస్‌ తెలుగు డయాస్పోరా హిట్టా? ఫట్టా?

ఏదేమైనా కవిత వ్యవహారం ఇప్పుడు బీఆర్ఎస్‌కు చిరాకు తెప్పిస్తుండగా.. కాంగ్రెస్ నేతలు మాత్రం కాగల కార్యం కవితే తీరుస్తుందన్నట్టుగా లోలోన సంతోషపడుతున్నారు. మొత్తానికి బీఆర్ఎస్‌ పాలన తీరు, అందులో లోపాలను కేసీఆర్ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే చెప్పడం మాత్రం హైలేట్ అని చెప్పాలి.

Story By Vamshi Krishna, Bigtv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×