E-Paper
Advertisement

Top 5 EVs Launch 2026: 2026లో విడుదల కానున్న టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవి, ఒక్కోదాని ప్రత్యేకత ఏంటంటే?

Top 5 EVs Launch 2026: 2026లో విడుదల కానున్న టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవి, ఒక్కోదాని ప్రత్యేకత ఏంటంటే?
Advertisement

Upcoming EVs 2026: భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు  నెమ్మదిగా పెరుగుతూనే ఉన్నాయి. టాటా లాంటి బ్రాండ్లు ఇప్పటికే పలు ఈవీలను మార్కెట్లోకి తీసుకొచ్చింది. SUVలు ప్రపంచ వ్యాప్త ఆకర్షణను పొందుతుండటంతో, వాహన తయారీదారులు భారత మార్కెట్‌పై దృష్టి సారించారు. మంచి రేంజ్ తో పాటు భద్రత విషయంలోనూ రాజీ లేని ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందిస్తున్నారు. 2026లో కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను ప్రవేశపెట్టడానికి పలు కంపెనీలు రెడీ అవుతున్నాయి.  వినియోగదారులు ఎక్కువగా ఎదురు చూస్తున్న ఐదు ఈవీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ మారుతి సుజుకి ఇ విటారా

మారుతి కంపెనీకి సంబంధించిని ఈ విటారా వచ్చే ఏడాది వచ్చే లాంచ్ అయే తొలి EV కానుంది. జనవరిలో అమ్మకాలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. ఈ SUV రెండు లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీ ఎంపికలతో అందించబడుతుంది. సింగిల్ మోటార్ సెటప్‌ తో జత చేయబడిన 49 kWh యూనిట్, ఫ్రంట్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉన్న పెద్ద 61 kWh ప్యాక్ ఉంటుంది. ఈ బ్యాటరీ 346 కి.మీ వరకు రేంజ్ ను అందిస్తుంది.    అయితే 61 kWhతో 428 కి.మీ వరకు విస్తరించుకునే అవకాశం ఉంది.

⦿ టాటా సియెర్రా EV

Advertisement

టాటా సియెర్రా.ev మార్చి 2026 నాటికి ప్రారంభించబడే అవకాశం ఉంది. ఆల్ ఎలక్ట్రిక్ సియెర్రా సింగిల్ మోటార్ రియర్ వీల్ డ్రైవ్, డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్లలో అందించబడుతుంది. ఇది ప్రారంభం నుంచి దాని ఆఫ్ రోడ్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ఈవీ ఫ్రంక్, వన్ పెడల్ డ్రైవింగ్, వెహికల్ టు లోడ్ (V2L) ఛార్జింగ్ సదుపాయాన్ని కలిగి ఉంటుంది.

⦿ మహీంద్రా XUV 3XO EV

టాటా నెక్సాన్ కు ఇది ప్రత్యర్థిగా మారబోతోంది. XUV 3XOని ఎలక్ట్రిక్ వెర్షన్‌ లో తీసుకురాబోతోంది. XUV400 కంటే చిన్నది, సరసమైనదిగా అందుబాటులోకి రానుంది. ఈ ఈవీ 35 kWh NMC బ్యాటరీ ప్యాక్‌ ను కలిగి ఉంటుంది. ఇది దాదాపు 400 కి.మీ.ల అంచనా పరిధిని అందిస్తుందని భావిస్తున్నారు. మహీంద్రా ఈ కొత్త ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ SUVని 2026 ఫస్ట్ హాఫ్ లో ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.

⦿ కియా సియోర్స్ EV

Advertisement

మార్చి 2026 నాటికి కియా సైరోస్ EV భారత మార్కెట్లో అడుగు పెట్టనుంది. ఎలక్ట్రిక్ సైరోస్ ICE వెర్షన్ డిజైన్‌ కు దగ్గరగా ఉంటుంది. కుడి ఫెండర్‌పై ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. ముఖ్యంగా, టెస్ట్ మ్యూల్‌ లో గ్రీన్ బ్రేక్ కాలిపర్లు ఉన్నాయి. క్యాబిన్, ఫీచర్లు ICE సైరోస్‌ తో పంచుకునే అవకాశం ఉంది. సాంకేతిక వివరాలు వెల్లడించనప్పటికీ, టాటా నెక్సాన్ EV, హ్యుందాయ్ K1కు పోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

⦿ హ్యుందాయ్ ఇన్‌స్టర్ EV

హ్యుందాయ్ 2026 చివరి నాటికి  ఈ ఈవీని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తుంది. HE1i అనే కోడ్‌నేమ్ ఉన్న ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV, స్థానికంగా లభించే ఎక్సైడ్ బ్యాటరీలతో శ్రీపెరంబుదూర్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయబడుతుంది. గ్లోబల్ ఇన్‌స్టర్ EV ఆధారంగా, ఇది 97hp లేదంటే 115hp మోటార్‌ల తో జత చేయబడిన 42kWh, 49kWh బ్యాటరీ ఎంపికలను అందిస్తుంది. ఇది 300km, 355km రేంజ్ ను అందిస్తుంది. డ్యూయల్ 10.25-అంగుళాల డిస్‌ ప్లేలు, లెవల్ 2 ADAS, ఆటో క్లైమేట్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్‌ తో 360 డిగ్రీ కెమెరా లాంటి అత్యాధునిక ఫీచర్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Read Also: ఆల్టో K10 To టియాగో.. రూ. 5 లక్షల్లోపు బెస్ట్ కార్లు ఇవే!

Related News

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

16 ఏళ్ల తర్వాత నిస్సాన్ మాస్టర్‌ పీస్.. కొత్త ఎల్గ్రాండ్ వచ్చేసింది!

Big Stories

Advertisement
×