E-Paper
Advertisement

Upcoming TVS Bikes 2026: TVS నుంచి రాబోతున్న 4 బైక్‌లు.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

Upcoming TVS Bikes 2026: TVS నుంచి రాబోతున్న 4 బైక్‌లు.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!
Advertisement

Upcoming TVS Bikes 2026: 2025 ఎండింగ్ నుంచి 2026 వరకు అద్భుతమైన TVS బైక్ లు విడుదలకు రెడీ అవుతున్నాయి.వాటిలో విజన్ iQube కాన్సెప్ట్, జుపిటర్ 125 CNG, ఫియెరో 125, iQube ST కాన్సెప్ట్ ఉన్నాయి. విజన్ iQube కాన్సెప్ట్ రాబోయే 6 నెలల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ బైక్స్ కు సంబంధించి కంప్లీట్ డీటైల్స్ ఇప్పుడు తెలుసుకుందాం..

TVS నుంచి రాబోయే బైక్‌ల

 

⦿ TVS విజన్ iQube కాన్సెప్ట్ (TVS Vision iQube Concept)

Advertisement

విజన్ iQube కాన్సెప్ట్ బైక్ ధర రూ. 89,999గా కంపెనీ నిర్ణయించింది. జూన్ 2026లో ఈ బైక్ లాంచ్ కానుంది. జనవరి 2025లో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌ పో 2025లో విజన్ iQube కాన్సెప్ట్ను కంపెనీ అన్‌వీల్ చేసింది. ప్రస్తుత iQube సిరీస్ ఆధారంగా తయారైంది. ఫ్యూచరిస్టిక్ డిజైన్, అధునాతన ఫీచర్లతో రూపొందుతుంది. యూనిక్ ఫ్రంట్ ఏప్రాన్, షార్ప్ బాడీ ప్యానెల్స్, స్లీక్ హ్యాండిల్‌బార్ తో ఆకట్టుకుంటుంది. కాపర్, నార్దర్న్ లైట్స్ ఇన్‌స్పైర్డ్ షేడ్స్ తో అందుబాటులోకి రానుంది. 14-ఇంచ్ చంకీ అల్లాయ్ వీల్స్ తో రానుంది. మాక్సీ-స్కూటర్ స్టైల్, ప్రస్తుత iQube కంటే పెద్దదిగా ఉంటుంది. ట్రాన్స్‌ పరెంట్ గ్లాస్ డిస్‌ ప్లే, 3.4 kWh ఫిక్స్డ్ బ్యాటరీ + 2 x 1 kWh రేంజ్ బూస్టర్ బ్యాటరీలను కలిగి ఉంటుంది. ఒక్క ఛార్జ్ తో 150 km రేంజ్ ను కలిగి ఉంటుంది. హ్యాండిల్‌ బార్‌పై ఫ్యూచరిస్టిక్ కంట్రోల్స్, హైట్ అడ్జస్టబుల్ సీట్, రియర్ కెమెరా,  వాయిస్ కమాండ్, పర్సనలైజ్డ్ స్టోరేజ్, అడ్జస్టబుల్ సస్పెన్షన్ ను కలిగి ఉంటుంది.

⦿ టీవీఎస్ జూపిటర్ 125 CNG (TVS Jupiter 125 CNG)

జూపిటర్ 125 CNG అక్టోబర్ 2026లో లాంచ్ కానుంది. దీని ధర రూ. 1.00 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. టీవీఎస్ మోటార్ కంపెనీ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌ పో 2025లో ప్రపంచంలోనే మొదటి CNG స్కూటర్‌ను అన్‌ వీల్ చేసింది. ఇది సాధారణ జూపిటర్ 125 ఆధారంగా తయారైంది. బై-ఫ్యూయల్ (పెట్రోల్ + CNG) సిస్టమ్‌తో వస్తుంది. ఇది ఇంకా కాన్సెప్ట్ స్టేజ్‌లో ఉంది.  ప్రొడక్షన్ మోడల్ లాంచ్ కాలేదు. 124.8cc సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ (బై-ఫ్యూయల్) ఇంజిన్ ను కలిగి ఉంటుందని తెలుస్తుంది. సాధారణ జూపిటర్ 125 లాంటి డిజైన్.. LED హెడ్‌ ల్యాంప్, సెమీ డిజిటల్ క్లస్టర్, USB ఛార్జింగ్, ఇంటెల్లిజెంట్ స్టార్ట్ స్టాప్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, ఫ్రంట్ పెట్రోల్ ఫిల్లర్ ను కలిగి ఉంటుంది. CNG ట్యాంక్ వల్ల అండర్ సీట్ స్టోరేజ్ కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఈ స్కూటర్ బజాజ్ ఫ్రీడమ్ 125 CNG బైక్‌కు పోటీ ఇస్తుంది.

⦿ టీవీఎస్ ఫియెరో 125 (TVS Fiero 125)  

Advertisement

ఫియెరో 125 నవంబర్ 2026లో లాంచ్ కానుంది. దీని ధర రూ. 75,000 నుంచి అందుబాటులో ఉంటుంది. టీవీఎస్ మోటార్ కంపెనీ పాత ఫియెరో బ్రాండ్‌ను రీలాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఫియెరో 125 ఒక కమ్యూటర్ బైక్, TVS రైడర్ 125 ఆధారంగా రూపొందుతోంది. ఇది 125cc సెగ్మెంట్‌ లో హీరో స్ప్లెండర్, హోండా షైన్, బజాజ్ పల్సర్ 125 లాంటి వాటికి పోటీ ఇస్తుంది. ఇప్పటికే ట్రేడ్‌ మార్క్ అప్రూవ్ అయింది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌ మిషన్, ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్స్, రియర్ మోనోషాక్ సస్పెన్షన్ ను కలిగి ఉంటుంది. LED హెడ్‌ల్యాంప్, డిజిటల్ క్లస్టర్, స్పోర్టీ డిజైన్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

⦿ టీవీఎస్ iQube ST కాన్సెప్ట్ (TVS iQube ST 2025 Concept)

iQube ST కాన్సెప్ట్ బైక్ డిసెంబర్ 2026లో లాంచ్ కానుంది. దీని ధర రూ. 1.05 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. టీవీఎస్ మోటార్ కంపెనీ జనవరిలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌ పో 2025లో iQube ST 2025 కాన్సెప్ట్ను అన్‌వీల్ చేసింది. ఇది ప్రస్తుత iQube ST ఆధారంగా తయారైన ప్రీమియం వేరియంట్ కాన్సెప్ట్, ఎలిగెంట్ డిజైన్, అధునాతన ఫీచర్లతో వస్తుంది. బ్లూ కలర్ స్కీమ్‌ తో ప్రీమియం లుక్ ను కలిగి ఉంటుంది. 7-ఇంచ్ కస్టమైజబుల్ టచ్‌ స్క్రీన్ డిస్‌ప్లే, స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీ, జియో ఫెన్సింగ్, నావిగేషన్, అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, స్క్వేర్ ORVMలను కలిగి ఉంటుంది. 3.5 kWh/ 5.3 kWh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఒక్క ఛార్జ్ తో 145-212 km రేంజ్ తో వస్తుంది. ఇది ఓలా S1, బజాజ్ చేతక్, ఆథర్ 450X లాంటి వాటికి గట్టి పోటీ ఇస్తుంది.

Read Also: S-ప్రెస్సో To సెలెరియో.. చీప్ అండ్ బెస్ట్ మారుతి సుజుకి కార్లు ఇవే!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×