E-Paper
Advertisement

ఫస్ట్ ఇండియన్ సోలార్ ఎలక్ట్రిక్ కారు.. వావ్.. వైవ్ ఈవా ఎంత బాగుందో!

ఫస్ట్ ఇండియన్ సోలార్ ఎలక్ట్రిక్ కారు.. వావ్.. వైవ్ ఈవా ఎంత బాగుందో!
Advertisement

India’s First Solar Electric Car Vayve Eva: భారతీయ మార్కెట్ లోకి బోలెడు ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. అయితే, పలు ఆటో మోబైల్ సంస్థలు ఇప్పుడు సోలార్ పవర్ తో నడిచే కార్ల మీద ఫోకస్ పెట్టాయి. హ్యుందాయ్ లాంటి కంపెనీలు ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ కంపెనీ వైవ్ మొబిలిటీ క్రేజీ సోలార్ పవర్ కారును తయారు చేసింది. దానికి ‘ఈవా’ అని పేరు పెట్టింది. ఇది దేశంలో సౌరశక్తితో నడిచే తొలి ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దీనిని భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌ పో 2025లో పరిచయం అయ్యింది. సిటీలో తక్కువ దూర ప్రయాణాల కోసం తక్కువ ఖర్చుతో ఉపయోగించుకునేలా ఈ కారును డిజైన్ చేశారు.

రోజూ 12 కిమీ ప్రయాణించేలా..

ఈవా ప్రత్యేకత దాని సోలార్ వ్యవస్థ. కారు రూఫ్ మీద అమర్చిన సోలార్ ప్యానెల్స్ రోజూ అదనంగా 10–12 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా సాయపడుతాయి. అంటే, సంవత్సరానికి సుమారు 3,000 కిలోమీటర్ల వరకు అదనపు ప్రయాణాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇది సాధారణ ఛార్జింగ్‌ తో పాటు ఖర్చును తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

ఈవా బ్యాటరీ గురించి..

Advertisement

బ్యాటరీ పరంగా, ఈవా మూడు వేరియంట్లలో లభిస్తుంది. నోవా, స్టెల్లా, వేగా అనే మోడళ్లలో 9 kWh నుంచి 18 kWh వరకు బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, వేరియంట్‌ను బట్టి 125 కిమీ నుంచి 250 కిమీ వరకు రేంజ్ ఇస్తుంది. DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో, 15–20 నిమిషాల్లో 10% నుంచి 70% వరకు ఛార్జ్ అవుతుంది. ఇంట్లో సాధారణ 15A సాకెట్ ద్వారా సుమారు 5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది.

ముగ్గురు కూర్చునేలా…

డిజైన్ పరంగా చాలా కాంపాక్ట్‌ గా ఉంటుంది. దాదాపు 3 మీటర్ల పొడవుతో 3 డోర్ మైక్రో కారుగా రూపొందించారు. ఇందులో ముగ్గురు కూర్చునే అవకాశం ఉంటుంది. ఇద్దరు పెద్దలు, ఒక చిన్నారి కూర్చోవచ్చు. చిన్న సైజ్ వల్ల ట్రాఫిక్‌ లో సులభంగా నడిపే అవకాశం ఉంటుంది. పార్కింగ్ కూడా ఇబ్బందిగా ఉండదు.

అధునాతన భద్రతా సౌకర్యాలు

Advertisement

భద్రత, సౌకర్యాల విషయంలో కూడా ఈవా మంచి ఫీచర్లను కలిగి ఉంటుంది. మోనోకోక్ ఛాసిస్‌ పై నిర్మించబడిన ఈ కారు డ్రైవర్ ఎయిర్‌ బ్యాగ్, ABS, పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.  కొన్ని వేరియంట్లలో పనోరమిక్ సన్‌ రూఫ్, టచ్‌ స్క్రీన్‌ తో ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, సర్దుబాటు చేసే డ్రైవర్ సీటు, అలాగే చిన్న ఫ్రిజ్‌ లా పనిచేసే  చిల్ బాక్స్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.

బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ విధానం..   

ఈ కారు ధర సుమారు రూ. 3.25 లక్షలు ఉండబోతోంది. అయితే, బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS)  విధానంలో ఈ కారును తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. పనితీరు పరంగా ఈవా గరిష్టంగా గంటకు 80 కి.మీ వేగాన్ని అందిస్తుంది. 0 నుంచి 40 కి.మీ వేగాన్ని కేవలం 5 సెకన్లలో చేరుకుంటుంది. 300 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. తక్కువ దూర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ ఏడాది చివర్లో డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Read Also: ఫీచర్లలో విన్‌ఫాస్ట్ VF3 సూపర్.. కానీ, ఇండియాలో హిట్ కొట్టేనా?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×