E-Paper
Advertisement

ఫీచర్లలో విన్‌ఫాస్ట్ VF3 సూపర్.. కానీ, ఇండియాలో హిట్ కొట్టేనా?

ఫీచర్లలో విన్‌ఫాస్ట్ VF3 సూపర్.. కానీ, ఇండియాలో హిట్ కొట్టేనా?
Advertisement

VinFast VF3 in India: వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ ఆటోమోబైల్ విన్‌ఫాస్ట్ కంపెనీ రూపొందించిన చిన్న, ఆకర్షణీయమైన ఎలక్ట్రిక్ మైక్రో SUV VF3. సిటీలో రోజువారీ ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది. రెండు డోర్లు ఉన్న ఈ కారు బాక్సీ డిజైన్‌తో మినీ SUV లుక్‌ తో చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది.

ఒకే ఛార్జ్ తో 215 కి.మీ ప్రయాణం

ఈ కారులో 18.64 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. పూర్తి ఛార్జ్‌ పై సుమారు 215 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల బ్యాటరీని 10% నుంచి 70% వరకు కేవలం 36 నిమిషాల్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. పని తీరు పరంగా చూస్తే, ఇందులో రియర్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. 40 hp పవర్, 110 Nm టార్క్‌ ను అందిస్తుంది. పరిమాణంలో చిన్నదిగా ఉండటం వల్ల సిటీ ట్రాఫిక్ లో  నడపడం, పార్కింగ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. 3.2 మీటర్ల పొడవుతో కాంపాక్ట్ కార్లలో ఒకటిగా ఉంటుంది. లోపల నలుగురు కూర్చునేలా ఉంటుంది. 10 అంగుళాల టచ్‌ స్క్రీన్, స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీ, ABS, హిల్ స్టార్ట్ అసిస్ట్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు భారత్ లో రూ. 10 లక్షల లోపు ఉండొచ్చని తెలుస్తోంది.  చిన్న కుటుంబాలు, రోజూ సిటీ ప్రయాణాలు చేసే వారికి బెస్ట్ ఆప్షన్ గా ఉంటుంది.

ఇండియాలో విన్‌ ఫాస్ట్ VF3 సత్తా చాటేనా?

Advertisement

విన్‌ ఫాస్ట్ VF3ను అర్బన్ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. అయితే, భారత మార్కెట్‌లో ఈ కారు పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంబోతోంది. ముఖ్యంగా చౌక ధరల రేంజ్ లో పోటీ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికే MG కామెట్, టాటా టియాగో EV లాంటి మోడళ్లు భారత్ లో బాగా అమ్ముడవుతున్నాయి. వీటికి మంచి సర్వీస్ నెట్‌వర్క్, బ్రాండ్ నమ్మకం, ప్రాక్టికల్ యూజ్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో VF3కి మార్కెట్‌ లో మంచి సత్తా చాటడం అంత సులభం కాదు.

ధర విషయంలోనూ గట్టి పోటీ..

ఇంకా ఒక ముఖ్యమైన విషయం ధర. భారత వినియోగదారులు ఎక్కువగా వాల్యూ ఫర్ మనీని చూస్తారు. అంటే తక్కువ ధరకు ఎక్కువ ఫీచర్లు, మంచి రేంజ్ కావాలి. VF3 ధర తక్కువగా ఉంటేనే ప్రజల్లో ఆదరణ పొందే అవకాశం ఉంది. లేకపోతే, ఇప్పటికే ఉన్న బ్రాండ్లకు వినియోగదారులు ప్రాధాన్యత ఇస్తారు. రేంజ్, ఛార్జింగ్ కూడా కీలక అంశాలు. నగర వినియోగానికి సరిపడే రేంజ్ ఉన్నా, భారత్ లో చాలా మంది ఒకే కారును అన్ని అవసరాలకు ఉపయోగిస్తారు. కాబట్టి, కొంతమేర లాంగ్ డ్రైవ్స్‌ కి కూడా ఉపయోగపడాలి. ఈ విషయంలో VF3 ఎలా పనిచేస్తుందో చూడాలి. కొత్త కంపెనీగా విన్‌ఫాస్ట్ భారత్ లో తన సర్వీస్, ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేయాలి. వినియోగదారులు కారును కొనుగోలు చేసిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ఇదే బ్రాండ్‌పై నమ్మకాన్ని పెంచుతుంది. విన్‌ఫాస్ట్ VF3 మంచి ఆలోచనతో రూపొందించిన ఎలక్ట్రిక్ కారు. కానీ, భారత మార్కెట్‌ లో సక్సెస్ కావాలంటే ధర, రేంజ్, సర్వీస్ లాంటి అంశాల్లో బలంగా ఉండాలి.

Advertisement

Read Also: క్రూజ్ కంట్రోల్, హీటెడ్ సీట్‌.. కళ్లు చెదిరే జోంటెస్ స్కూటర్ లాంచ్!

Related News

క్లాసిక్ లుక్.. మోడ్రన్ టెక్నాలజీ.. ట్రయంఫ్ బోన్నెవిల్ T40 వచ్చేసింది!

టెస్లా రోడ్‌స్టర్‌లో ఎయిర్ థ్రస్టర్లు.. ఫెరారీకి ఈ ఆలోచన 2018లో వచ్చిందా?

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ vs గ్రాండ్ విటారా vs టయోటా హైరైడర్.. వీటిలో ఏది కొనాలంటే?

స్కోడా కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. కైలాక్‌పై ఏకంగా రూ.90 వేల తగ్గింపు!

డౌన్ పేమెంట్ లేకుండానే బైక్ కొనేయండి.. జావా, యెజ్డీ అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్లు!

ఏకంగా 4 SUVలు, ఓ పికప్ ట్రక్.. జీప్ ప్లాన్ మామూలుగా లేదుగా!

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Big Stories

Advertisement
×