E-Paper
Advertisement

Vespa Officina 8: స్పెషల్ ఎడిషన్ వెస్పా వచ్చేసింది, ధర ఎంతో తెలుసా?

Vespa Officina 8:  స్పెషల్ ఎడిషన్ వెస్పా వచ్చేసింది, ధర ఎంతో తెలుసా?
Advertisement

Vespa Officina 8 Launched: భారతీయ మార్కెట్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వెస్పా కంపెనీ, మరో సరికొత్త టూ వీలర్ ను విడుదల చేసింది. వెస్పా అఫిసినా 8 పేరుతో ఈ స్పెషల్ ఎడిషన్ స్కూటర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటలీ పోంటెడెరాలోని పియాజియో ప్లాంట్‌ లోని ప్రయోగాత్మక విభాగానికి ట్రిబ్యూట్ గా ఈ స్పెషల్ ఎడిషన్ స్కూటర్ ను విడుదల చేసింది. ఎందుకంటే, అదే ప్ఆంట్ లో మొదటి వెస్పా ప్రోటో టైప్‌ ను అభివృద్ధి చేశారు. దానికి గుర్తుగా వర్క్ షాప్ పేరు పెట్టారు. బ్రాంజ్ మాట్టే మెటాలిక్ బ్లూ కలర్‌ తో ఈ స్పెషల్ ఎడిషన్ స్కూటర్ విడుదల అయ్యింది.

ఆఫిసినా 8 పేరు ప్రత్యేకత ఏంటి?

వాస్తవానికి వెస్పాకు సంబంధించిన పుట్టుక 1944లో పియాజియో పోంటెడెరా ప్లాంట్‌ లో మొదలయ్యింది. ఈ వర్క్‌ షాప్‌ లో కొత్త మోడల్స్ ను డెవలప్ చేశారు. అక్కడి ఇంజనీర్లు, డిజైనర్లు, మెకానిక్‌ల బృందం ఉంది. 1946 నాటికి, వారి ప్రయోగాలు వెస్పా  పేటెంట్‌ లో ముగిశాయి. ఆ తర్వాత వెస్పా స్కూటర్ ప్రపంచ వ్యాప్తంగా సృష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు. వెస్పా పుట్టిన ప్లాంట్ పేరే ఇప్పుడు కొత్త ఎడిషన్ కు నామకరణం చేశారు.

వెస్పా అఫిసినా 8 డిజైన్ గురించి..

Advertisement

వెస్పా అఫిసినా 8 స్టీల్ బాడీని కలిగి ఉంది.  దీనిలో మెటాలిక్ రివెట్స్, ఇత్తడి, అల్యూమినియం టోన్లతో మ్యాట్ మెటాలిక్ బ్లూ అఫిసినా 8 ఫినిషింగ్ ఉంది. ఇది స్కూటర్‌ కు విలక్షణమైన అందాన్ని అందిస్తుంది. వెస్పాకు స్పెషల్ అట్రాక్షన్ అయిన  రౌండ్ హెడ్‌ ల్యాంప్, స్వీపింగ్ లైన్లకు మించి, ఈ ప్రత్యేక ఎడిషన్ థీమ్‌కు చక్కగా సరిపోయే రిబ్బెడ్ సీటును కలిగి ఉంటుంది.

Read Also:  కళ్లు చెదిరేలా టయోటా హైలాండర్ EV 2027, ఈ కారు ప్రత్యేకతలు ఏంటో తెలుసా భయ్యా!

రెండు వెర్షన్లలో వెస్పా అఫిసినా 8 స్కూటర్  

Advertisement

వెస్పా ఇండియా పోర్ట్‌ ఫోలియోలోని ఇతర స్కూటర్ల మాదిరిగానే  అఫిసినా 8 రెండు వెర్షన్లలో అందుబాటులోకి రానుంది.  అందులో ఒకటి 125cc కాగా, మరొకటి 150cc. ఈ రెండు ఇంజిన్లు స్మూత్ గా, మరింత ఫ్యూయెల్ ఎప్షినయెన్సీతో వస్తున్నాయి. అటు వెస్పా అఫిసినా 8 డెడికేటెడ్ అపారెల్స్ ను కూడా ప్రవేశపెట్టింది. కొనుగోలుదారులు రంగు సరిపోలిన టాప్ బాక్స్‌ ను ఎంచుకోవచ్చు. ప్రతి స్కూటర్‌ తో పాటు వర్క్‌ షాప్ చరిత్రను వెల్లడించే పుస్తకం, రంగు సరిపోలిన హాఫ్ ఫేస్ హెల్మెట్‌ ను కలిగి ఉన్న వెల్ కమ్ కిట్ ఉంటుంది. వెస్పా అఫిసినా 8 దేశం అంతటా ఎంపిక చేసిన వెస్పా డీలర్‌ షిప్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇక ఈ స్కూటర్ ధరను కంపెనీ రూ. 1.34 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది.

Read Also: ఒకే ఛార్జ్ తో 200 కి.మీ ప్రయాణం, అదిరిపోయే మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటో వచ్చేసింది!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×