E-Paper
Advertisement

Vinfast EVs Crash Test: క్రాష్ టెస్ట్ లో దుమ్మురేపిన విన్ ఫాస్ట్ కార్లు, సేఫ్టీ రేటింగ్ ఎంతో తెలుసా?

Vinfast EVs Crash Test: క్రాష్ టెస్ట్ లో దుమ్మురేపిన విన్ ఫాస్ట్ కార్లు, సేఫ్టీ రేటింగ్ ఎంతో తెలుసా?
Advertisement

విన్ ఫాస్ట్ నుంచి విడుదలైన ఎలక్ట్రిక్ కార్లు VF 6, VF 7 క్రాష్ టెస్ట్ లో దుమ్మురేపాయి. భారత్ NCAP పరీక్షలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ ను పొందాయి. రెండు మోడళ్లు  పలు రకాల క్రాష్ టెస్టులో పెద్దలు, పిల్లలకు అద్భుతమైన ప్రొటెక్షన్ ను అందించాయి. క్రాష్ పరీక్షల్లో టాప్ రేటింగ్ పొందడం పట్ల కంపెనీ సంతోషం వ్యక్తం చేసింది. కస్టమర్లకు అధునాతన, సురక్షితమైన ఎలక్ట్రిక్ మొబిలిటీని అందించేందుకు ముందుంటుందని ప్రకటించింది.

5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించిన రెండు ఈవీ కార్లు

వియత్నాం ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ అయిన విన్ ఫాస్ట్ తాజాగా తన రెండు EVలు, VF 6, VF 7కు భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (భారత్ NCAP) ద్వారా టాప్ 5-స్టార్ భద్రతా సర్టిఫికేషన్ లభించిందని ప్రకటించింది. ముఖ్యంగా  VF 6 అడల్ట్ ప్రయాణీకుల రక్షణలో 32కు 27.13 పాయింట్లు సాధించింది. చిల్డ్రన్ రక్షణలో 49కి 44.41 పాయింట్లను నమోదు చేసింది. VF 7 పెద్దలకు సంబంధించి 32కు, 28.54 పాయింట్లు సాధించింది. చిల్డ్రన్ విషయంలో 49కి 45.25 పాయింట్లు సాధించింది. ఈ స్కోర్‌ రెండు మోడళ్లలోనూ ప్రయాణీకులకు మంచి భద్రత అందిస్తున్నట్లు వెల్లడించింది.

Advertisement

ఈ రెండు మోడళ్లకు సంబంధించి ఫ్రంటల్ ఇంపాక్ట్ పరీక్షలలో, VF 6, VF 7లో డ్రైవర్, ప్రయాణీకులకు తల, మెడ, ఎగువ కాలు ప్రొటెక్షన్ కు సంబంధించిన స్కోర్‌ 4.000 పాయింట్లకు చేరుకున్నాయి. ఇది భారత్ NCAP స్కేల్‌లో టాప్. సైడ్ ఇంపాక్ట్ పరీక్షలలో, రెండు వాహనాలు అడల్ట్ ప్యాసింజర్లకు 16.000/16.000, పిల్లలకు 8.000/8.000 పూర్తి స్కోర్లను సాధించాయని విన్ ఫాస్ట్ వెల్లడించింది. ఇక పోల్ సైడ్ ఇంపాక్ట్ టెస్ట్‌ లో, VF 6, VF 7  కార్లు తలకు సంబంధించి గాయం పాయింట్లు వరుసగా 109, 131 నిమోదయ్యాయి. ఇది భారత్ NCAP క్రిటికల్ థ్రెషోల్డ్ 700 కంటే  చాలా తక్కువగా ఉంది. ఈ ఫలితాలు హై రిస్క్ క్రాష్ సమయంలో తలను చాలా సేఫ్ గా ఉంచుతాయని వెల్లడించాయి. ఈ టెస్ట్ ఫలితాలు తమ వినియోగదారులకు మరింత నమ్మకాన్ని కలిగిస్తాయని విన్ ఫాస్ట్ ఇండియా CEO తపన్ ఘోష్ వెల్లడించారు.

VinFast VF 6  కారు గురించి..

విన్ ఫాస్ట్ 6లో మొత్తం మూడు వేరియంట్లు ఉన్నాయి. వాటిలో ఒకటి ఎర్త్, ఇంకోటి విండ్,  మరొకటి విండ్ ఇన్ఫినిటీ. ఈ కారు 130 kW పవర్, 250 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇండిపెండెంట్ రియర్ సస్పెన్షన్ ను కలిగి ఉంటుంది. మల్టిపుల్ డ్రైవ్ మోడ్‌లు, ఆటోమేటిక్ AC, పవర్డ్ డ్రైవర్ సీటు, క్రూయిజ్ కంట్రోల్, 12.9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, పియానో  గేర్ సెలెక్టర్ ఉంటుంది. ఒక్క చార్జ్ మీద ఏకంగా 468 కి.మీ ప్రయాణించే అవకాశం ఉంటుంది.

VinFast VF 7 కారు గురించి..   

Advertisement

VinFast VF 7లో ఏకంగా 5 వేరియంట్లు ఉన్నాయి. ఎర్త్, విండ్, స్కై, విండ్ ఇన్ఫినిటీ, స్కై ఇన్ఫినిటీ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చాయి. ఇందులో 59.6 kWh బ్యాటరీ ఉంటుంది. 130 kW పవర్, 250 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 24 నిమిషాల్లో 10 నుంచి 70% ఛార్జ్ అవుతుంది. రెయిన్ సెన్సింగ్ వైపర్లు, 19 అంగుళాల అల్లాయ్ వీల్స్, పియానో ​​గేర్ సెలెక్టర్ ఉంటుంది. ఒకే ఛార్జ్ మీద ఏకంగా  438 కి.మీ ప్రయాణించే అవకాశం ఉంటుంది.

Read Also: కొత్త థార్ రాక్స్ స్పెషల్ ఎడిషన్ వచ్చేస్తోంది, టీజర్ చూస్తేనే కొనాలనిపిస్తుందిగా!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×