E-Paper
Advertisement

New Mahindra Thar Roxx: కొత్త థార్ రాక్స్ స్పెషల్ ఎడిషన్ వచ్చేస్తోంది, టీజర్ చూస్తేనే కొనాలనిపిస్తుందిగా!

New Mahindra Thar Roxx: కొత్త థార్ రాక్స్ స్పెషల్ ఎడిషన్ వచ్చేస్తోంది, టీజర్ చూస్తేనే కొనాలనిపిస్తుందిగా!
Advertisement

మహీంద్రా థార్ రాక్స్‌ ను కొనాలనే ఆలోచన ఉందా? అయితే, కొద్ది రోజులు మీ నిర్ణయాన్ని వాయిదా వేసుకోండి. ఎందుకంటే, త్వరలో థార్ రాక్స్ స్పెషల్ ఎడిషన్ విడుదల కాబోతోంది. తాజాగా ఈ కొత్త కారుకు సంబంధించి టీజర్ ను కంపెనీ విడుదల చేసింది. విలక్షణమైన డిజైన్, అదనపు ఫీచర్లతో కొత్త స్పెషల్ ఎడిషన్ రాబోతోందని సూచిస్తుంది. టీజర్ లో ఈ కారు కొత్త కలర్ థీమ్ తో ఆకట్టుకుంది. రాబోయే వెర్షన్ పూర్తిగా బ్లాక్ ఎడిషన్ కావచ్చని తెలుస్తోంది. ఇది స్కార్పియో N,   XUV700 మోడల్స్ మాదిరిగా ఉంటుందని భావిస్తున్నారు. బ్లాక్, ఎబోనీగా బ్రాండ్ చేయబడిన ఆ ఎడిషన్లు, క్రోమ్ ప్లేస్ లో  బ్లాక్ అవుట్ యాక్సెంట్లతో పాటు వాటి ప్రత్యేక ఎడిషన్ స్టేటస్ ను హైలైట్ చేయడానికి అద్భుతమైన బ్యాడ్జ్‌ల ను కలిగి ఉంటుంది.

స్పెషల్ ఎడిషన్ ప్రత్యేకతలు ఏంటి?

స్పెషల్ ఎడిషన్ ప్రస్తుత మోడల్ నుంచి డిఫరెంట్ గా చూపించేందుకు కొత్త అప్హోల్స్టరీ, ప్రత్యేకమైన బ్యాడ్జింగ్‌ను కూడా కలిగి ఉంటుందని భావిస్తున్నారు. పూర్తిగా బ్లాక్ వెర్షన్ కాకపోతే, మహీంద్రా లోపల, బయట డిఫరెంట్ కలర్ స్కీమ్స్ తో మరో ప్రత్యేక ఎడిషన్ ను తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ కారు గురించి కంపెనీ ఎలాంటి అధికారిక వివరాలను వెల్లడించలేదు.  ఇది ఫేస్‌లిఫ్ట్ వచ్చు అనే ఊహాగానాలు కూడా ఉన్నాయి.

మహీంద్రా థార్ రాక్స్ ఇంజిన్ గురించి..

Advertisement

మహీంద్రా థార్ రాక్స్ రెండు ఇంజన్ ఎంపికలతో అందించబడుతుంది. అందులో ఒకటి MStallion 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఇది 177 PS పవర్, ఆటోమేటిక్ వేరియంట్లలో 380 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్ వేరియంట్లలో 162 PS పవర్, 330 nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ విషయానికి వస్తే, 2.2-లీటర్ MHawk టర్బో డీజిల్ 4×4 వేరియంట్లలో 175 PS పవర్, 370 nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. RWD వేరియంట్లలో 152 PS పవర్‌ను, 330 nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్లు 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్ ను కలిగి ఉన్నాయి.

మహీంద్రా థార్ రాక్స్  ఫీచర్లు

ఇక ఫీచర్ల విషయానికొస్తే, రాక్స్ కారులో పనోరమిక్ సన్‌ రూఫ్, 19 అంగుళాల అల్లాయ్ వీల్స్, లెదర్‌ తో కూడిన డోర్ ట్రిమ్‌లు, 6 వే పవర్డ్ డ్రైవర్ సీటు, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, కూల్డ్ గ్లోవ్ బాక్స్, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, అబ్‌స్టకిల్ వ్యూ, సబ్‌ వూఫర్‌ తో కూడిన 9 స్పీకర్ హర్మాన్, కార్డాన్ స్పీకర్లు, పవర్ ఫోల్డబుల్ ORVM, 65 వాట్ USB C పోర్ట్‌లు, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తిగా డిజిటల్ క్లస్టర్, ఆపిల్ కార్‌ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌ లెస్ ఛార్జర్, అకౌస్టిక్ విండ్‌ షీల్డ్,  వైపర్‌లతో కూడిన ఆటో హెడ్‌ లైట్లు, ఫుట్‌ వెల్ లైటింగ్, యాంబియంట్ లైటింగ్ ను కలిగి ఉంటుంది.

Advertisement

Read Also: రోజువారీ అవసరాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, రేంజ్ కూడా సూపరండోయ్!

Related News

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×