E-Paper
Advertisement

విన్‌ ఫాస్ట్ నుంచి క్రేజీ స్కూటర్లు.. టీవీఎస్, ఏథర్‌కు కష్టాలే!

విన్‌ ఫాస్ట్ నుంచి క్రేజీ స్కూటర్లు.. టీవీఎస్, ఏథర్‌కు కష్టాలే!
Advertisement

Upcoming VinFast Scooters in India: వియత్నాంకు  చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ సంస్థ విన్‌ ఫాస్ట్, ఇండియన్ మార్కెట్ మీద ఫోకస్ పెట్టింది. ఈ ఏడాదిలోనే క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. దేశంలో వేగంగా పెరుగుతున్న ఈవీ డిమాండ్‌ ను దృష్టిలో పెట్టుకుని, ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఒకేసారి మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల

2026 మిడ్ ఇయర్ లో మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయాలని విన్ ఫాస్ట్ కంపెనీ ప్రయత్నిస్తోంది. ఈ స్కూటర్లను తొలుత మెట్రో నగరాల్లోని ప్రత్యేక షోరూమ్‌ల ద్వారా విక్రయించడం ప్రారంభిస్తారు. తరువాత, దశలవారీగా ఇతర నగరాలకు కూడా విస్తరించనున్నారు. కంపెనీ తన సేల్స్ నెట్‌వర్క్‌ ను క్రమంగా బలోపేతం చేసుకునే అవకాశముంది.

స్పెషల్ అట్రాక్షన్ గా విన్‌ఫాస్ట్ వైపర్

Advertisement

విన్‌ఫాస్ట్  లైనప్‌ లో ముఖ్యమైన మోడల్‌ గా వైపర్ గుర్తింపు తెచ్చుకోనుంది. ఈ స్కూటర్ డిజైన్ పరంగా చాలా అందంగా ఉంటుంది. స్పోర్టీ లుక్, షార్ప్ లైన్స్, ముందుభాగంలో అమర్చిన ఎల్ఈడీ హెడ్‌ లైట్ దీని ప్రత్యేకతలు. ఇతర స్కూటర్లతో పోలిస్తే ఇది కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది. యువతను ఎక్కువగా ఆకట్టుకునే అవకాశం ఉంది.

వైపర్ పనితీరు గురించి..

పనితీరు విషయానికి వస్తే, ఈ స్కూటర్‌లో 3kW సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది రోజువారీ సిటీ ప్రయాణాలకు సరిపడే పవర్ ను అందిస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే, 1.5kWh సామర్థ్యం కలిగిన  రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌ ను అందిస్తున్నారు. ఈ బ్యాటరీని సులభంగా తీసి ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదనంగా, మరో బ్యాటరీ ప్యాక్‌ ను ఉపయోగించడం ద్వారా ఈ స్కూటర్ రేంజ్‌ ను గరిష్టంగా 156 కిలోమీటర్ల వరకు పెంచుకోవచ్చు.

రెండు మోడ్స్ లో అందుబాటులోకి..

Advertisement

రైడింగ్ ఎక్స్ పీరియెన్స్ ను మెరుగుపరచడానికి ఈ స్కూటర్‌లో ఎకో, పవర్ అనే రెండు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఎకో మోడ్ ఎక్కువ రేంజ్ ఇవ్వడంపై దృష్టి పెడితే, పవర్ మోడ్ మెరుగైన పనితీరును అందిస్తుంది. అంతేకాదు, కీలెస్ స్టార్ట్, స్టాప్ సిస్టమ్, కలర్ టీఎఫ్‌టీ డిస్‌ ప్లే లాంటి ఆధునిక ఫీచర్లు కూడా ఇందులో ఉంటాయి.

గట్టిపోటీ తప్పదా?

భారత మార్కెట్‌లోకి ప్రవేశించడం విన్‌ఫాస్ట్‌కు అంత ఈజీ కాదు. ఇప్పటికే టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, ఏథర్ రిజ్టా లాంటి పాపులర్ మోడళ్లతో పోటీ చాలా గట్టిగా ఉంది. మంచి ధర, ఎక్కువ సర్వీస్ నెట్‌ వర్క్, సరైన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను అందించడం కంపెనీకి కీలకం. మొత్తంగా, విన్‌ ఫాస్ట్ స్కూటర్లు భారత మార్కెట్‌లోకి రావడం ఈవీ విభాగానికి మరింత జోష్ తీసుకురానుంది. కొత్త ఆప్షన్స్ అందుబాటులోకి రావడంతో వినియోగదారులకు మెరుగైన వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. విడుదల తర్వాత ఈ స్కూటర్లు మార్కెట్‌ లో ఎలా సత్తా చాటుతాయో చూడాలి.

Read Also: మడతపెట్టే ఈవీ స్కూటర్ వచ్చేసింది.. బరువు జస్ట్ 20 కేజీలే!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×