E-Paper
Advertisement

Ather EV Scooters: ఇక మరింత చౌకగా ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎందుకో తెలుసా?

Ather EV Scooters: ఇక మరింత చౌకగా  ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎందుకో తెలుసా?
Advertisement

చక్కటి ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకొస్తున్న ఏథర్ ఎనర్జీ కంపెనీ ఇక కొత్త ప్లాట్ పారమ్ మీద తన ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేయబోతోంది. ప్రస్తుతం అత్యధికంగా అమ్ముడవుతున్న రూ.1 లక్ష నుంచి రూ.1.25 లక్షల లోపు వాహనాలను EL ప్లాట్‌ ఫార మీద డెవలప్ చేయనుంది. ఈ విషయాన్ని ఏథర్ కన్ఫార్మ్ చేసింది. ఏథర్ ఎనర్జీ తన నెక్ట్స్ దశ వృద్ధికి మరింత విస్తృత శ్రేణిని లక్ష్యంగా చేసుకోబోతున్నట్లు తెలిపింది.

అన్ని స్కూటర్లు ఒకే ప్లాట్ ఫారమ్ మీద..

ఇప్పటి వరకు 450X, 450 ప్లస్ లాంటి ప్రీమియం ఆఫర్లకు ఏథర్ ప్రసిద్ధి చెందింది. ఈ స్కూటర్లు పనితీరు, సాంకేతికత, విశ్వసనీయతతో కంపెనీకి మంచి గుర్తింపు తెచ్చాయి. బలమైన బ్రాండ్ ఇమేజ్‌ ను నిర్మించడంలో సహాయ పడినప్పటికీ, వాటి ధర కారణంగా చాలా మంది కొనుగోలుకు తక్కువ మొగ్గు చూపించారు. ఈ నేపథ్యంలోనే ఈ EL ప్లాట్‌ ఫారమ్‌ తో, ఏథర్  దానిని మార్చాలనుకుంటోంది. ఈ విషయాన్ని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, CEO తరుణ్ మెహతా వెల్లడించారు. “ఏథర్ ప్రస్తుత పోర్ట్‌ ఫోలియోను విస్తరించాలనుకుంటుంది. ఆప్షనల్ ప్యాక్‌ల ధరను యాడ్ చేసిన తర్వాత రూ. 1 లక్ష నుంచి 1.25 లక్షల వరకు ఉంటుంది. ఈ ధర పరిధిలో ఏథర్ బలంగా దూసుకెళ్తోంది. EL ప్లాట్‌ ఫారమ్ తో మరింత బలమైన మార్కెట్ సాధింస్తామనే నమ్మకం ఉంది” అన్నారు.

EL ప్లాట్‌ ఫారమ్‌ ప్రత్యేకత ఏంటి?

Advertisement

EL ప్లాట్‌ ఫారమ్‌ ప్రత్యేకత ఏంటంటే.. ప్రతి స్కూటర్‌ కు పూర్తిగా కొత్త బేస్‌ ను రూపొందించడానికి బదులుగా, ఏథర్ ఒకే పునాదిపై  మల్టీఫుల్ ప్రొడక్ట్స్ ను తయారు చేస్తుంది. ఈ విధానం ద్వారా డెవలప్ మెంట్ ఖర్చులను తగ్గించడమే కాకుండా, మారుతున్న కస్టమర్ అవసరాలకు బ్రాండ్ వేగంగా స్పందించడానికి అనుమతిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే, ఏథర్ ప్రతిసారీ మొదటి నుంచి ప్రారంభించకుండా, పలు రకాల రైడర్ల కోసం ఒకేసారి ఈ ప్లాట్ ఫారమ్ మీద రూపొందించే అవకాశం ఉంటుంది.

సరసమైన EL ప్లాట్ ఫారమ్ సరసమైన స్కూటర్లతో పాటు లేటెస్ట్ ప్రీమియం స్కూటర్లకు వరకు సపోర్టు చేయనుంది. ఏథర్ కు సంబంధించి ఇప్పటికే మార్కెట్ లో బలంగా ఉన్న మోడల్స్ వరకు తయారు కానుంది. అయితే, ప్రస్తుతం రూ. 1-1.25 లక్షల విభాగంలో ఉండే స్కూటర్లను తయారు చేయనుంది. ఈ పరిధిలోని ఎలక్ట్రిక్ స్కూటర్లతో బ్రాండ్ వ్యాల్యూను మరింత పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది.

Advertisement

ఇప్పటికే ఉన్న ఏథర్ కస్టమర్లు ప్రస్తుత మోడళ్ల నుంచి EL ఆధారిత స్కూటర్లకు మారవచ్చని కంపెనీ వెల్లడించింది. అయితే, కొత్త ప్లాట్‌ ఫామ్ వ్యయ నిర్మాణం.. ప్రస్తుతం బిజినెస్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కంపెనీ ప్రకటిచింది. ఇప్పటికే కొత్త ప్లాట్ ఫారమ్ కు సంబంధించి పనులు కొనసాగుతున్నాయి. అయితే,    ప్రస్తుతానికి, కంపెనీ ఫోకస్ స్కూటర్ లైనప్‌ ను బలోపేతం చేయడంపై పెట్టినట్లు వివరించింది.

Read Also: యమహా EC-06 ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

Related News

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

Big Stories

Advertisement
×