E-Paper
Advertisement

భారత్‌ లోకి 3 విన్‌ ఫాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. చేతక్, ఐక్యూబ్‌ కు ఇక చుక్కలేనా?

భారత్‌ లోకి 3 విన్‌ ఫాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. చేతక్, ఐక్యూబ్‌ కు ఇక చుక్కలేనా?
Advertisement

VinFast India Scooter Lineup: వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ ఫాస్ట్ భారత మార్కెట్లో  మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే VF 6, VF 7 ఎలక్ట్రిక్ కార్లను దేశంలో అందుబాటులోకి తీసుకొచ్చిన కంపెనీ.. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంపై దృష్టి పెట్టింది. దేశంలో పెరుగుతున్న ఈవీ డిమాండ్‌ ను దృష్టిలో ఉంచుకుని మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకురావాలని ప్రణాళికలు రూపొందిస్తోంది.

ఒకేసారి మూడు ఈవీ స్కూటర్లు విడుదల

విన్‌ ఫాస్ట్ ఇండియన్ ఈవీ మార్కెట్ లోకి ఇవో (Evo), ఫెలిజ్ (Feliz), వైపర్ (Vyper) పేర్లతో మూడు స్కూటర్లను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం ఈ మోడళ్లు విదేశీ మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి. వీటిని భారత రోడ్లకు, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసి విడుదల చేయనుంది.  ఈ స్కూటర్లను తమిళనాడులో ఏర్పాటు చేస్తున్న విన్‌ ఫాస్ట్ ప్లాంట్‌ లో అసెంబుల్ చేయనున్నారు. కంపెనీ కంప్లీట్లీ నాక్డ్ డౌన్ (CKD) కిట్ల రూపంలో భాగాలను దిగుమతి చేసుకుని ఇక్కడే తయారీ ప్రక్రియను పూర్తి చేయనుంది. దీంతో ధరలను పోటీ స్థాయిలో ఉంచే అవకాశం ఉంటుంది.

విన్‌ ఫాస్ట్ ఈవీల రేంజ్!

Advertisement

విన్‌ ఫాస్ట్ తీసుకురానున్న మోడళ్లలో ఫెలిజ్, వైపర్ స్కూటర్లు ఇప్పటికే ఇతర ఆసియా దేశాల్లో మంచి ఆదరణ పొందాయి. ఫెలిజ్ మోడల్‌ లో 3 kWh బ్యాటరీ ప్యాక్‌ తో పాటు 2.8 kW ఎలక్ట్రిక్ మోటార్‌ ను అందిస్తున్నారు. ఇది రోజువారీ నగర ప్రయాణాలకు అనుకూలంగా రూపొందించబడింది. మరోవైపు, వైపర్ స్కూటర్ మరింత శక్తివంతమైన మోడల్‌ గా రానుంది. ఇందులో 4.8 kWh బ్యాటరీ ప్యాక్‌ తో పాటు 3 kW ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఎక్కువ రేంజ్‌ తో పాటు మెరుగైన పనితీరును కోరుకునే వినియోగదారులను ఇది ఆకర్షించే అవకాశం ఉంది.  ఇక ఇవో మోడల్ సంప్రదాయ స్కూటర్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. భారత మార్కెట్లో ఇప్పటికే ప్రాచుర్యం పొందిన బజాజ్ చేతక్, ఏథర్ రిజ్టా, టీవీఎస్ ఐక్యూబ్ లాంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఇందులో 2.4 kWh బ్యాటరీ ప్యాక్, 2.25 kW హబ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌ ను అందించనున్నారు.

భారత్ మరింత పోటీ తప్పదా?

దేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్స్ మార్కెట్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో విన్‌ ఫాస్ట్ ఎంట్రీ పోటీని మరింత పెంచే అవకాశం ఉంది. ధరలు, రేంజ్, ఫీచర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు. అయితే, స్థానికంగా అసెంబుల్ చేసే కారణంగా ఈ స్కూటర్లు సరసమైన ధరల్లో అందుబాటులోకి వచ్చే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

Read Also: 105 కి.మీ రేంజ్‌ తో క్రేజీ ఎలక్ట్రిక్ సైకిల్.. కిలో మీటర్‌ జస్ట్ 10 పైసలే!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×