E-Paper
Advertisement

ఒకే ఛార్జ్ తో 517 కి.మీ ప్రయాణం, భారత్‌ లోకి విన్‌ఫాస్ట్ VF MPV 7 గ్రాండ్ ఎంట్రీ!

ఒకే ఛార్జ్ తో 517 కి.మీ ప్రయాణం,  భారత్‌ లోకి విన్‌ఫాస్ట్ VF MPV 7 గ్రాండ్ ఎంట్రీ!
Advertisement

VinFast VF MPV 7 Launched in India: వియత్నాంకు చెందిన వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ భారత మార్కెట్‌లో తన ఎలక్ట్రిక్ వెహికల్స్ ను మరింత వేగంగా విస్తరిస్తోంది. తాజాగా కొత్త ఎలక్ట్రిక్ MPV అయిన VF MPV 7ను విడుదల చేసింది. ఈ మోడల్ ఒక్క వేరియంట్‌లోనే అందుబాటులో ఉండగా, ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ. 24.49 లక్షలుగా నిర్ణయించింది.  కుటుంబ అవసరాలకు అనుకూలంగా ఉండే ఈ ఎలక్ట్రిక్ MPV, మార్కెట్లో ఇప్పటికే ఉన్న కియా కేరెన్స్ క్లావిస్ EV, BYD eMax 7 లాంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

విన్‌ఫాస్ట్ VF MPV 7 డిజైన్ గురించి..

VF MPV 7 పొడవు 4,740 మిల్లీమీటర్లు, వెడల్పు 1,872 మిల్లీమీటర్లు, ఎత్తు 1,734 మిల్లీమీటర్లు కాగా, వీల్‌బేస్ 2,840 మిల్లీమీటర్లు ఉంటుంది. దీని డిజైన్ మోడర్న్ లుక్ లో ఆకట్టుకుంటుంది. ముందు, వెనుక భాగాల్లో విన్‌ఫాస్ట్ ప్రత్యేకమైన V-షేప్ LED లైట్లు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. 19 అంగుళాల అల్లాయ్ వీల్స్ వాహనానికి మరింత స్టైలిష్ లుక్‌ను ఇస్తాయి.

Advertisement

ఈ 7-సీటర్ వాహనం కుటుంబ ప్రయాణాలకు బాగా సరిపోతుంది. లోపల సింపుల్ అయినప్పటికీ లేటెస్ట్ డాష్‌ బోర్డ్ ఉంటుంది. ఇందులో 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా, ADAS వంటి లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. డ్రైవింగ్ అనుభవాన్ని సులభంగా, సురక్షితంగా చేయడానికి ఇవి ఉపయోగపడతాయి.

ఒకే ఛార్జ్ తో 517 కి.మీ ప్రయాణం

పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే, ఈ ఎలక్ట్రిక్ MPVలో 60.13 kWh సామర్థ్యం గల బ్యాటరీ ఉంటుంది. పూర్తి ఛార్జ్‌ తో సుమారు 517 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఈ బ్యాటరీ 80 kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కేవలం 30 నిమిషాల్లో 10 నుంచి 70 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఇది రోజువారీ ఉపయోగంలో చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇందులో సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది.  ఈ మోటార్ సుమారు 201 BHP పవర్, 280 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది.  ఈ వాహనం 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 9 సెకన్లలోపు అందుకుంటుంది.

7 సంవత్సరాల వ్యారెంటీ

Advertisement

విన్‌ఫాస్ట్ ఈ మోడల్ కు సంబంధించి కొన్ని క్రేజీ ఆఫర్లను కూడా అందిస్తోంది. 7 సంవత్సరాల వెహికల్ వ్యారంటీ, 10 సంవత్సరాల బ్యాటరీ వ్యారంటీ, 3 సంవత్సరాల ఉచిత మెయింటెనెన్స్ ప్యాకేజీ అందిస్తుంది. అదనంగా, వాహనాన్ని తిరిగి అమ్ముకునే సమయంలో 75 శాతం బైబ్యాక్ వ్యాల్యూను కూడా కంపెనీ హామీ ఇస్తోంది. పాత పెట్రోల్, డీజిల్ కారును ఈ ఎలక్ట్రిక్ MPVతో ఎక్సేంజ్ చేసుకునే వారికి రూ. 2 లక్షల వరకు స్పెషల్ బెనిఫిట్స్ అందిస్తోంది. 2029 మార్చి 31 వరకు కంపెనీ ఏర్పాటు చేసిన వి-గ్రీన్ ఛార్జింగ్ స్టేషన్లలో ఉచితంగా ఛార్జింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. VF MPV 7 కుటుంబ ప్రయాణాలకు అనుకూలమైన, ఆధునిక ఫీచర్లు, మంచి రేంజ్ కలిగిన ఎలక్ట్రిక్ వెహికల్ గా గుర్తింపు తెచ్చుకోనుంది.

Read Also: కియా క్రేజీ ప్లాన్.. భారత మార్కెట్ లోకి ఏకంగా 5 కొత్త కార్లు!

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×