E-Paper
Advertisement

Smartphones 2026: మిడ్ రేంజ్ బడ్జెట్లో.. బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్.. ప్రీమియం రేంజ్ ఫీచర్లు భయ్యా!

Smartphones 2026: మిడ్ రేంజ్ బడ్జెట్లో.. బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్.. ప్రీమియం రేంజ్ ఫీచర్లు భయ్యా!
Advertisement

Smartphones 2026: సాధారణంగా మెుబైల్ తయారీ సంస్థలు.. మెుబైల్స్ ను 3 కేటగిరీల్లో అందుబాటులోకి తీసుకొస్తుంటాయి. బేసిక్, మిడ్ రేంజ్, ప్రీమియం విభాగాల్లో స్మార్ట్ ఫోన్ ఫీచర్లు, ధరను నిర్ణయిస్తుంటాయి. అయితే కొన్నిస్మార్ట్ ఫోన్స్.. మిడ్ రేంజ్ లో వచ్చినప్పటికీ ప్రీమియం రేంజ్ ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటుకున్నాయి. అటువంటి టాప్ – 4 మిడ్ రేంజ్ ఫోన్లు, వాటి ప్రధాన ఫీచర్లు, ధర వివరాలను ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Motorola Edge 60 Fusion

మోటొరోలా కంపెనీకి చెందిన ఈ ఫోన్ మిడ్ రేంజ్ బడ్జెట్ లో అందరినీ ఆకర్షిస్తోంది. నాణ్యమైన డిస్ ప్లే, పవర్ ఫుల్ ఛార్జింగ్ దీని ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ మిడ్ రేంజ్ బడ్జెట్లో ఫోన్ కు.. 6.67 అంగుళాల pOLED కర్వ్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 4500 nits పీక్ బ్రైట్‌నెస్ అందించారు. అలాగే మిడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రొసెసర్, 50MP + 13MP రియర్ కెమెరా, సెల్ఫీ కోసం 32MP కెమెరా ఇచ్చారు. ఫ్లిప్ కార్ట్ లో రూ.24,999లకు ఇది అందుబాటులో ఉంది.

Oppo Reno15C

Advertisement

ఒప్పోకు చెందిన ఈ ఫోన్.. ప్రీమియం డిజైన్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 6.57 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్, 50MP ప్రైమరీ కెమెరా, 50MP సెల్ఫీ సెన్సార్ దీనిలోని ప్రధాన ఫీచర్లుగా చెప్పవచ్చు. అలాగే 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 6500mAh భారీ బ్యాటరీని సైతం ఈ ఫోన్ కు అందించారు. అమెజాన్ లో ఈ ఫోన్ రూ.37,999కి లభిస్తోంది.

Realme Narzo 90

బిగ్ బ్యాటరీ, మంచి గేమింగ్ అనుభవాన్ని కోరుకునేవారికి ఈ రియల్ మీ ఫోన్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది. 6.57-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 4000 nits బ్రైట్‌నెస్, మిడియాటెక్ డైమెన్సిటి 6400 MAX ప్రాసెసర్, 50MP AI ప్రైమరీ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లతో ఈ ఫోన్ రూపొందింది. 60W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 7000mAh భారీ బ్యాటరీని దీనికి అందించారు. ఈ ఫోన్ అమెజాన్ లో రూ.18,999కి సేల్ అవుతోంది.

Advertisement

Also Read: Voltas Coolers 2026: మధ్యతరగతి స్పెషల్.. ఇంటిని ఊటీలా మార్చే.. ఏసీ రేంజ్ శక్తివంతమైన కూలర్లు..!

Samsung Galaxy A55

శాంసంగ్ నుంచి మంచి మిడ్ రేంజ్ ఫోన్ కోరుకునేవారు దీనిని ట్రై చేయవచ్చు. 6.6 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్ ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ భద్రత, ఎక్సినోస్ 1480 ప్రాసెసర్, 50MP OIS ప్రైమరీ కమెరా, 32MP కెమెరాతో ఈ ఫోన్ ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ కు 25W ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీని అమర్చారు. అమెజాన్ ఈ ఫోన్ ను రూ.27,999కు ఆఫర్ చేస్తోంది.

ముఖ్యగమనిక: టెక్ నిపుణుల సూచనలు, యూజర్ల రివ్యూ ఆధారంగా ఈ కథనం అందించడం జరిగింది. ఈ వార్త కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. బిగ్ టీవీకి ఈ కంటెంట్ తో ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం బెటర్.

Also Read: Budget Smartphones: రూ.20,000 బడ్జెట్‌లో.. తోపు స్మార్ట్ ఫోన్స్ భయ్యా.. ఫీచర్లు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×