E-Paper
Advertisement

BLDC Fans: తక్కువ బడ్జెట్లో.. అత్యాధునిక బ్రాండెడ్ ఫ్యాన్లు.. ఇంట్లో తుఫాన్లు సృష్టించొచ్చు!

BLDC Fans: తక్కువ బడ్జెట్లో.. అత్యాధునిక బ్రాండెడ్ ఫ్యాన్లు.. ఇంట్లో తుఫాన్లు సృష్టించొచ్చు!
Advertisement

BLDC Fans: ప్రస్తుత సాంకేతిక యుగంలో సీలింగ్ ఫ్యాన్లు సైతం అత్యాధునిక స్మార్ట్ ఫీచర్లతో అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం సాధారణ ఫ్యాన్లతో పోలిస్తే BLDC (Brushless Direct Current) చాలా పాపులర్ అవుతున్నాయి. విద్యుత్ ఆదా, స్మార్ట్ కంట్రోల్, తక్కువ శబ్దం, ఇన్వర్టర్ సపోర్ట్ వంటి క్రేజీ ఫీచర్లతో ఈ అధునాతన ఫ్యాన్లు ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రూ.4000 లోపు బడ్జెట్ ఉన్న టాప్ – 5 BLDC ఫ్యాన్లు.. వాటి ఫీచర్లు, ధర వివరాలను ఈ కథనంలో పరిశీలిద్దాం.

Atomberg Renesa Enzel (1400mm)

పెద్ద గదులు ఉన్న ఇంటికి ఈ ఫ్యాన్ ను బెస్ట్ ఆప్షన్ కు చెప్పవచ్చు. దీనిలోని 1400mm బ్లేడ్లు అత్యధికంగా గాలిని అందిస్తాయి. ఇది కేవలం 35W విద్యుత్తును మాత్రమే వినియోగిస్తూ సాధారణ ఫ్యాన్లతో పోలిస్తే 65% వరకు విద్యుత్ ఆదా చేస్తుంది. ఈ ఫ్యాన్ రిమోట్ లోని బూస్ట్, స్లీప్, టైమర్ మోడ్స్ యూజర్లకు ప్రయోజకంగా ఉంటాయి. ఈ ఫ్యాన్ రూ. 3,799కి అందుబాటులో ఉంది.

Crompton Energion Cromair (1200mm)

Advertisement

క్రాంప్టన్ కంపెనీకి చెందిన ఈ స్మార్ట్ ఫ్యాన్.. ActivBLDC టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇది 28 వాట్స్ నుండి 35 వాట్స్ మధ్య విద్యుత్తును వాడుకుంటూ వేగవంతమైన గాలిని ఇందిస్తుంది. రేడియో ఫ్రీకెన్సీ ఫీచర్ ను కలిగిన ఈ ఫ్యాన్ రిమోట్ ను.. దూరంగా ఉండి కూడా ఆపరేట్ చేయవచ్చు. ఫ్యాన్ వైపు చూపించి.. బటన్స్ నొక్కాల్సిన పనిలేదు. మార్కెట్లో ఈ ఫ్యాన్ ధర రూ.3,899గా ఉంది.

Bajaj Energon (1200mm)

బజాజ్ ఎనర్గాన్ ఫ్యాన్.. సైలెంట్ పనితీరుకు బాగా పాపులర్ అయ్యింది. ఇది కేవలం 26W విద్యుత్తును మాత్రమే వినియోగించుకొని.. ఆహ్లాదకరమైన గాలిని అందిస్తుంది. దీని మోటార్ చాలా తక్కువ వేడిని ఉత్పత్తి చేస్తూ.. ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. తక్కువ విద్యుత్ బిల్లు కోరుకునేవారికి ఈ ఫ్యాన్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు. ఈ బజాజ్ ఫ్యాన్ ను రూ.3,899కి సొంతం చేసుకోవచ్చు.

Havells Ambrose Slim (1200mm)

Advertisement

హావెల్స్ ఆంబ్రోస్ స్లిమ్ ఫ్యాన్.. స్టైలిష్, స్లిమ్ డిజైన్‌ కలిగి ఉంది. దీనిలోని BLDC మోటార్.. గది అంతటా సమానంగా గాలిని పంపిణీ చేస్తుంది. ఇది ఇన్వర్టర్‌పై పనిచేసేటప్పుడు ఎలాంటి శబ్దం లేకుండా సైలెంట్ గా ఉంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫ్యాన్ ధర రూ.3,899.

Also Read: Smart Meter: ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్‌కు.. కొత్త ఫోన్ నెంబర్ యాడ్ చేయాలా? ఈ స్టెప్స్ ఫాలో అయితే సరి!

Activa Jetta (1200mm)

తక్కువ బడ్జెట్ అత్యాధునిక స్మార్ట్ ఫీచర్లు కోరుకునే వారు దీనిని ట్రై చేయవచ్చు. ఇది రిమోట్ కంట్రోల్, టైమర్ సెట్టింగ్స్, ఎనర్జీ సేవింగ్ ఫీచర్లను కలిగి ఉంది. ఇది 350 RPM వేగంతో తిరుగుతూ మంచి గాలిని ఇస్తుంది. తక్కువ బడ్జెట్‌లో అడ్వాన్స్డ్ BLDC టెక్నాలజీకి మారాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. మార్కెట్ లో రూ.3.999కి ఇది అందుబాటులో ఉంది.

Also Read: Air Coolers: డెజర్ట్ vs పర్సనల్ vs టవర్.. మధ్యతరగతి ప్రజలు.. ఏ కూలర్ కొంటే బెటర్?

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×