E-Paper
Advertisement

పాత కార్లలో వినైల్ రూఫ్‌లు.. స్టైల్ కోసమా? అవసరం కోసమా?

పాత కార్లలో వినైల్ రూఫ్‌లు.. స్టైల్ కోసమా? అవసరం కోసమా?
Advertisement

Classic Cars Vinyl Roofs: ఈ రోజుల్లో కార్ల గురించి మాట్లాడితే.. వినైల్ అనే పదం వినగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది వినైల్ బాడీ ర్యాప్. కారుకు కొత్త రంగు ఇవ్వడానికి, అందంగా మార్చడానికి, స్పెషల్ లుక్ కోసం ఈ ర్యాప్‌ లను ఉపయోగిస్తారు. తక్కువ ఖర్చుతో కారుకు కొత్త రూపం ఇవ్వగలిగే ఈ విధానం ప్రస్తుతం బాగా పాపులర్ అయ్యింది. అయితే, కొన్ని దశాబ్దాల క్రితం వినైల్ రూఫ్ అంటే పూర్తిగా వేరే అర్థం ఉండేది. 1960ల నుంచి 1990ల వరకు ప్రపంచ వ్యాప్తంగా తయారైన అనేక కార్లలో ఫ్యాక్టరీ నుంచే వినైల్ రూఫ్‌ లను అమర్చేవారు. ఇవి ఈ రోజుల్లో ర్యాప్‌ల మాదిరిగా తర్వాత అతికించేవి కాదు. కారు తయారీ సమయంలోనే అసెంబ్లీ లైన్‌ లో అమర్చి బయటకు పంపేవారు. ఆ కాలంలో ఇది ఒక ప్రత్యేకమైన స్టైలింగ్ ఫీచర్‌ గా భావించబడేది.

ఎందుకీ వినైల్ రూఫ్ లు?

వినైల్ రూఫ్‌లను కేవలం కారు అందాన్ని పెంచేందుకు మాత్రమే రూపొందించబడ్డాయి. ఒకే మోడల్‌ కు భిన్నమైన రూపం ఇవ్వడం, కారు మరింత విలాసవంతంగా కనిపించేలా చేయడం కోసం తయారీ సంస్థలు వీటిని అందించేవారు. వినైల్, ఫ్యాబ్రిక్‌ తో కూడిన రూఫ్‌లు మొదట 1940 చివరలో, 1950 ప్రారంభంలో కొన్ని లగ్జరీ కార్లలో కనిపించాయి. కానీ 1960లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఆ సమయంలో కన్వర్టిబుల్ కార్లు చాలా స్టైలిష్‌ గా భావించేవారు. అదే లుక్‌ను సాధారణ కార్లకూ ఇవ్వాలనే ఉద్దేశంతో వినైల్ రూఫ్‌ లను ఉపయోగించడం ప్రారంభించారు. తర్వాత ఇవి కారు డిజైన్‌లో భాగమై ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాయి.

Advertisement

ఈ రోజుల్లో వినైల్ ర్యాప్‌లు ఎక్కువగా రంగు మార్పుకు పరిమితమవుతుంటే, అప్పటి వినైల్ రూఫ్‌లు అనేక రకాల డిజైన్లలో లభించేవి. పూల ఆకృతులు, మొసలి చర్మాన్ని పోలిన టెక్స్చర్లు, ప్రత్యేక మోడల్స్ ఉండేవి. దీంతో కారు మరింత ప్రత్యేకంగా కనిపించేది. 1960  చివరి నుంచి 1970 వరకు మజిల్ కార్లు, సెడాన్‌లు, పికప్ ట్రక్కులు, లగ్జరీ వాహనాలు ఇలా దాదాపు అన్ని విభాగాల కార్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉండేది. 1970, 1980లలో వినైల్ రూఫ్‌లు ముఖ్యంగా లగ్జరీ కార్లకు గుర్తుగా మారాయి. ఒపెరా విండోస్ లాంటి ప్రత్యేక డిజైన్లతో కలిపి వీటిని ఉపయోగించడంతో కార్లు మరింత విలాసవంతంగా కనిపించేవి. అయితే 1980 చివరి నుంచి కార్ల లుక్ లో పెద్ద మార్పులు వచ్చాయి. చిన్న పరిమాణంలో గాలిని చీల్చుకుంటూ వెళ్లే ఏరోడైనమిక్ డిజైన్‌లు రావడంతో వినైల్ రూఫ్‌ లు క్రమంగా ఓల్డ్ ట్రెండ్‌గా మారిపోయాయి. చివరకు 1996లో బ్యూక్, కాడిలాక్ లాంటి కంపెనీలు కూడా ఈ ఫీచర్‌ను నిలిపివేశాయి.

వినైల్ రూఫ్ లతో నష్టాలు కూడా..

వినైల్ రూఫ్‌లకు కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ఎండ, వర్షం, చలి లాంటి వాతావరణ ప్రభావాల వల్ల వినైల్ మెటీరియల్ త్వరగా పాడైపోతుంది. రంగు వెలిసిపోవడం, పగుళ్లు రావడం, ఊడిపోవడం లాంటి సమస్యలు తరచూ కనిపించేవి. దీంతో కారు అందం కూడా తగ్గిపోయేది. అంతకంటే పెద్ద సమస్య తుప్పు. వినైల్ పొర కింద తేమ చేరితే సులభంగా ఆరిపోదు. దీంతో రూఫ్‌లోని లోహానికి తుప్పు పట్టి, కాలక్రమేణా కుళ్లిపోయే ప్రమాదం ఉండేది. బయటకు కనిపించకపోయినా లోపల భారీ నష్టం జరిగే అవకాశం ఉండేది.

Advertisement

Read Also: తక్కువ ధరలో బెస్ట్ టాటా కార్లు.. ఈ 3 మోడల్స్ అస్సలు మిస్ కావొద్దు!

Related News

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

కారులో రాకెట్ టెక్నాలజీ.. స్పేస్‌ ఎక్స్‌ తో టెస్లా కొత్త ప్రయోగం చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా XUV 3XO సరికొత్త రికార్డు.. 5 లక్షలు దాటిన సేల్స్!

మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ. 1.65 లక్షల తగ్గింపు!

హ్యుందాయ్ క్రెటా సరికొత్త రికార్డు.. 15 లక్షలు దాటిన అమ్మకాలు!

ట్రాక్షన్ కంట్రోల్, ఫాస్ట్ ఛార్జింగ్‌.. అప్ డేటెడ్ టీవీఎస్ రైడర్ లో అదిరిపోయే ఫీచర్లు!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

Big Stories

Advertisement
×