E-Paper
Advertisement

తక్కువ ధరలో బెస్ట్ టాటా కార్లు.. ఈ 3 మోడల్స్ అస్సలు మిస్ కావొద్దు!

తక్కువ ధరలో బెస్ట్ టాటా కార్లు.. ఈ 3 మోడల్స్ అస్సలు మిస్ కావొద్దు!
Advertisement

Affordable Tata Cars 2026: భారతీయ కార్ల మార్కెట్లో టాటా మోటార్స్ భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే కంపెనీగా గుర్తింపు పొందింది. తక్కువ ధరల్లోనే మంచి సేఫ్టీ ఫీచర్లు, బలమైన నిర్మాణం, ఆకట్టుకునే డిజైన్‌ తో కార్లను అందిస్తోంది. ముఖ్యంగా బడ్జెట్‌ లో కొత్త కారు కొనాలనుకునే వారికి టాటా టియాగో, టాటా పంచ్, టాటా టిగోర్ మంచి ఆప్షన్ గా మారాయి. వీటి ధరలు, ఫీచర్లు, ప్రత్యేకతలు ఇప్పుడు తెలుసుకుందాం.

1.టాటా టియాగో:  బడ్జెట్ హ్యాచ్‌ బ్యాక్

టాటా మోటార్స్ నుంచి లభించే అత్యంత సరసమైన హ్యాచ్‌ బ్యాక్ టాటా టియాగో. నగర ప్రయాణాలకు అనువైన ఈ కారు స్టైలిష్ లుక్‌ తో పాటు మంచి పనితీరును అందిస్తుంది. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, మెరుగైన మైలేజ్ కారణంగా తొలిసారి కారు కొనేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా భావిస్తారు. టాటా టియాగో ప్రారంభ ధర సుమారు రూ. 4.70 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 8.55 లక్షలు వరకు ఉంటుంది. ఈ కారు 4 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ ను కలిగి ఉంది.

2.టాటా పంచ్: చిన్న ఎస్‌యూవీ, మంచి భద్రత

Advertisement

ప్రస్తుతం టాటా మోటార్స్‌ లో అత్యధిక ఆదరణ పొందుతున్న మోడళ్లలో టాటా పంచ్ ఒకటి. ఎస్‌యూవీ తరహా డిజైన్, ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్, విశాలమైన క్యాబిన్ కారణంగా కుటుంబ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. టాటా పంచ్ ప్రారంభ ధర రూ. 5.70 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 10.67 లక్షల వరకు ఉంటుంది. సిటీతో పాటు హైవే ప్రయాణాలకు కూడా ఈ కారు అనుకూలంగా ఉంటుంది. భద్రత, సౌకర్యం, స్టైలింగ్ పరంగా ఇది బడ్జెట్ ఎస్‌యూవీల్లో మంచి స్థానం సంపాదించింది.

3.టాటా టిగోర్: స్టైలిష్ సెడాన్

సెడాన్ కారు కొనాలనుకునే వారికి టాటా టిగోర్ మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఆకర్షణీయమైన డిజైన్, విశాలమైన బూట్ స్పేస్, సౌకర్యవంతమైన క్యాబిన్ ఈ కారును ప్రత్యేకంగా నిలబెడతాయి. టాటా టిగోర్ ధర రూ. 5.55 లక్షల నుంచి రూ. 8.84 లక్షల  వరకు ఉంటుంది. కుటుంబ అవసరాలకు, రోజువారీ ప్రయాణాలకు ఇది అనువైన సెడాన్‌గా గుర్తింపు పొందింది.

ఏ కారు ఎవరికి బెస్ట్?

Advertisement

బడ్జెట్ తక్కువగా ఉండి సిటీలో ఎక్కువగా ప్రయాణిస్తే టాటా టియాగో సరైన ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.  ఎస్‌యూవీ స్టైల్, ఎత్తైన డ్రైవింగ్ పొజిషన్ కోరుకునే వారికి టాటా పంచ్ బాగా సరిపోతుంది. సెడాన్ లుక్, ఎక్కువ బూట్ స్పేస్, ఫ్యామిలీ కమ్ఫర్ట్ కావాలనుకునే వారు టాటా టిగోర్ ను తీసుకోవచ్చు.

Read Also: డస్టర్ అభిమానులకు గుడ్ న్యూస్.. అడ్వెంచర్ ఎడిషన్ వచ్చేసింది!

Related News

సింగిల్ ఛార్జ్‌ తో 301 కి.మీ రేంజ్.. ఓలా S1Z స్కూటర్ వచ్చేసింది!

ఇండియన్ మార్కెట్‌ను షేక్ చేయబోతున్న 6 కొత్త SUVలు.. లిస్ట్ చూస్తే మతిపోవాల్సిందే!

టాటా పంచ్ EV ఒరిజినల్ రేంజ్ ఎంత? రియల్ టెస్ట్‌ లో షాకింగ్ రిజల్ట్!

మహీంద్రా EVలపై భారీ ఆఫర్.. ఏకంగా రూ.8 లక్షల తగ్గింపు!

జావా 42 FJ లాంచ్.. 6 అదిరిపోయే రంగుల్లో అందుబాటులోకి!

జస్ట్ లక్షకే.. 200 కి.మీ రేంజ్.. ఏథర్ కోనార్క్ వచ్చేసింది!

లాంగ్ రైడర్లకు అదిరిపోయే బైక్.. కవాసకి వెర్సిస్ 650 కొత్త వెర్షన్ వచ్చేసింది!

హ్యుందాయ్ నుంచి ఏకంగా 26 కొత్త కార్లు.. టాప్ 7 మోడళ్లు ఏవో తెలిస్తే మతిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×