E-Paper
Advertisement

Volvo EX90 Car: వోల్వో నుంచి ఫస్ట్ లగ్జరీ SUV.. దీని రేంజ్ ఎంతో తెలుసా?

Volvo EX90 Car: వోల్వో నుంచి ఫస్ట్ లగ్జరీ SUV.. దీని రేంజ్ ఎంతో తెలుసా?
Advertisement

ప్రముఖ స్వీడన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో అద్భుతమైన ఎలక్ట్రిక్ కారును అందుబాటులోకి తీసుకురాబోతోంది. వోల్వో EX90 పేరుతో ఫస్ట్ ఫుల్ ఎలక్ట్రిక్ కారును పరిచయం చేయబోతోంది. ఈ లగ్జరీ SUV 7 సీట్లతో రాబోతోంది. లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్లు, పవర్ ఫుల్ డ్యూయల్ మోటార్ ఆల్ వీల్-డ్రైవ్, స్మూత్ రైడ్, స్కానిడినేవియన్ డిజైన్‌ తో వస్తుంది. ఇది పెద్ద కుటుంబాలకు అనుకూలంగా ఉంటుంది. దీనికి ఓవర్ ది ఎయిర్ అప్‌డేట్స్,  సెల్ఫ్ డ్రైవింగ్ కెపాసిటీ ఉంటుంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం ఈ కారు ఇండియాలో సెప్టెంబర్ 2026లో అడుగు పెట్టే అవకాశం కనిపిస్తోంది.

వోల్వో EX90  కీ ఫీచర్లు  

వోల్వో EX90 కారు డ్యూయల్ మోటార్ సెటప్‌ ను కలిగి ఉంటుంది. 380 kW (510 hp) పవర్ తో రానుంది. 910 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 4.9 సెకన్లలో 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.  భద్రత విషయంలో అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ కారులో LAR సెన్సార్, కెమెరాలు, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, సైక్లిస్ట్ అవాయిడెన్స్, స్కూల్ జోన్ అలర్ట్‌ లాంటి  అధునాతన భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఈ కారులో ఎనిమిది కెమెరాలు,  వెహికిల్ చుట్టూ చుట్టూ 16 అల్ట్రాసోనిక్ సెన్సార్లు ఉన్నాయి. ఇవి కారు 600 అడుగుల దూరంలో ఉన్న ప్రమాదకర వస్తువులను గుర్తించడానికి సాయపడనున్నాయి. ఈ కారు డిజైన్, ఇంటీరియర్ చాలా లగ్జరీగా ఉంటుంది. క్లాసిక్ వోల్వో డిజైన్, 7 సీట్లుతో వస్తుంది.  ప్రీమియం ఫీల్,  విశాలమైన కార్గో స్పేస్ ఉంటుంది.

వోల్వో EX90  పనితీరు

Advertisement

ఈ కారు చాలా లగ్జరీ ఫీల్ అందిస్తుంది. ఎయిర్ సస్పెన్షన్, అద్భుతమైన సౌండ్ ప్రూఫింగ్, ఆప్షనల్ వన్ పెడల్ డ్రైవ్ సౌకర్యం ఉంటుంది. ఈ కారులో 111 kWh బ్యాటరీ ఉంటుంది. ఫుల్ ఛార్జ్ మీద ఏకంగా 600 కి.మీ రేంజ్ లభిస్తుంది. DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 10 నుంచి 80శాతం వరకు 30 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. రానున్న రోజుల్లో ఆటోనమస్ డ్రైవింగ్ కోసం రూపొందించబడింది, ఓవర్ ది ఎయిర్ అప్ డేట్స్ తో రానుంది.

ఇండియాలో లాంచ్ ఎప్పుడు?

భారత్ లో ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ కారు ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయంలో ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. కానీ, కొన్నినివేదికల ప్రకారం ఈ ఏడాదిలోనే ఇండియన్ మార్కెట్లోకి అవస్తుందనే  తెలుస్తోంది. ఇంచుమించు సెప్టెంబర్ 2026 వరకు లాంచ్ అవుతుందంటున్నారు. త్వరలోనే కంపెనీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

అంచనా ధర, పోటీపడే కార్లు

Advertisement

వోల్వో EX90 ఎలక్ట్రిక్ కారు ధర సుమారు రూ.1 కోటి నుంచి రూ. 1.30 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. వోల్వో EX90  ప్రీమియం, ఎలక్ట్రిక్ ఫ్యామిలీ SUV కోరుకునేవారికి మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఈ కారు మార్కెట్ లో ఆడి ఇ ట్రాన్, BMW iX, పోర్స్చే టేకాన్, మెర్సిడెస్ బెంజ్ EQS లాంటి లగ్జరీ కార్లతో పోటీ పడే అవకాశం ఉంది.  BMW iX కంటే ఎక్కువ సీటింగ్, EQS కంటే SUV ఫీల్ దీని ప్లస్ పాయింట్. ఇండియాలో ఇప్పటివరకు వచ్చిన లగ్జరీ EVలతో పోలిస్తే EX90 పూర్తిస్థాయి ఫ్యామిలీ SUVగా గుర్తింపు తెచ్చుకోనుంది.

Read Also: టాటా జనవరి డిస్కౌంట్స్, ఆ కార్లపై ఏకంగా రూ. 85 వేల తగ్గింపు!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×