E-Paper
Advertisement

Srinivasa Mangapuram: జయకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!

Srinivasa Mangapuram: జయకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!
Advertisement

Srinivasa Mangapuram: ఈమధ్య కాలంలో సెలబ్రిటీల వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమ నటనతో , టాలెంట్ తో అభిమానులను ఆకట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే అటు సెలబ్రిటీలు కూడా తమ వారసుల ఎంట్రీకి దగ్గరుండి మరీ సర్వం సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఘట్టమనేని కుటుంబం నుండి ఈ కొత్త ఏడాది ఒక కొత్త వారసుడు లాంచ్ కాబోతున్నారు. ఈ మేరకు ఆ వారసుడి సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా తాజాగా రిలీజ్ చేశారు. ఆయన ఎవరో కాదు ఘట్టమనేని కృష్ణ వారసుడు ఘట్టమనేని జయకృష్ణ.

మహేష్ బాబు చేతుల మీదుగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..

దివంగత నటుడు రమేష్ బాబు కొడుకుగా , దివంగత నటుడు కృష్ణ మనవడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు జయకృష్ణ. ఈ మేరకు జయకృష్ణ సినీ ఎంట్రీ బాధ్యతలను సూపర్ స్టార్ మహేష్ బాబు తీసుకోవడమే కాకుండా జయకృష్ణ తొలి సినిమా ఫస్ట్ పోస్టర్ ను తన చేతుల మీదుగా రిలీజ్ చేశారు.. ప్రస్తుతం జయకృష్ణ శ్రీనివాస మంగాపురం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి అశ్వినీ దత్ సమర్పణలో చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.. జీవి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు.

Advertisement

ALSO READ:Chiranjeevi: కూతురి ద్వారా మాట నిలబెట్టుకున్న మెగాస్టార్.. చిన్నారికి ఆర్థిక సాయం!

ఆకట్టుకుంటున్న జయకృష్ణ ఫస్ట్ లుక్..

భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న జయకృష్ణకి సంబంధించి.. తన మొదటి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు. ఇందులో.. బుల్లెట్ బండి నడుపుతూ.. గన్ను పట్టుకొని యాక్షన్ లుక్కులో కనిపించారు జయకృష్ణ. ఇతని మాస్ లుక్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. తొలి సినిమాతో ఈ ఏడాది ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న జయకృష్ణకు అభిమానులు కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు. మరి ఈ సినిమా జయ కృష్ణకు ఏ విధంగా మంచి పేరు తీసుకొస్తుందో చూడాలి.

మహేష్ బాబు సినిమాలు..

Advertisement

ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు తన సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. మరొకవైపు తన అన్నయ్య కొడుకును ఇండస్ట్రీలోకి లాంచ్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగానే జయకృష్ణ తన మొదటి సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. అలాగే మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమా చేస్తున్నారు.యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. అలాగే మలయాళ నటుడు దర్శకుడు పృధ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇక హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ సంస్థలు ఈ సినిమా కోసం పనిచేస్తున్నాయి.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×