E-Paper
Advertisement

Car’s tyres: కార్ల టైర్లు ఎప్పుడు మార్చాలి? నిపుణులు ఏం చెప్తున్నారంటే?

Car’s tyres: కార్ల టైర్లు ఎప్పుడు మార్చాలి? నిపుణులు ఏం చెప్తున్నారంటే?
Advertisement

Car Tyres Maintenance: కార్లు నడిపే వాళ్లు సాధారణంగా ఫ్యూయెల్ నింపడం, సర్వీసింగ్ చేయడం, కారును శుభ్రం చేయడం లాంటివి గుర్తుకుంటారు. కానీ, టైర్ల గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ, కారులో రోడ్డును తాకే ఏకైక భాగాలు టైర్లు. వాటి పరిస్థితి భద్రత, బ్రేకింగ్, సౌకర్యం, ఇంధన సామర్థ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. అందుకే కారు టైర్లను ఎప్పుడు మార్చాలో తెలుసుకోవడం మంచిది.

టైర్లు ఎందుకు బాగుండాలి?

కారు జాగ్రత్తగా వెళ్లేందుకు టైర్లు కీలక పాత్ర పోషిస్తాయి. పట్టు, స్థిరత్వం, నియంత్రణ ఉండేలా చేస్తాయి. అరిగిపోయిన, పాత టైర్లు బ్రేకింగ్ కు ఇబ్బంది కలిగిస్తాయి. తడి రోడ్లపై పట్టును తగ్గిస్తాయి. అధిక వేగంతో వెళ్లినప్పుడు బ్లోఅవుట్‌ కు కారణం అవుతుంది. అందుకే, టైర్లను తరచుగా గమనించాలి.

5-6 ఇయర్స్ రూల్   

Advertisement

ట్రెడ్ అరిగిపోయినప్పుడు మాత్రమే టైర్లను మార్చాల్సిన అవసరం ఉందని చాలా మంది భావిస్తారు. కానీ, టైర్లు ఎంత నడిపినప్పటికీ, ప్రతి 5 నుంచి 6 సంవత్సరాలకు ఒకసారి మార్చాలి. హీట్, సన్ లైట్, గాలి కారణంగా రబ్బరు సహజంగా బలాన్ని కోల్పోతుంది. ఎప్పుడో ఒకసారి ఉపయోగించే కారులో కూడా పాత టైర్లు ఉండటం చాలా ప్రమాదకరం. అందుకే, టైర్ల ఏజ్ చెక్ చేయడానికి సైడ్‌ వాల్‌ పై DOT కోడ్ చూడాలి. నాలుగు అంకెలతో ఓ సంఖ్య ఉంటుంది. ఇందులో మొదటి రెండు అంకెలు తయారీ వారాన్ని సూచిస్తాయి. చివరి రెండు సంవత్సరాన్ని చూపిస్తాయి.

ట్రెడ్ డెప్త్

వర్షం సమయంలో ట్రెడ్ డెప్త్ కారుకు గ్రిప్‌ ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇండియా సహా పలు దేశాల్లో కనీస ట్రెడ్ డెప్త్ 1.6 మిమీగా నిర్ణయించారు. చాలా టైర్లు ఇన్ బిల్ట్  ట్రెడ్ వేర్ ఇండికేటర్లతో వస్తాయి. మెరుగైన భద్రత కోసం, ట్రెడ్ డెప్త్ 3 మిమీకి చేరుకున్నప్పుడు టైర్లను మార్చాలని నిపుణులు సూచిస్తుంటారు. ఎందుకంటే, బ్రేకింగ్, తడి రోడ్ మీద పని తీరు బాగుంటుంది.

ఈ విషయాలను లైట్ తీసుకోవద్దు!  

Advertisement

సైడ్‌వాల్‌లో పగుళ్లు లేదంటే కోతలను లైట తీసుకోవద్దు. టైర్ ఉబ్బెత్తులు, బుడగలు వస్తే అలర్ట్ కావాలి. ఇలా ఉండటం వల్ల అలైన్‌ మెంట్, సస్పెన్షన్ సమస్యలకు కారణం అవుతుంది. తరచుగా పంక్చర్లు, రిపేర్లు పదే పదే జరిగితే అలర్ట్ కావాలి. వెంటనే టైర్లను మార్చడం మంచిదని గుర్తుంచుకోవాలి.

టైర్లు సాధారణంగా ఎంతకాలం పని చేస్తాయి?

సగటున ప్యాసింజర్ కారు టైర్లు డ్రైవింగ్ స్టైల్, రోడ్డు పరిస్థితులు, టైర్ క్వాలిటీని బట్టి 40,000 నుంచి 80,000 కి.మీ వరకు ఉపయోగించవచ్చు. హైస్పీడ్, ఎమర్జెన్సీ బ్రేకింగ్, సరిగా లేని రోడ్ల మీద వెళ్లడం వల్ల టైర్ లైఫ్ తగ్గింపుతోంది. అందుకే, ప్రతి 8,000-13,000 కి.మీకి టైర్లను రొటేట్ చేయాలి. నెలవారీగా గాలిని చెక్ చేయాలి. వీల్ అలైన్ మెంట్, బ్యాలెన్సింగ్ ను రెగ్యులర్ గా చెక్ చేయాలి. టైర్లు కేవలం రబ్బరు రింగులు మాత్రమే కాదు, అవి కీలకమైన భద్రతలో భాగంగా ఉన్నాయని గుర్తుంచుకోవాలి. సకాలంలో టైర్లు మార్చడం వల్ల కారును మాత్రమే కాకుండా, మీ జీవితాన్ని కాపాడుకోవచ్చు. రోడ్డు మీద వెళ్లే ఇతరుల ప్రాణాలను కూడా కాపాడవచ్చు.

Read Also: బైక్ మీద పొగమంచులో జర్నీ చేస్తున్నారా? ఈ 5 విషయాలు అస్సలు మర్చిపోకండి!

Related News

పెట్రోల్‌తో పాటు ఇథనాల్‌ తోనూ పరుగులు.. కియా సైరోస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు వచ్చేస్తోంది!

హీరో, హోండాకు టీవీఎస్ షాక్.. ఆగస్టులో నంబర్ వన్ టూ వీలర్ కంపెనీగా రికార్డ్!

కొత్త కలర్స్‌ తో కవాసకి Z సిరీస్.. నయా లుక్ సూపరో సూపరు!

కియా సోరెంటో వచ్చేసింది.. ఫార్చ్యూనర్‌ కు ఇక చుక్కలే!

హిమాలయన్ 440 వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

టాటా కర్వ్‌ లో కొత్త సిరీస్ X.. తక్కువ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు!

హోండా ఫ్యాన్స్‌ కు గుడ్‌న్యూస్.. ఎలివేట్, సిటీ, అమేజ్‌పై అదిరిపోయే డిస్కౌంట్లు!

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

Big Stories

Advertisement
×