E-Paper
Advertisement

Tips for Motorcyclists: బైక్ మీద పొగమంచులో జర్నీ చేస్తున్నారా? ఈ 5 విషయాలు అస్సలు మర్చిపోకండి!

Tips for Motorcyclists: బైక్ మీద పొగమంచులో జర్నీ చేస్తున్నారా? ఈ 5 విషయాలు అస్సలు మర్చిపోకండి!
Advertisement

శీతాకాలం వచ్చేసింది. పొద్దున్నే, సాయంత్రం పొగ మంచు కమ్మేస్తోంది. కొద్ది మీటర్ల దూరంలో ఉన్న మనుషులు కూడా కనపడనంత దట్టంగా మంచు కురుస్తుంది. పొగమంచు కారణంగా వాహనదారుల విజుబులిటీ తగ్గిపోతుంది. ఫలితంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శీతాకాలంలో ప్రమాదాలు జరగకుండా సేఫ్ గా ప్రయాణం చేయాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు మోటార్‌ సైకిల్ రైడర్ అయితే, పొగమంచులో రోడ్డు మీదికి రావాల్సి వస్తే, సురక్షితమైన రైడింగ్ కోసం ఈ 5 చిట్కాలు పాటించాలి.వీటి వల్ల ప్రయాణం చేసే వాళ్లు సేఫ్ గా ఉండటంతో పాటు వాహనానికి ఎలాంటి డ్యామేజ్ జరగడదు

⦿ బైక్ నెమ్మదిగా నడపండి

పొగమంచు వాతావరణంలో విజుబులిటీ తక్కువగా ఉంటుంది. ఎదురుగా వెళ్తున్న వాహనాలను అంచనా వేయలేం. వేగంగా వెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే, మీరు స్పష్టంగా చూడగలిగే దూరంలో బైక్ ఆపగలరని భావించేంత వేగంగా వెళ్లడం మంచిది. అలాగే, సడెన్ బ్రేకింగ్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. వెనుక నుంచి వచ్చే వాహనాలు తగిలే అవకాశం ఉంటుంది. అందుకే, వీలైనంత వరకు తక్కువ వేగంతో వెళ్లడం మంచిది.

⦿ లో లైట్ ఉపయోగించండి  

Advertisement

పొగమంచు వాతావరణంలో రైడింగ్ చేసే సమయంలో లో లైట్ ఉపయోగించడం మంచిది. ఎందుకంటే, ఎక్కువ లైటింగ్ కారణంగా పొగమంచులో నీటి బిందువులను ప్రతిబింబిస్తుంది. ముందు తెల్లటి గోడ ఉన్నట్లుగాకనిపిస్తుంది. రైడర్‌కు,  ముందున్న ట్రాఫిక్‌ విజుబులిటీని మరింత దిగజారుస్తుంది. సో, మీకు, తోటి వాహనదారులకు మెరుగైన దృశ్యమానత కోసం లో లైట్ వాడటం మంచిది.

⦿ డిస్టెన్స్ మెయింటెయిన్ చేయండి

పొగమంచులో వాహనాలు నడుపుతున్నప్పుడు ముందున్న వాహనం నుంచి వీలైనంత దూరం ఉండేలా చూసుకోవాలి.  ముందున్న వాహనం సడెన్ బ్రేక్ వేసినా, ఎదుటి వాహనాన్ని ఢీ కొట్టకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. అందుకే, ముందు వాహనాల నుంచి వీలైనంత దూరం పాటించడం మంచిది. సాధారణ సమయంలో పాటించే దూరాన్ని పొగమంచు సమయంలో మూడింతలు పెంచడం మంచిది.

⦿ సరైన రైడింగ్ గేర్లను యూజ్ చేయండి!

Advertisement

వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా, హెల్మెట్, గ్లౌజ్ లు, రైడింగ్ జాకెట్, మోచేతి గార్డ్, మోకాలి గార్డ్, షూ మొదలైన వాటితో సహా సరైన రైడింగ్ గేర్‌ను ఉపయోగించాలి. ఒకవేళ ప్రమాదం జరిగినా, గాయాల నుంచి కాపాడుకునే అవకాశం ఉంటుంది. అందుకే, పొగమంచు ఉన్న సమయంలో సరైన గేర్ వాడండి.

Read Also: ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకుంటున్నారా? కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

⦿ ముందుగానే కమ్యూనికేట్ చేయండి

పొగమంచు సమయంలో రైడింగ్ చేస్తున్న సమయంలో మీరు జాగ్రత్తగా ఉండటంతో పాటు ఎదుటి వారికి కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. సరైన కమ్యూనికేషన్ కారణంగా పెద్ద ప్రమాదాల నుంచి సేఫ్ గా బయటపడే అవకాశం ఉంటుంది. మీరు కూడా అవసరం అయిన సమయంలో హారన్, టర్న్ ఇండికేటర్లు, హజార్డ్ లైట్లను ఉపయోగించాలి.

ఈ ఐదు సూచనలు పాటించడం వల్ల పొగమంచు సమయంలో సేఫ్ గా గమ్యస్థానం చేరుకునే అవకాశం ఉంటుంది. మీరు కూడా వీలైనంత వరకు ఈ సూచలను పాటిస్తూ సేఫ్ గా వెళ్లండి!

Read Also: ఏకంగా 10కి పైగా మోడల్స్.. 2026లో మహీంద్రా లాంచ్ లైనప్ మాములూగా లేదుగా!

Related News

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

Big Stories

Advertisement
×