E-Paper
Advertisement

China Copycat: రేంజ్ రోవర్ ను మక్కికి మక్కి దింపేసిన చైనా, మరీ ఇంత ఘోరమా?

China Copycat: రేంజ్ రోవర్ ను మక్కికి మక్కి దింపేసిన చైనా, మరీ ఇంత ఘోరమా?
Advertisement

China Copycat  Xpeng GX EV Car: చైనా వస్తువుల గురించి, వాటి క్వాలిటీ గురించి తరచుగా చర్చ జరుగుతూనే ఉంటుంది. చైనీస్ కాపీ ప్రొడక్ట్స్ గురించి ప్రపంచం అంతటికీ తెలుసు. ఈ కాపీలు ఎలక్ట్రానిక్స్ పరికరాలు, గడియారాల నుంచి కార్ల వరకు కనిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు చైనా నుంచి వచ్చిన కొత్త ఎలక్ట్రిక్ SUV కాపీ క్యాట్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మోడల్‌ కు Xpeng GX అని పేరు పెట్టారు. ఈ కారు పాపులర్ లగ్జరీ SUV, రేంజ్ రోవర్ స్పోర్ట్‌ ను దింపేసినట్టుగా ఉంది.

అచ్చం రేంజ్ రోవర్ లాంటి డిజైన్

Xpeng GX అనేది చైనీస్ కార్ల తయారీ సంస్థ XPeng ఇటీవల లాంచ్ చేసిన ఆరు సీట్ల ఎలక్ట్రిక్ SUV. ఆన్‌ లైన్‌ లో షేర్ చేసిన ఫోటోలు డిజైన్ లో రేంజ్ రోవర్ SUV శైలి, మొత్తం రూపాన్ని పోలి ఉన్నాయి.  ఇది రేంజ్ రోవర్ మాదిరిగానే బాక్సీ, పొడవైన లుక్ ను కలిగి ఉంది. పైకప్పు తేలుతున్నట్లు కనిపించడంతో పాటు విండో  పిల్లర్స్ రేంజ్ రోవర్‌ మాదిరిగా నల్లగా ఉన్నాయి. SUV వైపు ముందు నుంచి వెనుక వరకు రేంజ్ రోవర్ మాదిరిగానే చదునైన గీత కూడా ఉంది. డోర్ హ్యాండిల్స్ బాడీతో సమానంగా ఉన్నాయి. ముందు విండ్‌ షీల్డ్, మధ్య పిల్లర్స్ కూడా రేంజ్ రోవర్ స్పోర్ట్‌ లో మాదిరిగా కనిపిస్తున్నాయి. రెండు కార్లు చూడ్డానికి ఒకేలా కనిపిస్తున్నాయి.

గతంలోనూ రేంజ్ రోవర్ ఎవోక్‌ డిజైన్ కాపీ!

Advertisement

గతంలో ల్యాండ్‌ విండ్ X7 లాంటి చైనీస్ వాహనాలు రేంజ్ రోవర్ ఎవోక్‌ ను కాపీ కొట్టాయి. అప్పట్లో ఈ కారు కాపీ క్యాట్ అంటూ ప్రపంచ వ్యాప్తంగా ట్రోల్ అయ్యింది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ చట్టపరమైన చర్య తీసుకుంది.  ట్రేడ్‌ మార్క్ తీర్పు తర్వాత ఉత్పత్తి నిలిపివేయబడింది. ఇప్పుడు XPeng GX కూడా అదే కోవలోకి చేరింది.

Read Also: లాంచ్ కు రెడీ అవుతున్న మెర్సిడెస్ బేబీ జి-క్లాస్, మార్కెట్ లోకి వచ్చేది ఎప్పుడంటే?

ఇంకా స్పందించని రేంజ్ రోవర్

Advertisement

XPeng GX ఎలక్ట్రిక్ SUVకి సంబంధించి రేంజ్ రోవర్ కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. చైనీస్ బ్రాండ్ SUVని దాని ఫ్లాగ్‌ షిప్ మోడల్‌ గా వెల్లడించిందని చెబుతుండగా.. సోషల్ మీడియాలో రేంజ్ రోవర్ స్పోర్ట్ ను కాపీ కొట్టిందని ట్రోల్ అవుతోంది. గతంలో రేంజ్ రోవర్ ల్యాండ్‌ విండ్ X7 మీద చర్య తీసుకున్నట్లుగానే, ఇప్పుడు XPeng GX ఎలక్ట్రిక్ SUV మీద చర్యలు తీసుకుంటుందా? అనేది చూడాలి.

Read Also: కొత్త బ్యాటరీ, సరికొత్త రేంజ్.. సరికొత్త టాటా పంచ్ EV ఫేస్‌ లిఫ్ట్ వచ్చేసింది!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×