E-Paper
Advertisement

హైవే సైన్ బోర్డులు గ్రీన్ కలర్‌లోనే ఉంటాయి.. ఎందుకో తెలుసా?

హైవే సైన్ బోర్డులు గ్రీన్ కలర్‌లోనే ఉంటాయి.. ఎందుకో తెలుసా?
Advertisement

Green Highway Signboards: సాధారణంగా హైవే మీద ప్రయాణిస్తున్నప్పుడు సైన్‌ బోర్డులు ఎక్కువగా ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి. జాతీయ రహదారులు, ఎక్స్‌ ప్రెస్‌వే లు, ఇతర ప్రధాన రహదారులపైనా ఇదే రంగు ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే. ఎందుకు హైవే సైన్ బోర్డులు గ్రీన్ కలర్ లోనే ఉంటాయి. ఇతర రంగుల్లో ఎందుకు ఉండవు? అని మీకు ఎప్పుడైనా అనుమానం కలిగిందా? ఇప్పుడు మనం అసలు విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

గ్రీన్ కలర్ లో సైన్ బోర్డులు ఎందుకు?

నిజానికి హైవే సైన్ బోర్డులకు గ్రీన్ కలర్ అనేది అనుకుండా సెలెక్ట్ చేసింది. కాదు. దీనికి వెనుక సైన్స్ ఉంది. శాస్త్రీయ కారణాలతో పాటు రహదారి భద్రతకు సంబంధించిన ప్రత్యేక ఆలోచన కూడా ఉంది. ట్రాఫిక్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, హైవేలపై వాహనాలు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. అలాంటి సమయంలో డ్రైవర్లు చాలా తక్కువ సమయంలోనే సైన్‌ బోర్డులపై ఉన్న సమాచారాన్ని చదవాలి. గ్రీన్ బ్యాగ్రౌండ్ మీద తెలుపు రంగు అక్షరాలు స్పష్టంగా కనిపించడం వల్ల దూరం నుంచే సమాచారం సులభంగా అర్థమవుతుంది. పగలు మాత్రమే కాదు, రాత్రి వేళల్లో కూడా ఈ కలర్ కాంబినేషన్ మంచి విజుబులిటీని అందిస్తుంది.

కళ్లకు ఇబ్బంది కలిగించకుండా..

Advertisement

ఆకుపచ్చ రంగు మరో ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే, ఇది కంటికి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎరుపు, పసుపు రంగులు సాధారణంగా హెచ్చరికలు, ప్రమాద సూచనల కోసం ఉపయోగిస్తారు. అవి, అలర్ట్ నెస్ ను పెంచుతాయి. కానీ, హైవే దిశా సూచికల విషయంలో డ్రైవర్‌ కు స్పష్టమైన సమాచారం ఇవ్వడం ముఖ్యం. అందుకే ఒత్తిడి, ఆందోళన కలిగించని ఆకుపచ్చ రంగును ఎంచుకుంటారు.  మానవ కంటి నిర్మాణాన్ని పరిశీలించినా ఆకుపచ్చ రంగు అనుకూలంగా ఉంటుంది. ఈ రంగును మన కళ్ళు సులభంగా గుర్తిస్తాయి. ఎక్కువ కాలం డ్రైవింగ్ చేసినా కంటిపై ఎక్కువ ఒత్తిడి పడకుండా సాయపడుతుంది. డ్రైవర్లు రోడ్డుపై ఫోకస్ పెడుతూనే సైన్‌బోర్డులను వేగంగా చదవగలుగుతారు.

ఎక్కువగా లైటింగ్ రిఫ్లెక్ట్ చేయదు!

ఆకుపచ్చ రంగు ఉపయోగించడానికి మరో కారణం కూడా ఉంది. ఇది ఎక్కువ లైటింగ్ ను రిఫ్లెక్ట్ చేయదు. ఇతర రంగులతో పోలిస్తే కళ్లకు ఇబ్బంది తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రాత్రివేళ వాహనాల హెడ్‌ లైట్లు పడినప్పుడు కూడా బోర్డు మీద సమాచారం స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు, హైవేలపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. ఏ ఎగ్జిట్ తీసుకోవాలి? గమ్యస్థానం ఎంత దూరంలో ఉంది? ఏ దారిలో వెళ్లాలి? లాంటి వివరాలను డ్రైవర్లు క్షణాల్లో అర్థం చేసుకోవాలి. ఆకుపచ్చ రంగు ఇందుకు ఈజీగా సహకరిస్తుంది. మొత్తంగా హైవే సైన్‌ బోర్డుల కోసం ఆకుపచ్చ రంగును సెలెక్ట్ చేస్తారు. కేవలం ఒక రంగు మాత్రమే కాదు, డ్రైవర్ల భద్రత, సౌకర్యం, స్పష్టమైన సమాచారం, వేగవంతమైన నిర్ణయాలకు ఈ కలర్ సాయపడుతుంది.

Advertisement

Read Also:  E85, E100 ఫ్యూయల్.. వాహనదారులకు కచ్చితంగా ఈ విషయాలు తెలియాల్సిందే!

Related News

జూలైతో పోల్చితే ఆగస్టులో తగ్గిన EV స్కూటర్ అమ్మకాలు.. కారణం ఏంటంటే?

కైనెటిక్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఏకంగా 132 కి.మీ రేంజ్!

టెస్లా సైబర్‌ ట్రక్‌కు ఇండియన్ టచ్.. ఫొటోలు చూస్తే నవ్వు ఆపుకోలేరు!

నెక్సాన్ To కర్వ్.. సెప్టెంబర్ లో టాటా కార్లపై ఊహించని డిస్కౌంట్లు!

మహీంద్రా SUVలపై భారీ డిస్కౌంట్లు.. స్కార్పియో Nపై ఏకంగా రూ.3 లక్షల తగ్గింపు!

ఎలక్ట్రిక్ స్కూటర్లకు సూపర్ డిమాండ్.. 8 నెలల్లోనే 13 లక్షలకు పైగా అమ్మకాలు!

సింపుల్ ఎనర్జీ సూపర్ జోష్.. ఏడాదిలో 10 వేలకుపైగా ఈవీ స్కూటర్ల సేల్!

ఈవీ రంగంలో హీరో దూకుడు.. నంబర్ వన్ కోసం అదిరిపోయే ప్లాన్!

Big Stories

Advertisement
×