E-Paper
Advertisement

Podarillu Today Episode : మహా పై కన్నా సీరియస్.. కన్నీళ్లు తెప్పించే సీన్.. శైలుకు సారీ చెప్పిన కేశవ..

Podarillu Today Episode : మహా పై కన్నా సీరియస్.. కన్నీళ్లు తెప్పించే సీన్.. శైలుకు సారీ చెప్పిన కేశవ..
Advertisement

Podarillu Today Episode June 12th :మొదటిరోజు ఆఫీస్ కి వెళ్ళినా మహాలక్ష్మికి గ్రాండ్ వెల్కమ్ పలికిన విక్కీ.. పని విషయంలో మాత్రం చాలా కఠినంగా ఉంటుంది.. ఒక డిజైన్ గియ్యమని చెప్పిన తర్వాత దాని మీద ఫోకస్ చేస్తున్న మహాలక్ష్మి దగ్గరికి దివ్య వస్తుంది.. దివ్య ఇంకా డిజైన్ అవ్వలేదని వ్యక్తి అడుగుతున్నాడు ఎంత టైం పడుతుంది అని అంటుంది.. మహాలక్ష్మి డిజైన్ పూర్తి అయిన తర్వాత తీసుకొని వెళ్తుంది.. అది చూసిన విక్కి మహాలక్ష్మికి దిమ్మతిరిగి పోయేలా షాకిస్తాడు.. అయితే నేను మళ్ళీ డిజైన్ వేస్తానని మహాలక్ష్మి చెప్పగానే కాఫీ తాగి మళ్ళీ ఒకసారి సరి చేయండి అని విక్కీ అంటాడు.. ఇంటికి వెళ్ళిన మహాలక్ష్మి అక్కడ బాత్రూం కడుతుండడం చూసి ఏంటి ఇప్పుడు ఇంత ఖర్చు అని అంటుంది అందరూ మీకోసమే అని చెప్తారు.

మహా పై కన్నా సీరియస్..

మహా టీ పెట్టడానికి లోపలికి వెళుతుంది.. అయితే కన్న కూడా వెనకాల వెళ్లడంతో నీవల్ల ఒక పెద్దాయనకి దెబ్బ తగిలింది కానీ నువ్వు సారీ కూడా చెప్పలేదు అని మహాలక్ష్మి కన్నా పై అరుస్తుంది. మీ నాన్నకి దెబ్బ తగిలితే నువ్వు వెళ్లి సారీ చెప్పాలని నీకు తెలియదా? అని మహాలక్ష్మి కన్నా ని అడుగుతుంది.. అయితే కన్నా ఆయనని నేను ఎప్పుడూ మా నాన్నగా చూడలేదు.. చిన్నప్పుడు నుంచి నేను ఆయన్ని మా నాన్న అని అనుకోలేదు.. అలాంటిది ఇప్పుడు నేను ఆయనకి సారీ ఎలా చెప్తాను.. దారిన పోయే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళందరికీ నేను సారీ చెప్పలేను కదా అని కన్నా అంటాడు.. మహాపై సీరియస్ అయ్యి వెళ్ళిపోవడం చూసిన మాధవ్ షాక్ అవుతాడు..

బాధపడ్డ మాధవ్..

Advertisement

కన్నా అతనికి నేను సారీ చెప్పను మీరు ఆఫీస్ కి వెళ్తున్నారని టపాసులు కాల్చడానికి నేను ఏర్పాట్లు చేస్తే ఆయన మధ్యలో వచ్చి డాన్స్ వేశాడు. దానికి నేను కారణమా నాకు సంబంధం లేదు అని అంటాడు. అయితే ఏంటమ్మా కన్నా అంతగా సీరియస్గా వెళ్ళిపోతున్నాడు అని మాధవ్ అంటాడు. అదేం లేదులే పెద్ది నేను చూసుకుంటాను అని మహాలక్ష్మి అంటుంది. కానీ మాధవ్ మాత్రం మహాలక్ష్మి పై కన్నా అరుస్తున్నాడు అని బాధపడతాడు. అయితే కన్నా కి వాళ్ళ నాన్న గురించి తెలియట్లేదు పెద్ది అందుకే వీడిలా మాట్లాడుతున్నాడు. వీటి గురించి నేను చూసుకుంటాను మీరేం పట్టించుకోకండి పెద్ధి అని మహాలక్ష్మి అంటుంది..

మహాకు సారీ చెప్పిన కన్నా..

బయటికి వెళ్లిన కన్నా దీని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అనవసరంగా వదిన మీద సీరియస్ అయ్యాను అని కన్నా మహాలక్ష్మికి సారీ చెప్పాలని అనుకుంటాడు.. బయటికి వెళ్లి రాత్రంతా ఆలోచించిన కన్నా మహాలక్ష్మి దగ్గరికి వచ్చి సారీ చెప్పాలని అనుకుంటాడు.. మాధవ్ అలాగే మహాలక్ష్మి ఇద్దరు కూడా వంటగదిలో వంట చేస్తూ ఉంటారు.. అయితే కన్న మాట్లాడడానికి ప్రయత్నిస్తున్న సరే మహాలక్ష్మి మాత్రం మాట్లాడకుండా మీరు ఎవరో నేనెవరో అని అంటుంది.. కనికన్నా మాత్రం నన్ను క్షమించండి వదినా అని తనకు తానే కొట్టుకుంటాడు దాంతో మహాలక్ష్మి క్షమించానులే వెళ్లి బయటికి వెళ్ళు అని అంటుంది.. వీరిద్దరి గురించి తెలుసుకుని మాధవ్ సంతోషంగా ఉంటాడు.

శివంగికి భయపడ్డ నారాయణ..

Advertisement

రాత్రి అందరూ కలిసి భోజనం చేయాలని అనుకుంటారు.. వాసన అదిరిపోయింది మరి ఏం చేశారు అని అడగ్గానే ఉప్మా అని మహాలక్ష్మి అంటుంది.. ఆ మాట వినగానే అందరూ ఉప్మాన అని లేచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తారు.. కానీ మహాలక్ష్మి కర్ర పట్టుకోవడంతో అందరూ కూర్చుంటారు కానీ అది బిర్యానీ అని తెలుసుకొని సంతోషంగా లాగించేస్తారు.. నారాయణ లోపలికి వెళ్తే ఆ శివంగి నన్ను చంపేస్తుంది అని ఆకలితో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏమి నిజం అడగనులే అని బిర్యాని తెచ్చి ఇస్తుంది మహా. చక్రి అడ్డుగా రావడంతో మహా షాక్ అవుతుంది.

చక్రీ పై మహా కౌంటర్స్..

ఉదయం లేవగానే చక్రి అందరూ టిఫిన్ చేసి రెడీగా ఉంటారు. కేశవ తింటూ లేస్తాడు కానీ మహాలక్ష్మి మాత్రం ప్రశాంతంగా కూర్చొని తినండి అని అంటుంది. అయితే నేను ఆఫీస్ కి తీసుకుని వెళ్తాను అని చక్రి అంటాడు.. కానీ మహాలక్ష్మి మాత్రం మీరెందుకు నేను బస్సులో వెళ్ళిపోతాను అని అంటుంది. అయితే కర్ణతో కలిసి వెళ్లిపోవడం చూసిన చక్రీ ఏ రోజు నాతో అలా లేదు కదా అని బాధ పడిపోతూ ఉంటాడు. రోజు బస్సులో వెళుతుంటే నాకు చాలా బాధగా ఉంది తనకోసం ఒక స్కూటీ కొనాలని కేశవతం మంచి స్కూటీ చూసి పెట్టమని అడుగుతాడు. మొత్తానికి మహా కోసం బాగా ఆలోచిస్తున్నాడు. స్కూటీ కొని తర్వాత చక్రిపై మహా మనసు పారేసుకుంటూందేమో చూడాలి.

శైలు కోసం కేశవ వెయిటింగ్..

ఈరోజు ఎలాగైనా సరే ఆ శైలజాకు సారీ చెప్పాలి అని కేశవ తనకోసం వెయిట్ చేస్తూ ఉంటాడు.. అయితే కేశవ్ అని చూసినా శైలు అక్కడి నుంచి చాలా సీరియస్గా వెళ్ళిపోవాలి అని ఉంటుంది. కీర్తి మాత్రం అక్కడ కేశవ ఉన్నాడు అని చెప్పగానే వాడు ఉంటే మనం పోకూడద ఏంటి? ఆపకుండా వెళ్ళిపో అని కీర్తితో అంటుంది.. అయితే కేశవ అడ్డుగా రావడంతో కీర్తి బండి ఆపుతుంది. ఆ తర్వాత కేశవ సారీ చెప్పినా కూడా శైలు మాత్రం తన మొండి పట్టుదలను విడకుండా ఉంటుంది.. ఆ తర్వాత క్లాస్ పీకేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సారీ చెప్పాలనుకుంటే ఇలా మాట్లాడుతుంది ఏంటి అని కేశవ బాధ పడిపోతూ ఉంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: రవికి టెన్షన్.. విడాకులు తీసుకుంటున్న శృతి.. హమ్మయ్య మీనా ప్లాన్ సక్సెస్..

Related News

Ninnu kori Serial Today Episode September 11th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సర్జరీ తర్వాత గతం మర్చిపోయిన విరాట్ – షాక్ లో చంద్ర 

Nindu Noorella Saavasam Serial Today Episode September 11th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన అమర్‌   

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు..ఆ 4 డోంట్ మిస్..

శ్రీసత్యకి లవ్ ప్రపోజ్ చేసిన హీరో.. అమ్మడి రియాక్షన్?

బిగ్ బాస్ 10లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్.. మొత్తం ఎంతమంది? ఎవరెవరంటే ?

అలీ హోస్ట్ గా మరో కొత్త షో..ఈసారి డబుల్ అల్లరి అంటూ!

బిగ్‌బాస్ హోస్టింగ్‌కు ఇంత డబ్బా? రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవుతారు!

బిగ్ బాస్ 10లో ఎవరు ఎంత తీసుకుంటున్నారు? లెక్కలు బయటికి!

Big Stories

Advertisement
×