Japan’s Custom Scooter Culture: జపాన్‌లో స్కూటర్ కల్చర్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సాధారణంగా రోజువారీ ప్రయాణాల కోసం ఉపయోగించే స్కూటర్లతో ప్రారంభమైన ఈ ట్రెండ్, ఇప్పుడు పూర్తిగా కొత్త స్థాయికి చేరుకుంది. ఒకప్పుడు సాదాసీదాగా కనిపించే మ్యాక్సీ స్కూటర్లు, ఇప్పుడు రైడర్ల చేతుల్లో అద్భుతమైన డిజైన్ కలిగిన యూనిక్ వాహనాలుగా మారుతున్నాయి.
ఈ కలర్చర్ కు ప్రేరణగా నిలిచిన మోడళ్లలో హోండా ఫ్యూజన్ ఒకటి. మొదట ఇది సాధారణ ప్రయాణానికి ఉపయోగించే స్కూటర్ గా ఉన్నప్పటికీ, కాలక్రమేణా దీన్ని మార్చి, కొత్త రూపంలో తీసుకురావడం ప్రారంభమైంది. అలా ఈ కస్టమ్ స్కూటర్ ట్రెండ్ పుట్టుకొచ్చింది.
ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, వేగం, రేసింగ్ గురించి కాదు. చాలా మంది అనుకునేలా స్పీడ్ కోసం కాదు. స్టైల్ కోసం ఈ మార్పులు చేస్తారు. ప్రతి రైడర్ తన ఆలోచనలను, వ్యక్తిత్వాన్ని తన వాహనం ద్వారా చూపించాలని భావిస్తాడు. అందుకే, ఈ స్కూటర్లు చూసినప్పుడు అవి సాధారణ వాహనాల్లా కాకుండా, ప్రత్యేక కళాఖండంలా కనిపిస్తాయి. ఈ కస్టమైజేషన్ లో అనేక మార్పులు కనిపిస్తాయి. స్కూటర్ ఫ్రేమ్ ను పొడిగించడం, ప్రత్యేకమైన పెయింటింగ్ చేయడం, ఆకర్షణీయమైన లైటింగ్ అమర్చడం, చిన్న చిన్న డీటైల్స్ కి కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. ఒక్కో స్కూటర్ పూర్తిగా భిన్నంగా కనిపించడం వల్ల, ప్రతి వాహనం ఒక ప్రత్యేక గుర్తింపును పొందుతుంది.
Read Also: రోడ్డు మీద ఉండే వైట్, యెల్లో లైన్స్ అర్థం ఏంటి? ప్రతి డ్రైవర్ కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
ఈ ట్రెండ్ ఒకప్పుడు కేవలం హాబీగా మొదలై ఇప్పుడు అండర్ గ్రౌండ్ కల్చర్ గా మారింది. జపాన్ వీధుల్లో ఈ స్కూటర్లు ప్రత్యేకంగా కనిపిస్తాయి. అక్కడి యువతలో ఓ స్టైల్ స్టేట్ మెంట్ గా మారింది. సాధారణ వాహనాన్ని కూడా ఎలా కొత్తగా మార్చుకోవచ్చో ఈ కల్చర్ చేసి చూపించింది. ఇలాంటి కస్టమ్ స్కూటర్లను ఒకసారి చూసిన తర్వాత, మనం సాధారణంగా చూసే స్కూటర్లు కొంచెం సాధారణంగా అనిపిస్తాయి. ఎందుకంటే ఇవి కేవలం ప్రయాణం కోసం ఉపయోగించే సాధారణ స్కూటర్లు కాదు. యజమానుల అభిరుచిని ప్రతిబింబించే ప్రతీకలుగా కొనసాగుతాయి. మొత్తానికి, జపాన్ కస్టమ్ స్కూటర్ కల్చర్ అనేది సృజనాత్మకతకు ఒక అద్భుత ఉదాహరణగా మారింది. వాహనాలపై ఉన్న అభిరుచిని కళగా మార్చిన ఒక ప్రత్యేక ప్రపంచం జపాన్ అని చెప్పక తప్పదు.
Read Also: బెంగళూరు రోడ్ల గుంతలపై వినూత్న నిరసన, ఏకంగా పోర్షే కారుపై సిమెంట్ కలిపి..