E-Paper
Advertisement

మెగా కాంపౌండ్‌లో ‘సర్జరీ’ల కలకలం! ఒకరి తర్వాత ఒకరు.. అసలు ఏమవుతోంది?

మెగా కాంపౌండ్‌లో ‘సర్జరీ’ల కలకలం! ఒకరి తర్వాత ఒకరు.. అసలు ఏమవుతోంది?
Advertisement

Mega Family : టాలీవుడ్ వెండితెరను ఏలుతున్న మెగా ఫ్యామిలీకి 2026 సంవత్సరం అస్సలు కలిసి రావడం లేదు. ఏడాది మొదలైన ఈ నాలుగు నెలల్లోనే ఏకంగా నలుగురు మెగా హీరోలు గాయాల బారిన పడటమో లేదా సర్జరీ చేసుకోవాల్సి రావడమో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి నుంచి మొదలుపెడితే రీసెంట్‌గా పవన్ కల్యాణ్ వరకు.. ఈ లిస్ట్ చూస్తుంటే మెగా ఫ్యాన్స్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

చిరంజీవి..ఫిబ్రవరి 12 – భుజానికి సర్జరీ 

Advertisement

చిరు విషయానికే వస్తే మొన్నటి పొంగల్ బరిలో దిగి సాలిడ్ హిట్ చూసిన ఈ మెగా స్టార్ అలా సక్సెస్ ని చేద్దాము అనుకునే లోపే ఆసుపత్రి పాలయ్యారు. అలా ఫిబ్రవరి 12న భుజానికి కీ హోల్ సర్జరీ చేయించుకున్న చిరు కోలుకుని ప్రస్తుతం బాబీ సినిమాపై ఫోకస్ చేశారు. ఇక వయసు మీద పడుతుండటంతో హెల్త్ ని దృష్టిలో పెట్టుకొని రిస్కీ షాట్స్ చేయొద్దని డాక్టర్స్ సలహా ఇచ్చినట్టు తెలుస్తుంది.

రామ్ చరణ్.. మార్చి చివరి వారం – కంటికి గాయం

Advertisement

ఇక చిరు తర్వాత నా వంతు అన్నట్టుగా పెద్ది షూటింగ్ టైమ్ లో రామ్ చరణ్ కంటిపై తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. దీంతో ఏప్రిల్ 30న రిలీజ్ కావాల్సిన సినిమా కాస్తా జూన్ నెలకు పోస్ట్ పోన్ అయ్యింది. ప్రస్తుతం రికవర్ అయిన చరణ్ ఎట్టిపరిస్థితుల్లో సినిమాని జూన్ లో రిలీజ్ చేయాలన్న టార్గెట్ తో యమా జోరుగా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. మరి ఈసారైనా అనుకున్నట్టుగా విడుదల చేస్తారో లేదో చూడాలి.

ALSO READ :OTT సంచలనం.. సెన్సార్‌ లేని శృంగార కావ్యం.. ఒక్క సిరీస్‌తోనే దేశం మొత్తం ఫిదా!

 వరుణ్ తేజ్.. ఏప్రిల్ మొదటి వారం – మోకాలి సర్జరీ

ఇక పెదనాన్న, అన్నయ్య బాటలోనే సర్జరీ బారిన పడ్డాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. చెల్లెలు నిహారికా ప్రొడ్యూసర్ గా వరుణ్ తేజ్ వాలీబాల్ నేపథ్యంలో ‘బరి’ అనే స్పోర్ట్స్ డ్రామా చేస్తున్న సంగతి తెలిసిందే. యదు వంశీ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా కోసం వాలీ బాల్ ప్రాక్టీస్ చేస్తుండగా వరుణ్ మోకాలి లిగ్మెంట్ దెబ్బ తినడంతో సర్జరీ చేయాల్సిన పరిస్థితి. అయితే సర్జరీ కంప్లీట్ అయినా వరుణ్ బరిలోకి దిగాలంటే మరో 20 రోజులు పట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం.

 పవన్ కల్యాణ్.. ఏప్రిల్ 18 – సడన్ సర్జరీ

ఇక ఇప్పుడు నా వంతు అన్నట్టుగా మొన్న అంటే ఏప్రిల్ 18న, శనివారం నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురికావడం, అత్యవసరంగా సర్జరీ చేయడం తెలిసిందే. ఇక పవన్ హైదరాబాద్ లోని తన ఇంట్లో బెడ్ రెస్ట్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. దీంతో పవన్ అటు పాలిటిక్స్ ని, ఇటు సురేందర్ రెడ్డితో జరగాల్సిన స్టోరీ డిస్కషన్స్ అన్నింటికి కొన్ని రోజుల పాటు బ్రేక్ ఇచ్చినట్టు సమాచారం.

దీంతో ఇలా ఒకరి తర్వాత ఒకరు వరుసగా సర్జరీల బారిన పడటం చూసి కొంపదీసి మెగా ఫ్యామిలీకి దిష్టి తగిలిందా ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా 2026లో తగులుతున్న ఈ వరుస దెబ్బలనుండి మెగా హీరోలు త్వరగా కోలుకోవాలని, పెద్ది, బరి సినిమాల్ని ఎలాంటి అడ్డంకులు లేకుండా సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలని కోరుకుంటున్నారు మెగా ఫ్యాన్స్.

ALSO READ :టాలీవుడ్ బాక్సాఫీస్ అట్టర్ ప్లాప్.. థియేటర్ల దగ్గర ఈగలు తోలుకోవాల్సిందేనా?

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×