E-Paper
Advertisement

కారు పార్కింగ్‌లో ఈ ‘రివర్స్’ లాజిక్ గురించి తెలుసా? అస్సలు మిస్ అవ్వకండి!

కారు పార్కింగ్‌లో ఈ ‘రివర్స్’ లాజిక్ గురించి తెలుసా? అస్సలు మిస్ అవ్వకండి!
Advertisement

Reverse Parking: సాధారణంగా చాలామంది వాహనదారులు పార్కింగ్ స్థలం కనిపించగానే ముందుగా (Front-in) కారును లోపలికి పోనిస్తుంటారు. ఇది ఆ సమయానికి సులభంగా అనిపించినా.. తిరిగి బయటకు వచ్చేటప్పుడు మాత్రం ప్రమాదాలకు దారితీయెుచ్చు. అందుకే నిపుణులు ఎప్పుడూ ‘రివర్స్ పార్కింగ్’ చేయడమే బెస్ట్ అని చెబుతుంటారు. దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? రివర్స్ పార్కింగ్ వల్ల కలిగే ప్రధాన లాభాలేంటో ఈ కథనంలో చూద్దాం.

మెరుగైన విజిబిలిటీ

మనం కారును రివర్స్ తీస్తూ రోడ్డు మీదకు వచ్చేటప్పుడు పక్కన ఉన్న వాహనాల వల్ల మనకు అటు ఇటు వచ్చే ఇతర వాహనాలు సరిగ్గా కనిపించవు. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం 80% ఎక్కువగా ఉంటుంది. అదే మనం వెనక్కి పార్క్ చేస్తే.. వెళ్లేటప్పుడు కారు ముందు భాగం రోడ్డు వైపు ఉంటుంది. కాబట్టి మనకు రోడ్డు స్పష్టంగా కనిపిస్తుంది. దీనివల్ల పాదచారులు లేదా సైకిల్ మీద వెళ్లేవారు అకస్మాత్తుగా వచ్చినా వెంటనే గమనించి బ్రేక్ వేసేందుకు అవకాశం ఉంటుంది.

అత్యవసర పరిస్థితుల్లో..

Advertisement

ఫైర్ యాక్సిడెంట్, మెడికల్ ఎమెర్జెన్సీ సమయంలో వాహనాన్ని త్వరగా బయటకు తీయడానికి ఈ రివర్స్ పార్కింగ్ ఉపయోగపడుతుంది. పార్కింగ్ ఏరియా నుంచి కారును వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశం ఏర్పడుతుంది. అదే ఫ్రంట్ పార్కింగ్ అయితే.. కంగారులో రివర్స్ తీయడం వల్ల సమయం వృథా అవ్వడమే కాకుండా పొరపాట్లు జరిగే ఛాన్స్ ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

చిన్న పిల్లల భద్రత

చిన్న పిల్లలు లేదా పెంపుడు జంతువులు కారు వెనుక భాగంలో ఉంటే డ్రైవర్‌కు కనిపించడం చాలా కష్టం. కారును రివర్స్ తీస్తూ బయటకు వచ్చేటప్పుడు ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే రివర్స్ పార్కింగ్ చేసేటప్పుడు అప్పటికే పరిసరాలను గమనించి ఉంటారు కాబట్టి తిరిగి వెళ్లేటప్పుడు ముందు వైపు నుండి అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి.

ఇంధనం ఆదా..

Advertisement

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇంజిన్ చల్లగా ఉన్నప్పుడు రివర్స్ గేర్ వేసి వాహనాన్ని తిప్పడం వల్ల ఇంజిన్‌పై ఒత్తిడి పడుతుంది. ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది. అదే కారును పార్క్ చేసేటప్పుడు ఇంజిన్ వేడిగా ఉంటుంది కాబట్టి రివర్స్ చేయడం సులభం. తిరిగి వెళ్లేటప్పుడు నేరుగా ఫస్ట్ గేర్‌లో వెళ్లడం వల్ల ఇంజిన్ పనితీరు మెరుగ్గా ఉంటుంది.

Also Read: పెట్రోల్ vs సీఎన్‌జీ కారు.. సామాన్యుడికి ఏది లాభం? సూటిగా సుత్తిలేకుండా తెలుసుకోండి!

ఇరుకైన ప్రదేశాలకు బెస్ట్

చాలామంది రివర్స్ పార్కింగ్ చాలా కష్టం అని భావిస్తుంటారు. వాస్తవానికి ఇరుకైన సందుల్లో లేదా చిన్న పార్కింగ్ స్లాట్లలో కారును అమర్చడానికి రివర్స్ పార్కింగ్ అత్యంత అనువైన పద్ధతి అని నిపుణులు అంటున్నారు. తక్కువ స్థలంలోనూ కారును పార్క్ చేసేందుకు ఈ రివర్స్ పార్కింగ్ పనిచేస్తుందని సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం వస్తున్న అడ్వాన్స్డ్ కార్లలో రివర్స్ కెమెరాలు, సెన్సార్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి రివర్స్ పార్కింగ్ మరింత సులభతరంగా మారిపోయిందని పేర్కొంటున్నారు.

Also Read: పెట్రోల్ vs ఎలక్ట్రిక్ కారు.. కిలో మీటర్‌కు రూ.1 అనేది.. నిజమా లేక మార్కెటింగ్ జిమ్మిక్కా?

Related News

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

హ్యుందాయ్ కొత్త SUV ఇంటీరియర్ లీక్.. క్రెటాకు పోటీ తప్పదా?

మాన్యువల్ కార్ల కంటే ఆటోమేటిక్ కార్లే ఫాస్టా? ఇదీ అసలు కథ!

ఏంటీ.. మారుతీ, హుందాయ్‌లో 5 స్టార్ సేఫ్టీ కార్లు ఉన్నాయా? ఇదిగో లిస్టు!

యమహా R2 వచ్చేసింది.. ఈ బైక్‌ లో అదిరిపోయే 5 హైలైట్స్ ఇవే!

సింపుల్ ఫ్లిప్ అప్ కాదు.. ఈ హెల్మెట్ 180 డిగ్రీలు తిరుగుతుంది!

Big Stories

Advertisement
×