Classic Japanese Cars 1960-1990: జపాన్ నుంచి వచ్చిన క్లాసిక్ కార్లు ప్రపంచ వ్యాప్తంగా ఆటోమోటివ్ చరిత్రలో ప్రత్యేక స్థానం పొందాయి. 1960-1990ల దశకాల్లోని ఐకానిక్ మోడల్స్ ప్రపంచాన్ని ఆకట్టుకున్నాయి. ఇవి డిజైన్, పెర్ఫార్మెన్స్, ఇన్నోవేషన్ లో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. వాటిలో టాప్ 5 బెస్ట్ క్లాసిక్ జపనీస్ కార్లు ఏవనేది ఇప్పుడు చూద్దాం..
యమహాతో కలిసి టయోటా తయారు చేసిన మొదటి సూపర్ కార్ ఇది. జేమ్స్ బాండ్ మూవీ ‘You Only Live Twice’లో కనిపించింది. యూరోపియన్ సూపర్ కార్లకు సమానంగా డిజైన్ చేయబడింది. 2.0L ఇన్‌లైన్-6 ఇంజన్, 150 hp, 0-100 km/h 8.6 సెకన్లు, టాప్ స్పీడ్ 220 km/h. డబుల్ విష్‌బోన్ సస్పెన్షన్, డిస్క్ బ్రేక్స్ ను కలిగి ఉంటుంది. దీనిని జపనీస్ E-టైప్ అని పిలుస్తారు. అందమైన డిజైన్, హై పెర్ఫార్మెన్స్ కారణంగా బాగా పాపులర్ అయ్యింది. ఈ కారుతో జపాన్ ఆటో ఇండస్ట్రీని ప్రపంచానికి పరిచయం చేసింది. దీని ప్రస్తుత విలువ మంచి కండిషన్‌లో ఉంటే రూ. 5-10 కోట్లు ఉంటుంది.
నిస్సాన్ కంపెనీ తయారు చేసిన ఈ కారు, అమెరికాలో బాగా పాపులర్ అయ్యింది. స్పోర్ట్స్ కార్ మార్కెట్‌ను ఈ మోడల్ పూర్తిగా మార్చేసింది. 2.4L ఇన్‌లైన్-6 ఇంజన్, 151 hp, 0-100 km/h 8 సెకన్లు, టాప్ స్పీడ్ 200 km/Hను కలిగి ఉంటుంది. ఇండిపెండెంట్ సస్పెన్షన్, సరసమైన ధరలో హై పెర్ఫార్మెన్స్, స్టైలిష్ డిజైన్ కారణంగా మిలియన్ల కొద్దీ యూనిట్లు అమ్ముడైంది. ప్రస్తుత విలువ రూ. 20-50 లక్షలు ఉంటుంది.
దీనిని హకోసుకా అని పిలుస్తారు. రేసింగ్ హెరిటేజ్, జపాన్ మోటార్‌స్పోర్ట్స్ లో లెజెండ్. 2.0L ఇన్‌లైన్-6 ఇంజన్, 160 hp, 0-100 km/h 7 సెకన్లు, టాప్ స్పీడ్ 200 km/h, రేస్ స్పెస్ సస్పెన్షన్ ను కలిగి ఉంటుంది. GT-R లైనేజ్ మొదలు, రేసింగ్ విక్టరీలు, గ్రాన్ టురిస్మో గేమ్స్ లో ఫేమస్ అయ్యింది. ప్రస్తుత విలువ రూ.1-3 కోట్లు ఉంటుంది.
మాజ్డా రోటరీ ఇంజన్ స్పోర్ట్స్ కార్ ఇది. మూడవ జనరేషన్ (FD) అత్యంత పాపులర్ అయ్యింది. 1.3L ట్విన్-టర్బో రోటరీ ఇంజన్, 255 hp, 0-100 km/h 5 సెకన్లు, టాప్ స్పీడ్ 250 km/h, లైట్ వెయిట్ బాడీని కలిగి ఉంటుంది. రోటరీ ఇంజన్ యూనిక్ సౌండ్, పెర్ఫార్మెన్స్, హ్యాండ్లింగ్ సూపర్ ఉంటుంది. ఫాస్ట్, ఫ్యూరియస్ సినిమాల్లో బాగా ఫేమస్. ప్రస్తుత విలువ రూ. 30-80 లక్షలు ఉంటుంది.
హోండా తయారు చేసిన ఈ మిడ్ ఇంజన్ సూపర్ కార్ ఫెరారీలకు సవాల్ విసిరింది. 3.0L V6 ఇంజన్, 270 hp, 0-100 km/h 5.8 సెకన్లు, టాప్ స్పీడ్ 270 km/hను కలిగి ఉంటుంది. అల్యూమినియం బాడీ, VTEC టెక్నాలజీతో రూపొందింది. సూపర్ కార్ పెర్ఫార్మెన్స్ తో డైలీ డ్రైవర్ కంఫర్ట్ గా ఉంటుంది. ప్రస్తుత విలువ రూ. 50 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు ఉంటుంది.
Read Also: 90s దుమ్మురేపిన కార్లు, ఆ రోజుల్లో వీటికి ఉండే క్రేజే వేరు!