E-Paper
Advertisement

యమహా లవర్స్‌ కు గుడ్ న్యూస్.. ఫాసినో హైబ్రిడ్ స్కూటర్ వచ్చేసింది!

యమహా లవర్స్‌ కు గుడ్ న్యూస్.. ఫాసినో హైబ్రిడ్ స్కూటర్ వచ్చేసింది!
Advertisement

New Yamaha Fascino 125 Hybrid: యమహా తాజాగా భారత మార్కెట్లో ఫాసినో 125 Fi హైబ్రిడ్ స్కూటర్‌ ను పరిచయం చేసింది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 76,500గా నిర్ణయించింది. కొత్త వెర్షన్‌ లో కొన్ని చిన్న మార్పులు చేసినప్పటికీ, స్కూటర్‌ కు ఉన్న స్టైలిష్ లుక్‌ ను అలాగే కొనసాగించారు.

కొత్తగా చేసిన మార్పులు ఇవే!

ఈ కొత్త మోడల్‌ వెనుక భాగం డిజైన్‌ లో మార్పులు చేశారు. ఇప్పుడు టెయిల్ సెక్షన్‌ ను కొంచెం కాంపాక్ట్‌ గా మార్చారు.  దీనివల్ల స్కూటర్ మరింత స్మార్ట్‌ గా కనిపిస్తుంది. ముందున్న మోడల్‌ తో పోలిస్తే, టెయిల్‌ లైట్‌ను చిన్నగా డిజైన్ చేశారు. అలాగే టర్న్ ఇండికేటర్లను వేరుగా అమర్చారు. గతంలో టెయిల్‌ లైట్‌ తో కలిపి ఇండికేటర్లు ఉండేవి. ఈ మార్పు స్కూటర్‌ కు కొత్త ఫీల్‌ను ఇస్తుంది. అయితే, మొత్తం డిజైన్ మాత్రం యమహా ఫాసినోకు ప్రత్యేకమైన స్టైల్‌ ను అలాగే ఉంచింది.

ఇంజిన్ లో నో ఛేంజెస్

Advertisement

ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో ఎలాంటి పెద్ద మార్పులు చేయలేదు. అదే 125cc సామర్థ్యం కలిగిన ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ ను ఉపయోగించారు. ఈ ఇంజిన్ సుమారు 8 bhp పవర్, 10.3 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. సిటీ ప్రయాణాలకు సరిపడే విధంగా ఇది స్మూత్ పనితీరును అందిస్తుంది. హైబ్రిడ్ టెక్నాలజీ కారణంగా ఇంధన పొదుపు కూడా మెరుగ్గా ఉంటుంది.

మూడు వేరియంట్లలో అందుబాటులోకి

ఈ స్కూటర్ మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. మొదటిది డ్రమ్ వేరియంట్, ఇది ఎంట్రీ లెవల్ మోడల్. దీని ధర రూ. 76,500. రెండవది డిస్క్ వేరియంట్, ఇది కొంచెం అధిక ఫీచర్లతో వస్తుంది, దీని ధర రూ. 88,000. మూడవది టాప్ వేరియంట్ అయిన ఫాసినో ఎస్, దీని ధర రూ. 95,200గా ఉంది. ధరల్లో కూడా కొన్ని చిన్న మార్పులు ఉన్నాయి. డ్రమ్ వేరియంట్ ధర గతంతో పోలిస్తే రూ. 1,590 పెరిగింది. డిస్క్ వేరియంట్ ధర కూడా సుమారు రూ. 900 పెరిగింది. టాప్ వేరియంట్ ఫాసినో ఎస్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు.

ప్రతి వేరియంట్ కు ప్రత్యేకమైన కలర్లు

Advertisement

కలర్స్ విషయానికి వస్తే, ప్రతి వేరియంట్‌కు ప్రత్యేకమైన కలర్ ఆప్షన్లు ఉన్నాయి. డ్రమ్ వేరియంట్‌ లో రెడ్, బ్లాక్, వైట్ లాంటి సాధారణ రంగులు లభిస్తాయి. డిస్క్ వేరియంట్‌ లో బ్లూ, గ్రీన్ లాంటి కలర్స్ ఉంటాయి. ఫాసినో ఎస్ వేరియంట్ మాత్రం మ్యాట్ ఫినిష్ కలర్స్‌ లో అందుబాటులో ఉంటుంది. మొత్తంగా కొత్త ఫాసినో 125 Fi హైబ్రిడ్ స్కూటర్‌లో పెద్ద మార్పులు లేకపోయినా, చిన్న డిజైన్ అప్‌ డేట్స్‌ తో మరింత ఆకర్షణీయంగా మారింది. సిటీ రైడింగ్ కోసం స్టైలిష్, ఫ్యూయల్ ఎఫిషియెంట్ స్కూటర్ కోసం చూస్తున్న వారికి ఇది మంచి ఆప్షన్‌ కానుంది.

Read Also: పల్సర్ 180 రీలాంచ్.. ఏకంగా 4 కొత్త కలర్స్‌ తో ఎంట్రీ!

Related News

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

Big Stories

Advertisement
×