E-Paper
Advertisement

Yamaha Nmax 155: యమహా నుంచి క్రేజీ స్కూటర్, లాంచింగ్ ఎప్పుడంటే

Yamaha Nmax 155: యమహా నుంచి క్రేజీ స్కూటర్, లాంచింగ్ ఎప్పుడంటే

Yamaha Nmax 155 Scooter: యమహా నుంచి అదిరిపోయే స్పోర్టీ బైక్స్ అందుబాటులోకి వస్తున్నాయి. వాటితో పాటు స్కూటర్లను కూడా విడుదల చేస్తోంది. అందులో భాగంగానే  యమహా Nmax 155 అనేది స్కూటర్ ను త్వరలో లాంచ్ చేయబోతోంది. ఏరోక్స్ 155 ప్లాట్‌ ఫామ్‌ మీద ఈ మ్యాక్సీ స్కూటర్ తయారైంది. ఈ స్పోర్టీ ఏరోక్స్‌ కుటుంబ ప్రయాణాలకు అనుగుణంగా ఉంటుంది.

యమహా Nmax 155 ఫీచర్లు

యమహా Nmax 155 మ్యాక్సీ స్కూటర్ లా కనిపిస్తుంది. ఇది యూరప్ తో పాటు ఆసియాలోనూ అందుబాటులోకి రానుంది. ఇదో పెద్ద స్కూటర్ గా రానుంది. దీని పరిమాణం ట్విన్ LED హెడ్‌ లైట్‌ లను కలిగి ఉన్న విశాలమైన ఫ్రంట్ ఆప్రాన్ ను కలిగి ఉంటుంది. హెడ్‌ లైట్ మీద పొడవైన, నల్లగా ఉన్న విండ్‌ స్క్రీన్ ఉంటుంది. స్కూటర్ చూడ్డానికి పొడవుగా ఉంటుంది. ప్రక్క నుంచి, సెంట్రల్ స్పైన్ దృష్టిని ఆకర్షిస్తుంది. చక్కగా రూపొందించిన సైడ్, టెయిల్ సెక్షన్ కూడా ఆకట్టుకుంటుంది. Nmax 155లో పూర్తి LED లైట్లు, రిమోట్ బూట్ రిలీజ్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఇండియాలో అందుబాటులోకి వచ్చే స్కూటర్ డ్యూయల్ ఛానల్ ABS సెటప్‌ ను కూడా పొందే అవకాశం ఉంటుంది.

యమహా Nmax 155 ఇంజిన్ గురించి..

యమహా Nmax 155 స్కూటర్ 155cc, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. ఇది 14.9bhp పవర్,  13.5Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. CVT తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజిన్ పవర్ ఫుల్ గా ఉంటుంది.  Yamaha R15, Aerox 155లో కూడా సేమ్ ఇంజిన్ ఉంటుంది. రివ్ హ్యాపీ తో పాటు ఫ్యూయెల్ ఎఫిషియెన్సీని కలిగి ఉంది. ఈ స్కూటర్ టెలిస్కోపిక్ ఫోర్క్, ట్విన్ షాక్ అబ్జార్బర్ల ద్వారా సస్పెండ్ చేయబడిన అండర్‌ బోన్ ఛాసిస్‌ ను కలిగి ఉంది. ఇది  13 అంగుళాల వీల్స్ ను కలిగి ఉంటుంది. బ్రేకింగ్ విషయాని వస్తే, స్కూటర్ ఫ్రంట్, రియర్ లో డిస్క్ బ్రేక్‌ లను కలిగి ఉంటుంది.

Read Also: MV అగస్టా రష్ టైటానియో లిమిటెడ్ ఎడిషన్ లాంచ్, డిజైన్ భలే ఉంది గురూ!

యమహా Nmax 155 లాంచ్, ధర

యమహా Nmax 155 స్కూటర్ భారత్ లో మార్చి 2026లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని ధర రూ. 1,60,000 నుంచి రూ. 1,70,000 వరకు ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్నసింపుల్ ఎనర్జీ వన్ జెన్ 2, వెస్పా S 150, వెస్పా 150 మాదిరిగానే Nmax 155 ఉంటుంది. ఇంకా చెప్పాలంటే వీటితోనే పోటీ పడే అవకాశం ఉంటుంది. Nmax 155 మాదిరిగానే మరో బైక్ యమహా EC-06 మార్చి 2026లో ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెట్టనుంది.

Read Also:  హ్యుందాయ్ నుంచి దుమ్మురేపే కారు, దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?

Related News

ఇండియన్ మార్కెట్ లోకి యమహా NMax 155 ఎంట్రీ, ఫీచర్లు చూస్తే షాక్!

టీవీఎస్, బజాజ్ జోరు.. ఓలా బేజారు.. ఈవీ స్కూటర్ అమ్మకాల్లో టాప్ 5 మోడల్స్ ఇవే!

ఒకే ఇంజిన్.. రెండు బైక్స్.. బుల్లెట్ 650 vs క్లాసిక్ 650 డిఫరెన్స్ ఇవే!

అవెంజర్ లవర్స్ కు గుడ్ న్యూస్.. రెండు రంగుల్లో స్ట్రీట్ 220 మళ్లీ ఎంట్రీ!

95 కి.మీ క్లెయిమ్.. కానీ, నిజంగా ఇ-యాక్సెస్ ఇచ్చిన రేంజ్ ఎంతో తెలుసా?

టాటా మోటార్స్ మాస్టర్ ప్లాన్.. అవిన్యా X లాంచింగ్ డేట్ ఫిక్స్!

మహీంద్రాను దాటేసిన టాటా.. మే 2026 ఈవీ అమ్మకాల్లో సరికొత్త రికార్డు!

పెట్రోల్‌ తో పాటు ఇథనాల్‌ తోనూ పరుగులు.. కొత్త వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌ ప్రత్యేకతలు ఇవే!

Big Stories

×