E-Paper
Advertisement

యమహా NMax 155 వచ్చేస్తోంది.. ఫీచర్లు ఏంటి? ధర ఎంత ఉండొచ్చంటే?

యమహా NMax 155 వచ్చేస్తోంది.. ఫీచర్లు ఏంటి? ధర ఎంత ఉండొచ్చంటే?
Advertisement

Yamaha NMax 155 India Launch: యమహా అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న NMax 155 మ్యాక్సీ స్కూటర్ ఎట్టకేలకు భారత మార్కెట్లోకి అడుగు పెట్టబోతోంది. గత కొన్నేళ్లుగా ఈ స్కూటర్‌ ను భారత్‌ లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్న యమహా, 2024 ఆటో ఎక్స్‌ పోలో కూడా దీనిని ప్రదర్శించింది. తాజాగా సమాచారం ప్రకారం, 2027 నాటికి NMax 155 భారత మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది.

అద్భుతమైన డిజైన్ తో..

చూడటానికి NMax 155, ప్రస్తుతం అమ్మకాల్లో ఉన్న Aerox 155తో పూర్తిగా భిన్నంగా కనిపించినప్పటికీ, ఈ రెండు స్కూటర్లలో చాలా కీలక భాగాలు ఒకే విధంగా ఉంటాయి. ముఖ్యంగా 155cc లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ ను రెండింటిలోనూ ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజిన్ 15 హెచ్‌పీ పవర్, 14 ఎన్ఎం టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. Aerox ఇప్పటికే E20  ఫ్యూయల్ కు అనుకూలంగా ఉన్నందున NMax కూడా అదే సామర్థ్యంతో రానుందని భావిస్తున్నారు.

Advertisement

స్టోరేజ్ విషయానికి వస్తే NMax కొంత అదనపు స్పేస్ ను కలిగి ఉంటుంది. Aeroxలో 24.5 లీటర్ల అండర్‌ సీట్ స్టోరేజ్ ఉండగా, NMaxలో 25 లీటర్ల సామర్థ్యం ఉంటుంది. దీంతో హెల్మెట్‌ తో పాటు ఇతర చిన్న వస్తువులను కూడా సులభంగా నిల్వ చేసుకోవచ్చు. సస్పెన్షన్ పరంగా.. ముందు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్లను యమహా అందిస్తోంది. ముఖ్యంగా వెనుక భాగంలో గ్యాస్ చార్జ్డ్ షాక్‌ లు ఉండటం వల్ల ప్రయాణంలో మరింత కంఫర్ట్ లభించే అవకాశం ఉంది. Aeroxతో పోలిస్తే NMax ప్రయాణ సౌకర్యంపై ఎక్కువ దృష్టి పెట్టిన మోడల్‌ గా కనిపిస్తోంది.

ఫీచర్ల గురించి..

ఫీచర్ల విషయంలో NMax 155 మరిం క్రేజీగా ఉంటుంది. ఇందులో 4.2 అంగుళాల కలర్ TFT డిస్‌ ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, కీలెస్ స్టార్ట్, పూర్తి LED లైటింగ్, ఆటో స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ లాంటి ఆధునిక సదుపాయాలు ఉండనున్నాయి. ముందు భాగంలో చిన్న స్టోరేజ్ కంపార్ట్‌ మెంట్లు కూడా అందుబాటులో ఉంటాయి. భద్రత పరంగా కూడా NMax ప్రత్యేకంగా ఉంటుంది. Aeroxలో వెనుక డ్రమ్ బ్రేక్ ఉండగా, NMaxలో వెనుక డిస్క్ బ్రేక్ లభించే అవకాశం ఉంది. అంతేకాకుండా కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలో అందిస్తున్న డ్యూయల్ ఛానల్ ABS వ్యవస్థను కూడా భారత మోడల్‌ లో తీసుకురావచ్చని అంచనా.

ధర ఎంత ఉంటుందంటే?

Advertisement

ప్రస్తుతం Aerox 155 ధర రూ.1.43 లక్షల నుంచి రూ.1.46 లక్షల మధ్య ఉంది. NMaxలో అదనపు ఫీచర్లు, మెరుగైన సౌకర్యాలు ఉండటంతో దీని ధర Aerox కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. స్టైల్, కంఫర్ట్, ఫీచర్లు, స్టోరేజ్ వంటి అంశాల్లో NMax 155 భారతీయ వినియోగదారులను ఆకట్టుకునే అవకాశం ఉంది.

Read Also: ఇక నో రీసేల్ టెన్షన్‌.. బై బ్యాక్ గ్యారెంటీతో లభిస్తున్న 8 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Related News

ధర తక్కువ.. సేఫ్టీలో నో కాంప్రమైజ్.. రూ.10 లక్షల్లో బెస్ట్ 5 స్టార్ రేటింగ్ కార్లు ఇవే!

పెట్రోల్‌తో పాటు ఇథనాల్‌ తోనూ పరుగులు.. కియా సైరోస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు వచ్చేస్తోంది!

హీరో, హోండాకు టీవీఎస్ షాక్.. ఆగస్టులో నంబర్ వన్ టూ వీలర్ కంపెనీగా రికార్డ్!

కొత్త కలర్స్‌ తో కవాసకి Z సిరీస్.. నయా లుక్ సూపరో సూపరు!

కియా సోరెంటో వచ్చేసింది.. ఫార్చ్యూనర్‌ కు ఇక చుక్కలే!

హిమాలయన్ 440 వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

టాటా కర్వ్‌ లో కొత్త సిరీస్ X.. తక్కువ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు!

హోండా ఫ్యాన్స్‌ కు గుడ్‌న్యూస్.. ఎలివేట్, సిటీ, అమేజ్‌పై అదిరిపోయే డిస్కౌంట్లు!

Big Stories

Advertisement
×