E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

యమహా బైక్ ధరలు పెంపు, కొత్త రేట్లు ఎలా ఉన్నాయంటే?

యమహా బైక్ ధరలు పెంపు, కొత్త రేట్లు ఎలా ఉన్నాయంటే?
Advertisement

Yamaha Hikes R15 Prices: ప్రముఖ టూవీలర్ కంపెనీ యమహా ధరలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. పాపులర్  స్పోర్ట్స్ బైక్ R15 V4కు సంబంధించి అన్ని వేరియంట్ల ధరలను పెంచింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఈ మోడల్ పై  రూ. 4,900 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ధరలు ఈ నెల నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ముడి సరుకు, రవాణ ధరలు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ వెల్లడించింది.

కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?

కొత్త ధరల ప్రకారం.. R15M కార్బన్ ఫైబర్ వేరియంట్ ధర రూ. 1,96,100గా ఉంది. R15M MotoGP ఎడిషన్ రూ. 1,87,500కు లభిస్తుంది. సాధారణ R15M వేరియంట్ ధర రూ. 1,86,000. అలాగే R15 డ్యూయల్ టోన్ వేరియంట్ రూ. 1,75,700, డార్క్ నైట్ ఎడిషన్ రూ. 1,72,000, స్టాండర్డ్ వేరియంట్ రూ. 1,71,100గా నిర్ణయించారు. చిన్న ఇంజిన్ సామర్థ్యంతో వచ్చే బైక్‌ కు ఈ ధర పెంపు కొంత ఎక్కువగానే అనిపించవచ్చు. కానీ, R15కు ఉన్న క్రేజ్‌ను చూస్తే, ఈ పెంపు అమ్మకాలపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. ఈ బైక్ ప్రత్యేకమైన డిజైన్, స్పోర్టీ లుక్, రైడింగ్  ఎక్స్ పీరియెన్స్ కారణంగా యువతలో మంచి ఆదరణ పొందుతోంది.

R15 డిజైన్ గురించి..

Advertisement

ఈ బైక్ పెద్ద సూపర్‌ బైక్‌ల నుండి ప్రేరణ పొంది తయారు చేయబడింది. ముఖ్యంగా యమహా YZF-R1 ప్రభావం భారీగా కనిపిస్తుంది. ముందుభాగంలో అగ్రెసివ్ లుక్, స్లీక్ బాడీ డిజైన్ ఈ బైక్‌ ను ప్రత్యేకంగా నిలబెడతాయి.  ఇందులో ఆధునిక TFT డిస్‌ ప్లే, ట్రాక్షన్ కంట్రోల్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి సాధారణంగా ఈ సెగ్మెంట్‌ లో అరుదుగా కనిపిస్తాయి.

ఇంజిన్ గురించి..

R15 V4లో 155cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్ టెక్నాలజీతో పని చేస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 18.1 bhp పవర్, 14.2 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్‌ ను ఆరు స్పీడ్ గేర్‌ బాక్స్ ద్వారా వీల్‌ కు అందిస్తుంది. హై రెవింగ్ ఇంజిన్ కావడం వల్ల ఈ బైక్ డ్రైవ్ చేయడం చాలా థ్రిల్లింగ్‌ గా ఉంటుంది. బరువు కేవలం 141 కిలోలే ఉంటుంది. అలాగే 11 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. తక్కువ బరువు, మంచి బ్యాలెన్స్ వల్ల ఈ బైక్‌ ను సిటీతో పాటు హైవేపై కూడా సులభంగా నడపవచ్చు. డెల్టాబాక్స్ ఫ్రేమ్, అల్యూమినియం స్వింగ్ ఆర్మ్, USD ఫోర్క్స్, మోనోషాక్ సస్పెన్షన్ వల్ల బైక్ చాలా స్టేబుల్‌ గా ఉంటుంది. ధర పెరిగినా కూడా యమహా R15 V4 తన ప్రత్యేకతను కోల్పోలేదు. స్టైల్, పనితీరు, ఫీచర్లతో ఈ బైక్ ఇప్పటికీ యువతకు ఫేవరెట్‌ గా కొనసాగుతోంది.

Advertisement

Read Also: స్టీల్‌ బర్డ్ నుంచి క్రేజీ హెల్మెట్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

Related News

E20 పెట్రోల్‌ పై కొత్త వివాదం.. చీమల కథలో నిజమెంత?

70/30 బ్రేక్ రూల్.. సేఫ్ రైడింగ్‌ కోసం ప్రతి బైక్ రైడర్ తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

ఓలా, ఉబెర్, ర్యాపిడోలో నెలకు అంత సంపాదింవచ్చా? ఇవిగో లెక్కలు!

గుంతల రోడ్లపై కూడా సౌకర్యవంతమైన ప్రయాణం.. నడుము నొప్పి రానీయని 5 క్రేజీ బైక్స్ ఇవే!

టాటా సియెర్రా సంచలనం.. ఒకేసారి మూడు కొత్త వెర్షన్లతో ఎంట్రీ!

బెడ్‌లా మారే సీట్లు, 548 కిమీ రేంజ్.. ప్రభుదేవా కొత్త కారు చూస్తే మతిపోవాల్సిందే!

ఏథర్ స్కూటర్లకు ఎందుకు అంత క్రేజ్.. ఈ 5 స్మార్ట్ ఫీచర్లే కారణం!

మారుతి ఇ-విటారా ధరలు పెంపు.. ఏ వేరియంట్ పై ఎంత పెరిగిందంటే?

Big Stories

×