E-Paper
Advertisement

యమహా R2 వచ్చేసింది.. ఈ బైక్‌ లో అదిరిపోయే 5 హైలైట్స్ ఇవే!

యమహా R2 వచ్చేసింది.. ఈ బైక్‌ లో అదిరిపోయే 5 హైలైట్స్ ఇవే!
Advertisement

Yamaha R2 Launched: స్పోర్ట్స్ బైక్‌లను ఇష్టపడే వారికి యమహా గుడ్‌న్యూస్ చెప్పింది. కంపెనీ తాజాగా కొత్త YZF-R2 బైక్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.2.30 లక్షలుగా నిర్ణయించింది. మొత్తం మూడు వేరియంట్లలో ఈ బైక్ అందుబాటులో ఉంటుంది. వేరియంట్‌ను బట్టి ఐదు కలర్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. స్పోర్టీ డిజైన్‌తో పాటు మంచి పనితీరు, ఆధునిక ఫీచర్లను అందించడం ద్వారా 200cc ప్రీమియం బైక్ సెగ్మెంట్‌ లో సత్తా చాటాలని  యమహా భావిస్తోంది.

కొత్త 204cc ఇంజన్

కొత్త యమహా R2లో 204cc, లిక్విడ్ కూల్డ్, DOHC, సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 26.1bhp పవర్, 19.1Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని 6-స్పీడ్ గేర్‌ బాక్స్‌ తో జత చేశారు. బైక్‌ లో స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌ ను స్టాండర్డ్‌ గా అందిస్తున్నారు. క్విక్‌ షిఫ్టర్ కావాలనుకునే వారికి మిడ్ స్పెక్ వేరియంట్‌ తో పాటు టాప్ R2 Mలో బై డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ అందుబాటులో ఉంటుంది. R2ను కొత్త డైమండ్ ఫ్రేమ్ మీద నిర్మించారు. ముందు భాగంలో USD ఫోర్క్, వెనుకవైపు మోనోషాక్ సస్పెన్షన్ ఏర్పాటు చేశారు. 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో పాటు ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.

TFT డిస్‌ ప్లే.. మూడు రైడింగ్ మోడ్‌లు

Advertisement

టెక్నాలజీ విషయంలోనూ యమహా R2లో మంచి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీతో కూడిన TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది. అన్ని వేరియంట్లలో ట్రాక్షన్ కంట్రోల్‌ ను స్టాండర్డ్‌ గా అందిస్తున్నారు. అలాగే రైడర్ అవసరాన్ని బట్టి స్ట్రీట్, స్పోర్ట్, రెయిన్ అనే మూడు రైడింగ్ మోడ్‌లను సెలెక్ట్ చేసుకోవచ్చు. R2 M వేరియంట్‌ లో స్మార్ట్ కీ సిస్టమ్ కూడా ఉంది. దీంతో కీలెస్ ఇగ్నిషన్ కూడా ఉంటుంది.

మూడు వేరియంట్లు.. ధరలు ఇవే!

యమహా R2ను మూడు వేరియంట్లలో తీసుకురానుంది. ఇందులో బేస్ R2, క్విక్‌ షిఫ్టర్‌ తో కూడిన R2, టాప్ స్పెక్ R2 M ఉన్నాయి. వీటి ధరలు రూ.2.30 లక్షల నుంచి రూ.2.53 లక్షల వరకు ఉంటాయి. వేరియంట్‌ను బట్టి ఐదు కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

KTM, హీరో బైక్‌లకు గట్టి పోటీ

Advertisement

ధర, ఇంజన్ సామర్థ్యాన్ని బట్టి యమహా R2 ప్రధానంగా ప్రీమియం 200cc స్పోర్ట్స్ బైక్‌లతో పోటీ పడనుంది. ముఖ్యంగా KTM RC 200, హీరో కరిజ్మా XMR 210 లాంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.  యమహా R2 డెలివరీలు 2026 సెప్టెంబర్ మధ్య నుంచి ప్రారంభం కానున్నాయి.

Read Also: చేతులతో పనిలేకుండానే డిక్కీ ఓపెన్.. ఈ EV బైక్‌లో అదిరిపోయే ఫీచర్!

Tags

Related News

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

కారులో రాకెట్ టెక్నాలజీ.. స్పేస్‌ ఎక్స్‌ తో టెస్లా కొత్త ప్రయోగం చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా XUV 3XO సరికొత్త రికార్డు.. 5 లక్షలు దాటిన సేల్స్!

మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ. 1.65 లక్షల తగ్గింపు!

హ్యుందాయ్ క్రెటా సరికొత్త రికార్డు.. 15 లక్షలు దాటిన అమ్మకాలు!

ట్రాక్షన్ కంట్రోల్, ఫాస్ట్ ఛార్జింగ్‌.. అప్ డేటెడ్ టీవీఎస్ రైడర్ లో అదిరిపోయే ఫీచర్లు!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

Big Stories

Advertisement
×