E-Paper
Advertisement

రేర్ పిక్.. గౌతమ్ కి స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపిన మహేష్ బాబు!

రేర్ పిక్.. గౌతమ్ కి స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపిన మహేష్ బాబు!
Advertisement

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఒకవైపు వరుస సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు కాస్త సమయం దొరికితే చాలు తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీకి అధికంగా ప్రయారిటీ ఇస్తూ వార్తల్లో నిలిచే మహేష్ బాబు.. తాజాగా తన కొడుకు గౌతమ్ ఘట్టమనేని(Gautham ghattamaneni) 20వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఒక రేర్ పిక్ షేర్ చేసి స్పెషల్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవ్వడంతో అభిమానులు పెద్ద ఎత్తున ఈ ఫోటో షేర్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

అన్ సీన్ పిక్ తో స్పెషల్ విషెస్..

ఈ మేరకు మహేష్ బాబు తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో షేర్ చేశారు. మహేష్ బాబు, గౌతమ్ ఘట్టమనేని ఒక పాత్ వేలో నడుచుకుంటూ వెళ్తున్న బ్యాక్ సైడ్ ఫోటోని మహేష్ బాబు షేర్ చేశారు. ముఖ్యంగా మహేష్ బాబు వారణాసి లుక్ అటు గౌతమ్ ఘట్టమనేని దాదాపు అదే లుక్ లో కనిపించడంతో అభిమానులు సర్ప్రైజ్ అవుతున్నారు. ఇద్దరి బ్యాక్ లుక్ చూసి.. వీరిద్దరూ తండ్రి కొడుకుల్లా లేరు స్నేహితుల్లా ఉన్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

నీ కలలు సాకారం కావాలి – మహేష్ బాబు

Advertisement

ఇకపోతే ఈ ఫోటో తోపాటు మహేష్ బాబు ఇలా రాసుకు వచ్చారు. “20వ పుట్టినరోజు శుభాకాంక్షలు గౌతమ్ ఘట్టమనేని.. ఈ కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్నందుకు మీ కలలను ఎల్లప్పుడూ ధైర్యంతో, దయతో నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు అలాగే ప్రతిరోజు నిన్ను చూసి గర్వపడుతూనే ఉంటాను” అంటూ రెడ్ హార్ట్ లవ్ ఎమోజీలను షేర్ చేశారు మహేష్ బాబు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో అభిమానులు గౌతమ్ ఘట్టమనేనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలు సింబా , 5 వేలకు పైగా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు కామెంట్లు చేస్తుంటే.. మరికొంతమంది ఈ లాంగ్ హెయిర్ లుక్ చూస్తుంటే మహేష్ బాబు ఆరా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లనుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.. మొత్తానికైతే మహేష్ బాబు షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

also read: సెప్టెంబర్ నెలలో థియేటర్లలో విడుదల కాబోతున్న చిత్రాలు.. ఆ 3 డోంట్ మిస్!

మహేష్ బాబు మూవీస్..

Advertisement

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమా చేస్తున్నారు. ఇందులో ప్రముఖ గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది . ప్రముఖ మలయాళ దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు.. ఇక భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది .ఈ సినిమాతో గ్లోబల్ రేంజ్ ఖాయం అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

Related News

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×