E-Paper
Advertisement

చేతులతో పనిలేకుండానే డిక్కీ ఓపెన్.. ఈ EV బైక్‌లో అదిరిపోయే ఫీచర్!

చేతులతో పనిలేకుండానే డిక్కీ ఓపెన్.. ఈ EV బైక్‌లో అదిరిపోయే ఫీచర్!
Advertisement

Ather Konark AutoPop Feature: ఎలక్ట్రిక్ స్కూటర్లలో కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తున్న ఏథర్ ఎనర్జీ.. తాజాగా కోనార్క్ స్కూటర్‌ తో మరో క్రేజీ టెక్నాలజీని తీసుకొచ్చింది. సాధారణంగా స్కూటర్ డిక్కీ ఓపెన్ చేయాలంటే చేతితో సీటును పైకి ఎత్తాల్సి ఉంటుంది. కానీ, కోనార్క్‌లో మాత్రం ఆ అవసరం లేకుండా డిక్కీని ఓపెన్ చేసే అవకాశం తీసుకొచ్చింది. ఇందుకోసం ఆటోపాప్ అనే ఫీచర్ ను పరిచయం చేసింది. చేతుల్లో బ్యాగులు, సామాన్లు ఉన్నప్పుడు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది.

అసలు ఆటోపాప్ ఎలా పని చేస్తుంది?

కోనార్క్‌ తో పాటు మ్యాజిక్ కీ అనే స్మార్ట్ కీ వస్తుంది. ఈ కీ జేబులో, బ్యాగులో ఉంటే స్కూటర్‌ ను ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. స్కూటర్ దగ్గరకు వెళ్లిన తర్వాత వెనుక భాగంలో, టెయిల్ ల్యాంప్ పైన ఉన్న బటన్‌ ను మోకాలితో లేదంటే కాలితో నొక్కితే చాలు. సీటు ఆటోమేటిక్‌గా పైకి లేస్తుంది. దీంతో చేతుల్లో వస్తువులు ఉన్నా వాటిని కింద పెట్టాల్సిన అవసరం ఉండదు. డిక్కీ తెరవడానికి స్కూటర్‌ కు కీ పెట్టి తిప్పాల్సిన అవసరం కూడా లేదు.

కీతో కూడా రిమోట్‌ గా ఓపెన్

Advertisement

స్కూటర్ వెనుక ఉన్న బటన్‌ తో పాటు మ్యాజిక్ కీ ఫాబ్ ద్వారా కూడా డిక్కీని తెరిచే అవకాశం ఉంటుంది. ఫాబ్‌ మీద ఉన్న బటన్‌ ను నొక్కితే రిమోట్‌గా బూట్ ఓపెన్ అవుతుంది. సీటు పైకి లేవడానికి ఇందులో హైడ్రాలిక్ స్ట్రట్ ఏర్పాటు చేశారు. దీంతో బటన్ నొక్కిన తర్వాత సీటు పూర్తిగా పైకి లేస్తుంది. సీటును చేత్తో పట్టుకుని పైకి లేపాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతానికి ఈ బూట్ ఓపెనింగ్ టెక్నాలజీ కోనార్క్ Z లైన్ వేరియంట్లలో ప్రత్యేకంగా అందుబాటులో ఉంది.

సూపర్ స్మార్ట్ ఫీచర్లు

ఈ స్కూటర్‌ లో 7 ఇంచుల డీప్‌ వ్యూ డిస్‌ప్లే, ఆటోహోల్డ్, ఫాల్‌సేఫ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. స్కూటర్‌ను ఈజీగా ఉపయోగించుకునేందుకు ఎయిర్‌ వాక్ లాంటి ఫీచర్‌ను కూడా అందించారు.

ధర జస్ట్ రూ.99,999 నుంచే ప్రారంభం

Advertisement

ఏథర్ కోనార్క్ ప్రారంభ ధర రూ.99,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్కూటర్‌ను S 100, S 125, S 161 అనే వేరియంట్లలో అందిస్తున్నారు. భవిష్యత్తులో టాప్ ఎండ్ Z లైన్ వేరియంట్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. వేరియంట్‌ను బట్టి ఈ స్కూటర్ రేంజ్ 100 కిలోమీటర్ల నుంచి 161 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మరింత ఎక్కువ రేంజ్ ఇచ్చే 200 కిలోమీటర్ల మోడల్‌ను కూడా భవిష్యత్తులో తీసుకురావాలని కంపెనీ చూస్తోంది.

కుటుంబ అవసరాలకు అనుకూలంగా..

కోనార్క్‌ ను ప్రధానంగా కుటుంబ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. మెటల్ బాడీ, 14 ఇంచుల ఫ్రంట్ వీల్‌తో పాటు 31 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ ఇందులో ఉంది. రోజువారీ అవసరాలకు కావాల్సిన సామాన్లు పెట్టుకోవడానికి ఈ స్టోరేజ్ ఉపయోగపడుతుంది.

Read Also: సింగిల్ ఛార్జ్‌ తో 301 కి.మీ రేంజ్.. ఓలా S1Z స్కూటర్ వచ్చేసింది!

Tags

Related News

మహీంద్రా XUV 3XO సరికొత్త రికార్డు.. 5 లక్షలు దాటిన సేల్స్!

మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ. 1.65 లక్షల తగ్గింపు!

హ్యుందాయ్ క్రెటా సరికొత్త రికార్డు.. 15 లక్షలు దాటిన అమ్మకాలు!

ట్రాక్షన్ కంట్రోల్, ఫాస్ట్ ఛార్జింగ్‌.. అప్ డేటెడ్ టీవీఎస్ రైడర్ లో అదిరిపోయే ఫీచర్లు!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

హ్యుందాయ్ బేయాన్ N లైన్ వచ్చేసింది.. టర్బో పెట్రోల్‌తో పాటు హైబ్రిడ్ ఆప్షన్ కూడా!

డెంజా D9 ఇండియన్ లాంచ్‌కు రెడీ.. ధర ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×