E-Paper
Advertisement

Backup Camera: బ్యాకప్ కెమెరా, రియర్‌ వ్యూ మిర్రర్.. వీటిలో ఏది సేఫ్? నిపుణులు ఏం చెప్తున్నారు?

Backup Camera: బ్యాకప్ కెమెరా, రియర్‌ వ్యూ మిర్రర్.. వీటిలో ఏది సేఫ్? నిపుణులు ఏం చెప్తున్నారు?
Advertisement

బ్యాకప్ కెమెరాలు  విండో లైన్ పక్కన కిందివైపు ఉన్న బ్లైండ్ స్పాట్ వ్యూను అందిస్తాయి. ఇవి రియర్‌ వ్యూ మిర్రర్స్ అందించే వ్యూ కాకుండా అదనపు వ్యూ అందిస్తాయి. డ్రైవ్‌ వేలు, పార్కింగ్ ప్లేసెస్ లో డ్రైవింగ్ సేఫ్ గా మార్చుతుంది. కానీ, బ్యాకప్ కెమెరా ప్రతిదీ చూపించదు. ముఖ్యంగా నేలకి తక్కువగా, దాని పరిధికి బయట ఉన్న వస్తువులను చూపించడదు.  బ్యాకప్ కెమెరా,  రియర్‌ వ్యూ మిర్రర్ రెండింటిని యూజ్ చేయడం వల్ల వెనుక ఉన్న ఇబ్బందులను గుర్తించే అవకాశం ఉంటుంది. చిన్న పిల్లలు, పెంపుడు జంతువులు, ఇతర అడ్డంకులను చూసేందుకు కెమెరా సాయపడుతుంది. కానీ, బ్యాకప్ కెమెరాలు నిజంగా సురక్షితమేనా?

బ్యాకప్ కెమెరా అంటే ఏంటి?

బ్యాకప్ కెమెరా, రియర్‌ వ్యూ కెమెరా అనేది మీ కారు వెనుక అమర్చబడిన వీడియో కెమెరా. బ్యాకప్ కెమెరా సాధారణంగా డాష్‌ బోర్డ్, రియర్‌వ్యూ మిర్రర్‌లో ఉన్న వీడియో స్క్రీన్‌పై విజువల్ కనిపిస్తుంది.  ఇది మీ కారు రివర్స్‌ లో ఉన్నప్పుడు చుట్టూ ఉన్న బ్లైండ్ స్పాట్‌లను తగ్గించడంలో సాయపడుతుంది. అద్దాలలో కనిపించని వివరాలను ఇందులో గుర్తించే అవకాశం ఉంటుంది. 2018కి ముందు తయారైన కార్లలో బ్యాకప్ కెమెరాలు చాలా వరకు లేవు. ఆ తర్వాత తర్వాత అందుబాటులోకి వచ్చిన కార్లు ఈ బ్యాకప్ కెమెరాతో వస్తున్నాయి.

బ్యాకప్ కెమెరాలు రియర్‌వ్యూ మిర్రర్ కంటే సేఫా?   

Advertisement

వందశాతం అవును అని చెప్పలేం. బ్యాకప్ కెమెరాలు, రియర్‌ వ్యూ మిర్రర్లు రెండూ సేఫ్టీకి ఉపయోగపడుతాయి. రెండింటినీ విడిగా ఉపయోగించకూడదు. రియర్‌వ్యూ మిర్రర్లు డ్రైవర్లకు కారు వెనుక ట్రాఫిక్ ను చూపించడంతో పాటు సేఫ్ గా వెనక్కి వెళ్లే వ్యూ అందిస్తాయి. బ్యాకప్ కెమెరాలు మంచి సేఫ్టీ ఫీచర్లలో ఒకటిగా చెప్పుకోవచ్చు. కానీ, అవి ఫూల్‌ ప్రూఫ్ కాదు.  బ్లైండ్ స్పాట్‌లను తగ్గించడంలో సహాయపడినప్పటికీ, కదిలే ముందు మీ పరిసరాలను తనిఖీ చేయడానికి ఏకైక మార్గంగా రియర్ మిర్రర్స్. అందుకే బ్యాకప్ కెమెరాల మీదే ఎప్పుడూ ఆధారపడకూడదు.

బ్యాకప్ కెమెరాలతో లాభ నష్టాలు  

బ్యాకప్ కెమెరాలు కారు వెనుక ఉన్న ఇబ్బందలను అందించి బ్లైండ్ స్పాట్లను తగ్గిస్తుంది. ప్రమాదాలను నివారించడంలో సాయపడుతుంది. ఇరుకైన ప్రదేశాలలో పార్కింగ్ చేసేటప్పుడు వెనుక ఉన్న పరిస్థితులను చూపిస్తుంది. అద్దాల ద్వారా గుర్తించబడని పిల్లలు, చిన్న వస్తువులతో కూడిన ప్రమాదాలను తగ్గిస్తుంది. బ్యాకప్-సంబంధిత క్రాష్‌ల సంఖ్యను తగ్గిస్తాయి.  కొత్త కొత్త వాహనాలు బ్యాకప్ కెమెరాను అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ తో లింకప్ చేస్తున్నాయి. పరిసరాలకు సంబంధించి 360 డిగ్రీల వ్యూను అందిస్తున్నాయి.  ఇక కెమెరాపై అతిగా ఆధారపడటం వల్ల డ్రైవర్లు తమ అద్దాలను చూడ్డం మర్చిపోతున్నారు. కొన్నిసార్లు ప్రమాదాలకు కారణం అవుతుంది. అందకే, బ్యాకప్ కెమెరాతో పాటు రియర్ మిర్రర్ లను చూస్తూ డ్రైవింగ్ చేసినప్పుడే సేఫ్ గా జర్నీ చేసే అవకాశం ఉంటుంది.

Advertisement

Read Also: ఇక నో రోడ్ యాక్సిడెంట్స్ .. కార్లు మాట్లాడుకునే టెక్నాలజీ వచ్చేస్తోంది!

Related News

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×