E-Paper
Advertisement

Crime Drama OTT : అడవిలో అమ్మాయి హత్య… పెళ్ళాం మొగుడే అనుమానితులు… చివరి వరకూ మీ గెస్ రాంగ్ అని ప్రూవ్ చేసే మూవీ

Crime Drama OTT : అడవిలో అమ్మాయి హత్య… పెళ్ళాం మొగుడే అనుమానితులు… చివరి వరకూ మీ గెస్ రాంగ్ అని ప్రూవ్ చేసే మూవీ
Advertisement

Crime Drama OTT : మర్డర్ మిస్టరీ అంటే మతిపోగొట్టే ట్విస్టులు ఉండడం గ్యారంటీ. నిందితుడు ఎవరు అన్న విషయాన్ని సినిమా ఎండింగ్ వరకూ సస్పెన్స్ లో పెడితే, క్లైమాక్స్ లో వచ్చే షాక్ తో థ్రిల్ అవుతారు ఆడియన్స్. ఎంగేజింగ్ స్టోరీ లైన్ ఉండాలేగానీ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ అన్నది తిరుగులేని జానర్. ఇప్పటి వరకూ మనం ఇలాంటి సినిమాలెన్నో చూసి ఎంజాయ్ చేశాము. అయితే తాజాగా ఈ జానర్లో ఉన్న మరో కొత్త సిరీస్ ఓటీటీలో సందడి చేస్తోంది. మరి ఆ సిరీస్ కథేంటి ? పేరేంటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సిరీస్ పేరు ‘హిస్ అండ్ హర్స్’ (His & Hers). 2026 జనవరి 8న ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో విడుదలైంది. ఈ మిస్టరీ థ్రిల్లర్ లిమిటెడ్ సిరీస్ గా తెరకెక్కింది. ఆలిస్ ఫీనీ (Alice Feeney) రాసిన 2020 నవల ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. సాధారణంగా సినిమాలు లేదా సిరీస్ లలో డిటెక్టివ్ ఇతరులను అనుమానిస్తారు. కానీ ఇందులో మాత్రం సిరీస్ ను చూస్తున్నంత సేపు ఆడియన్స్ ప్రతీ ఒక్కరినీ అనుమానిస్తారు. అసలు ఆ మర్డర్ చేసింది ఎవరు అన్నది సిరీస్ పూర్తయ్యేంత వరకూ అర్థం కాదు. అలా మైండ్ లో తిరుగుతూనే ఉంటుంది. ఎవరు అబద్దం చెబుతున్నారు ? నిజం చెప్తున్నది ఎవరు ? అన్న విషయం ఓ పట్టాన అర్థం కాదనే చెప్పాలి. బుర్రకు పదును పెట్టే సినిమాలు చూడాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఎలాగూ వీకెండ్ వచ్చేసింది కాబట్టి ఈ సిరీస్ పై ఒక లుక్కేయండి.

Advertisement

Read Also : లేడీ పోలీస్ ఆఫీసర్ పై ప్రేమతో అబ్బాయిగా మారే అమ్మాయి… బుర్రబద్దలయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

స్టోరీలోకి వెళ్తే…

ఉత్తర జార్జియాలోని డహ్లోనెగా అనే చిన్న పట్టణంలో స్టోరీ అంతా నడుస్తుంది. అక్కడున్న ఓ ఇంటి గార్డెన్ లో ఒక మహిళ మృతదేహం కన్పించడం స్థానికులను ఆందోళనకు గురి చేస్తుంది. రేచెల్ హోప్కిన్స్ అనే మహిళదే ఆ మృతదేహం అని తెలుస్తుంది. కానీ ఎవరు చంపారు అన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉండిపోతుంది. ఇక ఈ న్యూస్ ను కవర్ చేయడానికి రిపోర్టర్ అన్నా ఆండ్రూస్ (టెస్సా థాంప్సన్) రంగంలోకి దిగుతుంది. ఈ కేసులో భాగంగా ఆమె తన సొంత పట్టణమైన డహ్లోనెగా తిరిగి వస్తుంది. అదే సమయంలో డిటెక్టివ్ జాక్ హార్పర్ (జాన్ బెర్న్‌థాల్) ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తూ కన్పిస్తాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే… అన్నా, జాక్ భార్యాభర్తలు. కానీ ఇప్పుడు కాదు ఒకప్పుడు. గతంలో ఒక్కటైన ఈ జంట ప్రస్తుతం విడిపోయి విడివిడిగా ఉంటారు. మరో షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే ఆ ఇద్దరూ ఒకరినొకరు ఈ కేసులో అనుమానితులుగా అనుకుంటారు. మరి ఈ మాజీ భార్యాభర్తలు ఎందుకు ఒకరినొకరు అనుమానించుకుంటున్నారు ? అసలు వీళ్ళకు ఆ కేసుతో సంబంధం ఏంటి? ఇంతకీ ఆ మహిళను చంపింది ఎవరు ? ఎందుకు ? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సిరీస్ పై ఒక లుక్కేయండి.

Tags

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×