E-Paper
Advertisement

ఆస్తి కోసమే దాడి…అందరూ ఒక్కటై నా జీవితాన్ని నాశనం చేశారు: నటి సజిని

ఆస్తి కోసమే దాడి…అందరూ ఒక్కటై నా జీవితాన్ని నాశనం చేశారు: నటి సజిని
Advertisement

Actress Sajini: 90 వ దశకంలో నటిగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సజని(Sajini) ఒకరు. ఈమె ఆంధ్రప్రదేశ్ కు చెందిన మహిళ అయినప్పటికీ మలయాళ సినిమాలలో నటించారు. ఎక్కువగా బి గ్రేడ్ సినిమాలలో నటించిన ఈమె తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా సినిమాలలో కొనసాగుతూ భారీగానే ఆస్తులను కూడ పెట్టారు. అయితే ఇప్పుడు ఆ ఆస్తి కోసమే తన కుటుంబ సభ్యులు తనపై దాడి చేశారని ఈమె జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. మరి ఆస్తి తగాదాలపై సజిని తాజాగా మీడియాతో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

అక్క పిల్లల బాధ్యత నేనే తీసుకున్న..

తాను సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ తన కుటుంబ బాధ్యతలను తీసుకున్నానని తెలిపారు. తన అమ్మ అక్క నేను ముగ్గురం కలిసి ఉండే వాళ్ళం. నేను సినిమాలలో కొనసాగుతూ మా అక్క పెళ్లి చేశాము వారికి నలుగురు పిల్లలు. పెళ్లి చేసిన కొంతకాలానికి తన అక్క బావ విడాకులు తీసుకొని విడిపోయారని దీంతో పిల్లల బాధ్యతలను నేనే తీసుకున్నానని సజిని తెలిపారు. ఇలా పిల్లలను పెంచి పెద్ద చూసిన తర్వాత వాళ్లు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారని తెలిపారు. వారి లవ్ విషయం తెలిసి పరువుపోతుందని దాని పెళ్లి చేశాను అని తెలిపారు.అయితే పిల్లలు ఎప్పుడైతే పెద్దయి పెళ్లిళ్లు చేసుకున్నారో తిరిగి మా అక్క బావ వచ్చి ఆస్తి కావాలి అంటూ గొడవ చేశారని తెలిపారు.

ఆస్తికోసం అందరూ ఒకటయ్యారు..

Advertisement

నేను సినిమాలలో సంపాదించిన డబ్బుతో ఒక ఇల్లు కొన్నాను అలాగే పిల్లల బాగోగులను చూసుకున్నాను ఇప్పుడు ఆ ఆస్తి కాజేయాలన్న ఉద్దేశంతో తనపై దాడికి పాల్పడ్డారని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తి కోసమే మా అక్క బావ పిల్లలందరూ ఒకటయ్యారని ఈమె తెలియజేశారు. నా జీవితం మొత్తం నా కుటుంబం కోసమే కష్టపడ్డాను. నేను పెళ్లి చేసుకోవాలనుకున్న కూడా పెళ్లి కాకుండా కుట్రలు చేస్తున్నారని, వారి నుంచి నాకు ప్రాణహాని ఉన్న నేపథ్యంలోనే తాను పోలీసులను ఆశ్రయించాను అంటూ సజిని చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఆస్తి కోసమే కుటుంబ సభ్యుల దాడి..

Advertisement

ఈమె నటిగా తెలుగు తమిళ మలయాళం భాషలలో ఎన్నో సినిమాలలో నటించారు. ఈమె 90 లలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ అనంతరం నటి షకీలాతో కలిసి పలు బి గ్రేడ్, సాఫ్ట్ కోర్ సినిమాలలో గ్లామరస్ పాత్రలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.. ఇలా దాదాపు మూడు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ సంపాదించుకున్న ఆస్తుల కోసం తనపై దాడి ఇంకాచేయడంతో ఈమె పోలీసులను ఆశ్రయించారు. సొంత కుటుంబ సభ్యులు దాడికి పాల్పడటంతో ఈ విషయం కాస్త సినీ ఇండస్ట్రీలో చర్చలకు కారణమైంది.

Also Read: పక్కా ఊరోడిని పెళ్లి చేసుకున్నా..కిరణ్ అబ్బవరంతో పెళ్లి పై రహస్య కామెంట్స్ వైరల్!

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×