BigTV English

Tamilnadu News: నిన్న బెంగుళూరు.. నేడు తమిళనాడు.. రేపు..?

Tamilnadu News: నిన్న బెంగుళూరు.. నేడు తమిళనాడు.. రేపు..?

Tamilnadu News: కారణాలు ఏమైనా కావచ్చు. పచ్చని సంసారంలో వివాహేతర సంబంధాలు చిచ్చు రేపుతున్నాయి. ఫలితంగా భర్తలను చంపేస్తున్నారు భార్యలు. ఇదంతా నార్త్ వెర్షన్. దక్షిణాదిలో మాత్రం అందుకు రివర్స్. భార్య మరొకరితో ఉందన్న విషయం తెలుసుకున్న భార్యల తలలు నరికేస్తున్నారు భర్తులు. అలాంటి ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. స్టోరీలోకి వెళ్తే..


తమిళనాడులోని కల్ల­కుర్చి జిల్లా మలై కొట్టాలం ప్రాంతానికి కొలంజి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కొలంజికి దాదాపు 48 ఏళ్లు. రెండు దశాబ్దాల కిందట కొలంజి-లక్ష్మకి వివాహం జరిగింది. వీరికి ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. మరి భార్యభర్తల మధ్య ఏం జరిగిందో తెలీదు. భార్య లక్ష్మి సొంత గ్రా­మా­నికి చెందిన తంగరాసుతో సరదాగా ఉండేది. ఆ తర్వాత సన్నిహిత సంబంధంగా మారింది.

ఇరుగుపొరుగు వారు ఈ విషయంపై చర్చించుకున్న సమయంలో లక్ష్మ వ్యవహారం కొలంజి చెవిలో పడింది. దీంతో భార్య, తంగరాసులను ఘాటుగానే హెచ్చరించాడు. ఇది జరిగిన చాన్నాళ్లు అయ్యింది. బుధ­వారం అర్ధ­రాత్రి కొలంజి ఇంటిపై లక్ష్మిని కలిశాడు తంగరాసు. ఇంట్లోని టెర్రాస్‌పై గమనించిన కొలంజి ఆగ్రహంతో ఊగిపోయాడు.


ఇంటి పరువు తీసుకుందని భావించిన కొలంజి, ఇంట్లోని వేట కొడవలి పట్టుకుని భార్య వద్దకు వచ్చాడు. కొలంజి చూసి భార్య, ఆమె ప్రియుడు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈలోగా తంగరాసును పట్టుకుని వేట కొడవలితో తల నరికేశాడు కొలంజి. ఆ తర్వాత భార్యని కూడా అలాగే చేశారు. ఇద్దరు తలలను బ్యాగులో వేసుకొని 100 కిలో మీటర్లు ప్రయాణించాడు కొలంజి.

ALSO READ: ట్యాంకర్ ని ఢీ కొట్టి వంతెన పైనుంచి పడిన బస్సు

గురువారం ఉదయం వేలూరు సెంట్రల్‌ జైలుకు చేరుకున్నాడు. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులకు జరిగిన విషయాన్ని చెప్పాడు. దీంతో పోలీసులకు నోటిమాట రాలేవు. వెంటనే ఆ ప్రాంత సమీపంలోని కల్లకుర్చి పోలీసులకు సమాచా­రమిచ్చారు.వెంటనే నిందితుడు కొలంజిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. లక్ష్మి, తంగరాసు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కొలంజి ముగ్గురు కూతుళ్లను బంధువుల ఇంటికి పంపారు. కోలాంజి ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.

బెంగుళూరులో ఏం జరిగింది?

తమిళనాడులో ఇలాంటి ఘటన జరగలేదు. మూడు నెలల కిందట జూన్‌లో బెంగళూరులో అలాంటి ఘటన ఒకటి జరిగింది. వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో భార్య మానసను తల నరికేశాడు ఆమె భర్త. హత్య తర్వాత నేరుగా సూర్యనగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగినదంతా చెప్పాడు నిందితుడు. ఐదు సంవత్సరాల కిందట హెన్నాగర నివాసి శంకర్‌కు మానసతో వివాహం జరిగింది.

శంకర్ దంపతులకు నాలుగేళ్ల కూతురు ఉంది. భార్యాభర్తలిద్దరు ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్నారు. పోలీసుల విచారణలో జరిగిన విషయాలను బయటపెట్టాడు శంకర్. తన భార్యకు మరొకరితో సంబంధం ఉందని తాను గుర్తించానని తెలిపాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని తెలిపాడు.

ఈ క్రమంలో భార్య తన తల్లి దగ్గరకు వెళ్లింది. శుక్రవారం రాత్రి కూతుర్ని కారణంగా చూపుతూ భర్తతో రాజీ కుదుర్చుకోవడానికి ఇంటికి వచ్చింది. ఆ జంట మధ్య మళ్లీ గొడవ తారాస్థాయికి చేరింది. పట్టరాని కోపంతో కొడవలి తీసుకొని భార్య తల నరికి చంపాడు. భార్య తలను స్కూటర్‌పై పోలీస్ స్టేషన్‌కు చూపించి జరిగిన విషయాన్ని వివరించాడు నిందితుడు.

Related News

Bank Robbery: ఎస్బీఐ నుంచి 5 లక్షలు చోరీ.. షాకైన అధికారులు, దొంగ ఎవరో తెలుసా?

Guntur Incident: ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ.. కాళ్లు నరికి.. రైల్వే పట్టాలపై..

School Bus Accident: బోల్తా పడ్డ ప్రైవేట్ స్కూల్ బస్సు.. స్పాట్ లోనే 20 మంది విద్యార్ధులు

Bus Accident: ట్యాంకర్ ను ఢీకొట్టి వంతెన పై నుంచి ఎగిరి పడ్డ బస్సు, ఐదుగురు స్పాడ్ డెడ్!

Adilabad Collectorate: ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో తృటిలో తప్పిన పెనుప్రమాదం..

Encounter: భారీ ఎన్‌కౌంటర్.. పది మంది మావోయిస్టులు మృతి

Kurnool News: కిరాతక తండ్రి.. 8 నెలల పసిపాపను డ్రమ్ములో ముంచి.. భార్యను దారుణంగా కొట్టి..!

Big Stories

×