E-Paper
Advertisement

Godhavari Surya : ‘గోదావరి’ సూర్య ఏం చదివాడో తెలుసా..?

Godhavari Surya : ‘గోదావరి’ సూర్య ఏం చదివాడో తెలుసా..?
Advertisement

Godhavari Surya : తెలుగు బుల్లితెర పై ఎన్నో రకాల సీరియల్స్ ప్రసారమవుతున్నాయి.. అందులో కొన్ని సీరియల్స్ జనాలని ఎంతగా ఆకట్టుకుంటున్నాయో చెప్పనక్కర్లేదు.. ఒకప్పుడు ఎమోషనల్ స్టోరీ తో వచ్చిన సీరియల్స్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాయి. ఒక్కో సీరియల్ ఒక్కో స్టోరీ తో జనాలని ఆకట్టుకుంటున్నాయి.. రీసెంట్గా స్టార్ మా చానల్లో ప్రారంభమైన సీరియల్స్ అన్నీ కూడా జనాలని కనెక్ట్ ఎలా చేస్తున్నాయి.. అందులో కొన్ని సీరియల్స్ మాత్రం రోజురోజుకీ ఉత్కంఠ గా మారుతూ టిఆర్పి రేటింగ్ కూడా పెంచుకుంటున్నాయి.

స్టార్ మా చానల్లో రీసెంట్ గా ప్రారంభమైన సీరియల్స్లలో గోదావరి సీరియల్ ఒకటి. ఈ సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. కుటుంబానికి అండగా ఉన్న తండ్రి చనిపోతే ఆ బాధ్యతని ఆ కుటుంబ పెద్ద కూతురు తీసుకుంటుంది.. తన తండ్రికి ఎక్కడ మాట రానివ్వకుండా కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తుంది. ఈ సీరియల్ లో హీరో పాత్రలో సూర్య నటించాడు. సూర్య రియల్ లైఫ్ గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. మరి ఈ హీరో సూర్య సీరియల్స్లలోకి రాకముందు ఏం చేశాడు? అసలు ఎంతవరకు చదివాడు అన్నది ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం..

‘గోదావరి’ సూర్య ఏం చదివాడు..?

Advertisement

తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సీరియల్ హీరోలలో గోదావరి సూర్య ఒకడు. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తమిళ ఇండస్ట్రీలో స్టార్ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న ఈ కుర్ర హీరో ప్రస్తుతం తెలుగులో ప్రసారమవుతున్న గోదావరి సీరియల్ తో ప్రేక్షకులను పలకరించాడు. ఇదే మొదటి సీరియల్ అయినా కూడా తెలుగు ప్రేక్షకులను తన నటనతో మెప్పించాడు. తన అందం అభినయంతో ఆకట్టుకుంటున్న సూర్య అసలు పేరు మారన్ చంద్రశేఖరన్.. ఈయన పుట్టింది చదివింది మొత్తం తమిళనాడులోనే.. బీకాం చదివిన ఈ హీరో చిన్న ఉద్యోగాలు కూడా చేసినట్లు తెలుస్తుంది. యూట్యూబ్ షార్ట్ వీడియోలు, అలాగే ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు. ఈ హీరో ఆ తర్వాత నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.. కోలీవుడ్లో పలు సీరియస్లలో నటించిన మారన్ తెలుగులో గోదావరి సీరియల్ తో పరిచయమయ్యాడు. ఇక ముందు ఎలాంటి సీరియల్స్ లలో నటిస్తాడో చూడాలి..

మారన్ ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

ఇటీవల కాలంలో తెలుగు సీరియల్స్ లలోకి తమిళ హీరోల ఎంట్రీలు ఎక్కువగా ఉన్నాయి.. తెలుగులో ఇప్పటికీ గుండెనిండా గుడి గంటలు సీరియల్ బాలు నుంచి పొదరిల్లు సీరియల్ చక్రి వరకు అందరూ కూడా ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు.. ఒకప్పుడు తెలుగు వాళ్ళతో తెలుగు సీరియల్స్ కళకళలాడేవి.. కానీ ఈ మధ్యకాలంలో తెలుగు సీరియల్స్లలో వేరే హీరోలు రావడంతో ఇవి తెలుగు సీరియల్స్ ఆ వేరే ఇండస్ట్రీ సీరియల్స్ అన్నది మాత్రం క్లారిటీ రావాల్సిన పరిస్థితి కనపడుతుంది.. ఇక తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ గోదావరి సూర్య రెమ్యూనరేషన్ కూడా మొదటి సీరియల్ కి ఎక్కువగా తీసుకుంటున్నాడు.. ఈయన మాత్రం ఒక రోజుకి దాదాపు 30 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.. స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా దాదాపు 25 రోజులు షూటింగ్ ఉండడంతో ఈయన నెలకు లక్షల్లోని సంపాదిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: మనోజ్ ను చంపేస్తాను.. గుండెలు పగిలేలా ఏడ్చిన బాలు.. కన్నీళ్లు పెట్టించే సీన్..

Related News

పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన.. బిగ్ బాస్ కోసమే వచ్చి దొరికిపోయారా?

బీబీ కొంపలో బెట్టింగ్ మాఫియా.. మరోసారి నాగార్జున పై రెచ్చిపోయిన నా అన్వేష్!

ఏం తప్పు చేశాను.. రాబందులలా పొడుచుకు తింటున్నారు..రాజకుమారి ఎమోషనల్!

బిగ్ బాస్ 10.. ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ కి సపోర్టుగా హైపర్ ఆది!

ఆరోజు జరిగిందిందే.. నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి అసిస్టెంట్!

మొదలైన వార్.. కృష్ణుడు ఫైర్!

Podarillu Serial : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారక్టర్ అవుట్..

Nindu Noorella Saavasam Serial Today EpisodeSeptember 8th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బుజ్జమ్మ శక్తులు హరించేందుకు వెళ్లిన ప్రచండ

Big Stories

Advertisement
×