E-Paper
Advertisement

“రెండేళ్ల తర్వాత చైతూ కోసం కిచెన్‌లోకి శోభిత?.. వైరల్ అవుతున్న పోస్ట్!”

“రెండేళ్ల తర్వాత చైతూ కోసం కిచెన్‌లోకి శోభిత?.. వైరల్ అవుతున్న పోస్ట్!”
Advertisement

Chaitanya Sobhita:సమంతకి విడాకులు ఇచ్చిన నాగచైతన్య ఆ తర్వాత శోభిత ధూళిపాళ్ళని 2024 డిసెంబర్లో పెళ్లాడిన సంగతి తెలిసిందే.ఇక వీరిద్దరూ ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ లవ్డ్ కపుల్స్ కూడా. పెళ్లి తర్వాత ఎవరి సినిమాల్లో వాళ్లు బిజీగా ఉంటూనే మ్యారేజ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు.ఒకవైపు షూటింగ్లతో ఎంత బిజీగా ఉన్నా కూడా దొరికిన కాస్త ఖాళీ సమయంలో వెకేషన్‌లకు వెళ్లడం, సెలబ్రేట్ చేసుకోవడం మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం.

అలా తమకు సంబంధించిన ఎన్నో మెమొరబుల్ మూమెంట్స్ అభిమానులతో పంచుకోవడం వీళ్లకి అలవాటే. అందుకే వీళ్లు చేసే ప్రతి పోస్ట్ నిమిషాల్లో వైరల్ అయిపోతుంది.ఇదే క్రమంలో తాజాగా చైతు చేసిన ఒక ఫన్నీ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Advertisement

చిరునవ్వుతో నిల్చొని ఉన్న ఫోటోను షేర్ చేసిన చైతు

శోభిత తన చేతులతో తయారుచేసిన డిన్నర్‌ను రెండు చేతుల్లో పట్టుకుని చిరునవ్వుతో నిల్చొని ఉన్న ఫోటోను షేర్ చేసిన చైతు… “పెళ్లయి దాదాపు రెండేళ్లు అవుతుంది. ఈరోజు మా ఆవిడ నాకు భోజనం వండింది. బహుశా నేను ఈరోజు ఏదో మంచి పని చేసి ఉంటాను” అంటూ ఫన్నీ క్యాప్షన్ ఇవ్వడంతో ఆ పోస్ట్ కాస్త మరింత వైరల్ అయింది.

Advertisement

ఇక ఇదే పోస్ట్‌కి కామెంట్లు పెడుతూ సందడి చేస్తున్నారు అభిమానులు.”అంటే శోభితకు ఇప్పటివరకు వంట రాదా?” అని కొంతమంది అంటే… “రెండేళ్ల తర్వాత చైతు కోసం తొలిసారి కిచెన్లోకి వెళ్లిందా?” అంటూ ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు.ఇక మరికొంతమంది ఒక అడుగు ముందుకేసి… “చైతు… నీ అదృష్టం ఈరోజే మొదలైందా?” అంటూ ట్రోల్ చేస్తున్నారు కూడా.

అయితే మరికొంతమంది శోభితని సపోర్ట్ చేస్తూ… “స్టార్ హీరోయిన్ కదా… షూటింగ్‌తో బిజీగా ఉంటుంది. టైం దొరికితేనే వంట చేస్తుంది” అంటూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.

భర్త కోసం స్పెషల్‌గా ఇప్పుడు చేసినట్టు ఉంది

నాగచైతన్య విషయానికి వస్తే… సోషల్ మీడియాలో చాలా సెలెక్టివ్‌గా ఉండే ఈ అక్కినేని హీరో కేవలం తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్‌ని, స్పెషల్ మూమెంట్స్‌ని తప్ప పర్సనల్ లైఫ్‌ని పెద్దగా షేర్ చేసుకోవడానికి ఇష్టపడడు.కానీ శోభితతో పెళ్లయిన తర్వాత మాత్రం అప్పుడప్పుడు ఆమెతో ఉన్న ఫోటోలు, వెకేషన్ పిక్స్ అభిమానులకు షేర్ చేస్తూ అలరిస్తున్నాడు.

అయితే ఈ పోస్ట్ చూసిన తర్వాత కొంతమంది పాత ఇంటర్వ్యూలను తవ్వడం మొదలెట్టారు. శోభిత గతంలో మాట్లాడిన మాటలను రివైండ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.”ట్రావెలింగ్, కుకింగ్ అంటే ఇష్టమని చెప్పిన శోభితకి కుకింగ్ వచ్చి ఉంటుంది. కానీ భర్త కోసం స్పెషల్‌గా ఇప్పుడు చేసినట్టు ఉంది” అంటూ సెటైర్లు వేస్తున్నారు.

కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ‘వృషకర్మ’

చైతు కెరీర్ విషయానికి వస్తే… గత కొంతకాలంగా సక్సెస్ చూడని చైతు 2025లో ‘తండేల్’తో మంచి విజయాన్ని అందుకున్నాడు.ఇక తాజాగా ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ‘వృషకర్మ’ అనే సినిమాను చేస్తున్నాడు.మరోవైపు శోభిత ధూళిపాళ్ల కూడా బాలీవుడ్, టాలీవుడ్‌లతో పాటు ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌కి సైన్ చేయడం విశేషం.

ఏదేమైనా పెళ్లి తర్వాత ఇద్దరూ తమ కెరీర్‌లో ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా ముందుకు సాగుతూ ఉండటంతో అక్కినేని అభిమానులు మురిసిపోతున్నారు.

Related News

కాలికి గాయమైనా తగ్గని వరుణ్ తేజ్ జోష్.. సినిమా కోసం ఇంత కష్టమా!

జానపద సంగీతానికి కొత్త ఊపు.. ‘పళ్ళబురుసు’ నుంచి ‘కొత్త సోకు’ రిలీజ్!

‘జయం’ హీరోగా బన్నీ ఫిక్స్.. తర్వాత ఒక్కసారిగా నితిన్ ఎంట్రీ!

ప్రభాస్ శ్రీను జీవితాన్ని మార్చేసిన శరత్ బాబు.. అసలు కథ ఇదే!

క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి వెయిట్ లిఫ్టింగ్ స్టార్‌గా.. ప్రగతి సెన్సేషన్!

కాజల్ కారవాన్‌లో జరిగిన ఘటన.. ఇన్నాళ్లకు బయటపెట్టిన హీరోయిన్!

బుట్టబొమ్మకు బ్యాడ్ టైమ్.. ఇక కమ్‌బ్యాక్ కష్టమేనా..?

Big Stories

Advertisement
×