BigTV English

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Telangana BJP MP’s: తెలంగాణలో బిజెపి నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలపై ఢిల్లీ పెద్దలు ఫోకస్ పెట్టారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పాగా వేసేందుకు ఇప్పటి నుంచి ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగారనే చర్చ నడుస్తోందట. పార్టీలో పంచాయితీలు మాని అందరూ కలిసి పని చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని నేతలు తీరు మార్చుకోవాలనే ఇండికేషన్ హస్తిన నుంచి వచ్చిందన్న టాక్ స్థానికంగా నడుస్తోంది.


స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్‌గా పెట్టుకున్న బీజేపీ పెద్దలు

రాజకీయాల్లో అనుకున్న లక్ష్యాలు అధిగమించాలంటే పార్టీలో అందరూ కలిసికట్టుగా సమిష్టిగా పని చేయాల్సి ఉంటుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన ఎజెండాగా భవిష్యత్తులో తెలంగాణ అధికార పగ్గాలే టార్గెట్ గా ముందుకు వెళ్ళాలనే కాషాయ పార్టీ సంకల్పానికి సొంత పార్టీలోనే ఏ ఒక్క నేత సహకరించడం లేదనే టాప్ పొలిటికల్ సర్కిల్స్ లో పాటు ఢిల్లీ పెద్దల దాకా పోయిందట. రాష్ట్రంలో అనుకున్న ఫలితాలు అందాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పాగా వేయడమే కాషాయ దలం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు రామచంద్రరావు వ్యూహాత్మకంగా పార్టీ బలోపేతానికి కార్యక్రమాలను ప్లాన్ చేస్తూ ఉంటే ఆ దిశగా ముందుకు వెళ్ళాల్సిన కొంతమంది కీలక నేతల అడుగులు పక్కదారులు పడుతున్నాయట. నాయకత్వం దిశా నిర్దేశానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారట. గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా తిరిగి పార్టీ బలోపేతం చేయాల్సిన నేతలు వారి వారి నియోజక వర్గాలకే పరిమితం అవుతున్నారట. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం లాంటి అంశాలు రాష్ట్ర బిజెపీని అదోగతి పాలు చేస్తున్నాయనే చర్చ సర్వత్రా నడుస్తున్న తరుణంలో రాష్ట్ర బీజెపీ ఎంపీలు ఢిల్లీకి వెళ్ళడం చర్చనీయ అంశంగా మారింది. తెలంగాణ బీజెపీ ఎంపీలంతా ఢిల్లీలో మకాం వేశారు.


అంతర్గత విభేదాలపై నేతల స్ట్రోక్ ఇచ్చిన బాస్‌లు

పార్టీ అగ్రనేతలు మోడీ, షా, నడ్డాలు ప్రత్యేకంగా తెలంగాణ ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారని టాక్ నడుస్తోంది. తెలంగాణ బిజేపీలో జరుగుతున్న పరిణామాలపై నేతల మధ్య ముదురుతున్న విభేదాల ముసలంపై నేతలకు గట్టిగానే స్ట్రోక్ ఇచ్చారనే చర్చ పార్టీ శ్రేణుల్లో నడుస్తోంది. రాష్ట్రంలో బీజెపీకి అధికారం అనే లక్ష్యాన్ని చేరేందుకు అవకాశాలు ఉన్నప్పటికీ నూతన అధ్యక్షుడు ఎన్నిక తర్వాత పార్టీలో పరిణామాలు పూర్తిగా గాడి తప్పిపోయాయని ఢిల్లీ పెద్దల దృష్టికి వెళ్ళిందట. గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా ఆ పార్టీని ఒక కుదుపు కుదుపేసింది. రాజాసింగ్ రాజీనామా కీలక నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం వంటివి ఆ పార్టీ పరువును బజారు పెడుతున్నాయి.

అవకాశాలను అందిపుచ్చుకోలేక పోతున్నారని అసహనం

అనేక అంశాలు అవకాశాలుగా వచ్చినప్పటికీ సొంత అజెండాలతో నడుస్తున్న రాష్ట్ర బిజెపీ నేతలు వాటిని అందుపొర్చుకోవడంలో విఫలం అవుతున్నారని ఢిల్లీ పెద్దల దృష్టికి వచ్చిందట. తాజాగా మాయల ఫకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్టు కాలేశ్వరం అంశంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ భవితవ్యం బిజెపీ చేతుల్లో పడినట్లయింది. కాళేశ్వరం అంశమే కాదు ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో పూర్తిగా బీజెపీ విఫలం అయ్యిందనే చర్చ ఆ పార్టీలోనే జరుగుతోంది. ఇవన్నీ నిశ్చితంగా గమనిస్తూ వస్తున్న అధిష్టానం రాష్ట్ర బీజేపీ పై ఫోకస్ చేస్తూ అసహనం వ్యక్తం చేస్తూ వస్తుంది. ఇంతకాలం రాష్ట్ర నేతల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించిన ఢిల్లీ కమలనాధులు ఈసారి రాష్ట్ర బిజెపీ నేతలపై తీవ్ర అసహనంతో ఉన్నారట. ఇక నుంచి సిగ్నల్స్ క్రాస్ చేస్తామంటే ఫినాల్టీలు ఉండవు. ఏకంగా లైసెన్స్లే రద్దవుతాయనే సంకేతాలు తెలంగాణ బిజెపి ఎంపీలకు ఇచ్చారనే టాక్ ఇంటర్నల్ గా నడుస్తుంది. అందులో భాగంగానే ముందు రాష్ట్ర ఎంపీలపై ఫోకస్ చేశారనే టాక్ నడుస్తుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఎంపీలతో పార్టీ పరిస్థితులు అంతర్గత అంశాలపై పార్టీ పెద్దలు చర్చించారనే టాక్ వినిపిస్తుందట.

తెలంగాణకు సంబంధించి దిశా నిర్దేశం చేసే అంశాలు ఏవి మాట్లాడడం లేదట. నేరుగా యాక్షన్ లోకే దిగారట. పద్ధతి మార్చుకుంటారా లేక మిమ్మల్ని మార్చమంటారా? ఇంకెన్నాళ్లు చూడాలి మీ పంచాయతీలు అనే విధంగా ఢిల్లీ పెద్దలు హెచ్చరికలు ఇచ్చారనే గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. మొత్తం మీద నేతల ఆధిపత్య పోరుతోనే కకావికలం అవుతున్న తెలంగాణ కమలం పార్టీపై అధిష్టాన పెద్దలు తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతాయనే చర్చ నడుస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక తర్వాత నేతల మధ్య రగులుకున్న మంటలు చల్లారకముందే తాజాగా కమిటీల రూపంలో మరో కుంపటి వచ్చి పడడంతో రాబోవు కాలంలో రాష్ట్ర బిజెపీ ముఖచిత్రం ఏ విధంగా ఉంటుంది? ఢిల్లీ పెద్దలు ఇచ్చిన సూచనలు డైరెక్షన్స్ ను పార్టీ నేతలు ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేది చూడాలి.

Story By Vamshi Krishna, Bigtv

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో స్టోరీ… ఇమ్మానుయేల్ నడుము గిల్లిన తనూజ!

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Kakani Govardhan Reddy: జైలు జీవితం కాకాణిని మార్చేసిందా?

American Gun Culture: హద్దులు దాటుతున్న అమెరికా గన్ కల్చర్.. ట్రంప్ ఫ్రెండ్ చార్లీ కిర్క్ పై గన్ ఫైర్ దేనికి సంకేతం?

Telangana BJP: నూతన రాష్ట్ర కమిటీని ప్రకటించిన బీజేపీ

Big Stories

×