Bigg Boss 9 Promo: బిగ్ బాస్.. వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో గా పేరు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే మొదటివారం దిగ్విజయంగా పూర్తయింది. ఇక రెండవ వారం కూడా మొదలైంది. అందులో భాగంగానే రెండవ వారం మొదటి రోజుకు సంబంధించిన ప్రోమోని తాజాగా నిర్వాహకులు విడుదల చేశారు. ఇందులో ఊహించని మలుపులు చోటు చేసుకోవడంతో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో లవ్ స్టోరీలు క్రియేట్ చేయడం ఇదేమి మొదటిసారి కాదు. ఇప్పటికే ఎన్నో జంటల మధ్య లేని ట్రాక్ ని కూడా సృష్టించి ఆడియన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు తాజాగా హౌస్ లో మరో స్టోరీ మొదలైందని ప్రోమో చూస్తే అర్థమవుతుంది. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఇమ్మానుయేల్ నడుము గిల్లింది తనూజ. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.. ఎనిమిదవ ఎపిసోడ్ మొదటి ప్రోమో విడుదల చేయగా.. గదిలో ఇమ్మానుయేల్ పడుకొని ఉండగా.. తనూజ , భరణి మాట్లాడుకుంటూ ఉంటారు. అటు సైడ్ రీతు చౌదరి, పవన్ ఆహారం తీసుకుంటూ ఉండగా.. తనూజ ఇమ్మానుయేల్ ని తట్టి ఆ కపుల్స్ ని చూడు ఒకసారి అంటూ కామెంట్ చేస్తుంది.. దీంతో ఇద్దరు వారిని చూడడానికి వెళ్తారు.. అక్కడికి వెళ్లిన ఇమ్మానుయేల్ రీతు చౌదరిని ఉద్దేశించి.. నాతో ఈమధ్య సరిగ్గా తిరగడం లేదు. అటువైపు తనూజా చెబుతూ ఉండగా.. నా పక్కన ఉన్నా దూరంగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఎందుకురా మా లైఫ్ లోకి వచ్చి ఇలా ఆడుకుంటున్నావ్. చెప్పరా.. పాపిస్టోడా అంటూ కామెంట్ చేయగా..తనూజ అటువైపు వెళ్ళగా వెంటనే ఇమ్మానుయేల్ తనూజ నా నడుము గిళ్ళకు అంటూ కామెడీ క్రియేట్ చేశారు ఇమ్మానియేల్.
ALSO READ:Mirai: AI కాదు.. రాముడి పాత్రలో నటించింది ఈయనే.. టీమ్ క్లారిటీ!
కామెడీతో ఎంటర్టైన్ చేసిన ఇమ్మానుయేల్..
దాంతో తనూజ ఆశ్చర్యపోయి నేను ఆయన నడుమును ముట్టుకోనేలేదు అంటుంది. తనుజా నా నడుము గిల్లింది బిగ్ బాస్.. ఇది వెంటనే రేపు టీవీలో టెలికాస్ట్ అయితే అందరూ ఏమనుకుంటారు అంటూ సరదాగా కామెంట్లు చేశారు.దాంతో రీతు చౌదరి వెంటనే వచ్చి.. అసలు అక్కడ ఆ నడుము ఎక్కడ ఉందో చూపించు అంటూ కామెంట్ చేసింది.. ఇక ఇమాన్యుయల్ తన హిప్ ను చూపిస్తూ ఇది నడుము కాదా అంటూ కామెంట్ చేశారు. తర్వాత తనూజ నిజంగానే వెళ్లి ఇమ్మానియేల్ నడుము గిల్లగా ఇమ్మానియేల్ మెలికలు తిరిగిపోతూ.. తనూజ ప్లీజ్ అంటూ పెద్ద ఎత్తున అందర్నీ ఎంటర్టైన్ చేశారు. మొత్తానికైతే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఇమ్మానుయేల్ తన మార్క్ కామెడీ చూపించి అందరిని అలరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.