Flight Tickets Offers: ఎయిర్‌లైన్స్ ప్రయాణం అంటే చాలా ఖర్చుతో ఉంటుంది అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ ఇండిగో ఎయిర్‌లైన్స్ ఈసారి ఆ ఆలోచననే మార్చేసింది. పండుగ సీజన్‌లో ప్రయాణికుల కోసం టికెట్ ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దేశీయంగానీ, విదేశీంగానీ ఒకసారి అయినా విమాన ప్రయాణం అనుభవించాలని కోరుకునే వారికి ఇది నిజంగా బంగారు అవకాశం. అయితే ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే వర్తిస్తుంది. అందువల్ల ఆలస్యం చేయకుండా వెంటనే బుకింగ్ చేసుకోవడం మంచిది.
ఎప్పటి వరకు ఆఫర్
రన్‌వే స్పెషల్ ఆఫర్ పేరుతో ప్రకటించిన ఈ తగ్గింపు టికెట్లు సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 21, 2025 మధ్య బుక్ చేసుకోవచ్చు. ప్రయాణ సమయం కూడా అనుకూలంగా ఉంది. జనవరి 7, 2026 నుంచి మార్చి 31, 2026 వరకు ఎప్పుడైనా ఈ ఆఫర్ ధరల్లో ప్రయాణం చేయొచ్చు. అంటే పండుగలు, సెలవులు, బిజినెస్ టూర్స్ ముందుగానే ప్లాన్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ఛాన్స్.
ధర ఎంత? బుకింగ్ ఎలా చేసుకోవాలి?
ధరల విషయానికి వస్తే – దేశీయ ఎకానమీ క్లాస్ టికెట్లు రూ.1299 నుంచి లభిస్తాయి. బిజినెస్ లేదా స్ట్రెచ్ క్లాస్ టికెట్లు రూ.9999 నుంచి అందుబాటులో ఉన్నాయి. అంతర్జాతీయ ప్రయాణం అయితే ఎంపిక చేసిన రూట్లలో రూ.4599 నుంచే మొదలవుతాయి. ఇక, టికెట్ బుకింగ్ కోసం ప్రయాణికులు ఇండిగో అధికారిక వెబ్‌సైట్ గోఇండిగో.ఇన్, మొబైల్ యాప్, వాట్సాప్ లేదా స్కై చాట్‌బాట్ ద్వారా సులభంగా రిజర్వేషన్ చేసుకోవచ్చు.
Also Read: Motorola Smartphone: మోటరోలా బెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. మార్కెట్‌లోకి కొత్త మోడల్
ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయా?
ఇక ఇండిగో బ్లూచిప్ సభ్యులకు ప్రత్యేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆఫర్ కాలంలో బ్లూ 1 సభ్యులకు 10శాతం తగ్గింపు, బ్లూ 2 సభ్యులకు 8శాతం తగ్గింపు, బ్లూ 3 సభ్యులకు 5శాతం తగ్గింపు లభిస్తుంది. దీని కోసం ప్రయాణికులు ఐబిసి10 ప్రోమో కోడ్ ఉపయోగించాలి.
ఎవరికి వర్తిస్తుంది?
ఈ స్కీమ్ వన్‌వే టికెట్లకే వర్తిస్తుంది. రౌండ్ ట్రిప్ టికెట్లకు మాత్రం ఈ తగ్గింపు వర్తించదు. అదనంగా, ఇది కేవలం ఇండిగో నాన్‌స్టాప్ విమానాలకే వర్తిస్తుంది. కనెక్టింగ్ ఫ్లైట్స్ లేదా ఇతర ఎయిర్‌లైన్స్‌కి ఈ ఆఫర్ అందుబాటులో ఉండదు.
పండుగ సీజన్‌లోతక్కువ ఎందుకు?
సాధారణంగా పండుగ సీజన్ దగ్గరపడితే విమాన టికెట్ ధరలు పెరుగుతాయి. అలాంటి సమయంలో ఇండిగో అందిస్తున్న ఈ ప్రత్యేక ఆఫర్ ప్రయాణికులకు నిజంగా ఊరట కలిగిస్తోంది. ముందుగానే టికెట్ బుక్ చేసుకుంటే తక్కువ ఖర్చుతోనే సెలవులు, కుటుంబ యాత్రలు, బిజినెస్ ట్రిప్స్ సులభంగా పూర్తిచేసుకోవచ్చు.