Mahabubabad News: ప్రస్తుతం ఏడ చూసిన సోషల్ మీడియా హవానే నడుస్తోంది. సోషల్ మీడియా అనగానే టక్కను గుర్తుకు వచ్చేది.. యూట్యూబ్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్.. వీటిల్లో ఇటీవల నెటిజన్లు ఎక్కువగా ఇన్ స్టాగ్రామ్ ను యూజ్ చేస్తున్నారు. ముఖ్యంగా యువత ఫోన్ ముట్టుకుంటే చాలు ఇన్ స్టానే ఓపెన్ చేస్తున్నారు. అయితే ఈ వేదికను సరిగ్గా వాడుకుంటే సరే.. కొంచెంగా మితంగా వాడితేనే ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఇటీవల కాలంలో ఇన్ స్టా కుటుంబాల్లో చిచ్చు పెట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది.
ఇన్ స్టాలో పరిచయాలు పెరిగి వివాహేతర సంబంధాలకు దారి చూసిన సంఘటనలు మనం వార్తల్లో చూసే ఉంటాం. ఇలాంటి పరిచయాల వల్ల కుటుంబాలకు కుటుంబాలనే నాశనం అవుతున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి కోసం ఏకంగా భర్తనే చంపేందుకు రెడీ అయ్యింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ALSO READ: Aarogyasri Services: రాష్ట్ర ప్రజలకు బిగ్ బ్యాడ్ న్యూస్.. మరోసారి ఆరోగ్య శ్రీ సేవలకు బ్రేక్
ఆరు ఏండ్లు గా ఎంతో అనోన్య జీవితం గడుపుతున్న ఒక కుటుంబం లో ఇన్ స్టా గ్రామ్ చిచ్చు పెట్టింది. ఏడాది క్రితం సోషల్ మీడియా లో పరిచయం అయిన వ్యక్తి కోసం కట్టుకున్న భర్త నే హత్య చేసేందుకు సిద్ధపడింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా లోని గడ్డిగూడెం గ్రామ పంచాయితీ పరిధిలో సంచలనం సృష్టించింది. గ్రామానికి చెందిన ప్రసాద్ అనే యువకుడి కి ఆరు ఏళ్ల క్రితం రష్మిత అనే యువతి తో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక బాబు ఉన్నాడు.
ALSO READ: DSSSB: ఇంటర్ అర్హతతో భారీగా జాబ్స్.. తక్కువ పోటీ.. వెంటనే అప్లై చేయండి బ్రో
ఎంతో సంతోషకరంగా జీవిస్తున్న వీరిలో భార్య రష్మిత కు ఇన్ స్టా గ్రామ్ లో ఒక యువకుడి తో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త అక్రమ సంబంధం కు దారి తీసింది. అర్ధరాత్రి ప్రేమికుడితో కలిసి భార్య , భర్త ను చంపుతుండగా అరుపులు, కేకలు వేయడంతో గ్రామస్తులు మేల్కొని భర్త ను కాపాడారు. భార్యతో పాటు ప్రేమికుడిని పోలీసులకు అప్పగించారు. ఇన్ స్టాలో అడ్డమైన పరిచయాలు చేసుకుని జీవితాలు నాశనం చేసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. భర్తలను మోసం భార్యలను, భార్యలను మోసం భర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.