BigTV English

Kissing Bug: కిస్సింగ్ బగ్.. అమెరికాను వణికిస్తున్న ఈ కీటకం.. ఏం చేస్తుందో తెలుసా?

Kissing Bug: కిస్సింగ్ బగ్.. అమెరికాను వణికిస్తున్న ఈ కీటకం.. ఏం చేస్తుందో తెలుసా?

Kissing Bug Sparks Alarm In US:

కిస్సింగ్ బగ్ గత కొద్ది రోజులుగా అమెరికాను అతలాకుతలం చేస్తోంది. ఈ కీటక ద్వారా అత్యంత ప్రాణాంతకమైన చాగస్ వ్యాధి అమెరికాలో వేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా కాలిఫోర్నియాలో ఈ వ్యాధి తీవ్రంగా ఉంది. ఈ వ్యాధి కారణంగా తీవ్రమైన గుండె, జీర్ణాశయాంతర సమస్యలు తలెత్తి చనిపోయే అవకాశం ఉంటుంది. ఇంతకీ ఈ కిస్సింగ్ బగ్ అంటే ఏంటి? దీని ద్వారా కలిగే చాగస్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి?


కిస్సింగ్ బగ్, చాగస్ వ్యాధి

కిస్సింగ్ బగ్ అనేది ఒక రక్తం పీల్చే కీటకం. ఇది చాగస్ వ్యాధికి కారణమైన ట్రైపనోసోమా క్రూజీ అనే పరాన్న జీవి ద్వారా సంక్రమిస్తుంది. ఈ వ్యాధి ఇటీవల అమెరికాలో, ముఖ్యంగా దక్షిణ రాష్ట్రాల్లో, ఆందోళన కలిగిస్తోంది. కిస్సింగ్ బగ్‌ లు ముఖం, ముఖ్యంగా నోరు, కళ్ల చుట్టూ కుడుతాయి. అందుకే  వీటికి ఈ పేరు వచ్చింది. ఈ కీటకం రాత్రిపూట రక్తం పీలుస్తుంది. దాని మలంలో ఉండే క్రూజీ పరాన్నజీవి గాయం, కళ్లు, నోటి ద్వారా శరీరంలోకి  వెళ్తుంది. ఇది మనుషులు, పెంపుడు జంతువులు, వన్యప్రాణులను సంక్రమిస్తుంది. దీని ద్వారా అత్యంత ప్రమాదకరమైన చాగస్ వ్యాధి సోకుతుంది. ఇది తీవ్రమైన గుండె, జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంది.

అమెరికాలో చాగస్ వ్యాధి వ్యాప్తి

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) వివరాల ప్రకారం, కిస్సింగ్ బగ్‌ లు అమెరికాలో 32 రాష్ట్రాల్లో కనిపించాయి. ముఖ్యంగా దక్షిణ రాష్ట్రాలైన టెక్సాస్, కాలిఫోర్నియా, అరిజోనా, లూసియానా, మిస్సిస్సిప్పి, మిస్సౌరీ, అర్కాన్సాస్, టెన్నెస్సీలలో మనుషులలో చాగస్ వ్యాధి వ్యాప్తికి కారణం అయ్యాయి.  టెక్సాస్‌లో 50 కేసులు నమోదయ్యాయి. కాలిఫోర్నియాలో 1,00,000 మంది సంక్రమించి ఉండవచ్చని అంచనా.


 చాగస్ వ్యాధి లక్షణాలు

చాగస్ వ్యాధికి రెండు దశలు ఉంటాయి. మొదటిది తీవ్ర దశ. ఇన్ఫెక్షన్ తర్వాత మొదటి వారాలు, నెలల్లో జ్వరం, అలసట, తలనొప్పి, కండరాల నొప్పులు, కంటి వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా మందికి ఈ లక్షణాలు కనిపించవు కూడా.  రెండోది దీర్ఘకాల దశ. ఇన్ఫెక్షన్ తర్వాత సంవత్సరాల తర్వాత, 20-30% మందిలో హార్ట్ ఫెయిల్యూర్, గుండె లయ సంబంధ సమస్యలు, జీర్ణ సమస్యలు ఏర్పడుతాయి.

నివారణ, చికిత్స

కిస్సింగ్ బగ్‌ లు రాకుండా ఇంట్లో గోడలకు ఉన్న పగుళ్లను మూసి వేయాలి. కిటికీలు క్లోజ్ చేయాలి. ఇంట్లో కిస్సింగ్ బగ్‌ను గుర్తించినట్లయితే, గ్లోవ్స్ ధరించి వాటిని పట్టుకుని ఓ పాత్రలో వేసి దూరంగా తీసుకెళ్లి పడేయాలి. చాగస్ వ్యాధి తీవ్ర దశలో బెంజినిడజోల్, నిఫర్టిమాక్స్ లాంటి యాంటీపరాసిటిక్ ఔషధాలు ప్రభావవంతంగా ఉంటాయి.

అమెరికాలో ప్రస్తుత పరిస్థితి

CDC నివేదికల ప్రకారం, చాగస్ వ్యాధిని అమెరికాలో ఎండెమిక్‌ గా పరిగణించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఎందుకంటే స్థానిక సంక్రమణలు పెరుగుతున్నాయి. చాగస్ వ్యాధిని వెంటనే గుర్తించడం కష్టం. ఎందుకంటే ఇది లక్షణరహితంగా ఉంటుంది. అమెరికాలో దీని గురించి అవగాహన తక్కువగా ఉంది. ఒక అంచనా ప్రకారం, అమెరికాలో 280,000 నుంచి 300,000 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు.  చాలా మంది తమకు ఈ వ్యాధి ఉందని తెలియకుండా ఉన్నారు. టెక్సాస్, కాలిఫోర్నియా, అరిజోనా వంటి రాష్ట్రాల్లో నివసిస్తున్నవారు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, మట్టి ఇళ్లలో ఉన్నవారు, కిస్సింగ్ బగ్‌ల గురించి అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కిస్సింగ్ బగ్ కాటుకు గురైనవారు, రక్త పరీక్ష ద్వారా చాగస్ వ్యాధి గురించి తెలుసుకోవచ్చు. అసాధారణ లక్షణాలు అంటే, గుండె, జీర్ణ సమస్యలు కనిపిస్తే, వెంటనే వైద్యుని సంప్రదించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

Read Also: ఏంటీ.. టీ, కాఫీలు మానేస్తే అలాంటి కలలు వస్తాయా? పరిశోధనల్లో ఏం తేలిందంటే?

Related News

Stone Baby: 82 ఏళ్ల బామ్మ కడుపులో స్టోన్ బేబీ.. వైద్య చరిత్రలో అరుదైన కేసు ఇది!

Caffeine-Dreams: ఏంటీ.. టీ, కాఫీలు మానేస్తే అలాంటి కలలు వస్తాయా? పరిశోధనల్లో ఏం తేలిందంటే?

Brain Eating Amoeba: కేరళలో మెదడు తినేసే అమీబా.. 8 రోజుల్లో నలుగురు మృతి

Afternoon sleeping effects: మధ్యాహ్నం పూట తినగానే పడుకుంటే ఏం జరుగుతుంది?

Weight Loss: జిమ్‌కు వెళ్లలేదు, డైటింగ్ చెయ్యలేదు.. ఏకంగా 40 కిలోలు తగ్గాడు.. అదెలా?

×