BigTV English
Advertisement

Stone Baby: 82 ఏళ్ల బామ్మ కడుపులో స్టోన్ బేబీ.. వైద్య చరిత్రలో అరుదైన కేసు ఇది!

Stone Baby: 82 ఏళ్ల బామ్మ కడుపులో స్టోన్ బేబీ.. వైద్య చరిత్రలో అరుదైన కేసు ఇది!

Stone Baby: 

వైద్య చరిత్రలో కొన్ని అరుదైన ఘటనలు ఆవిష్కృతం అవుతాయి. అలాంటి వాటిలో ఒకటి స్టోన్ బేబీ. ఓ మహిళ కడుపులో పిండం రాయిగా మారి ఏకంగా 40 ఏళ్లు అలాగే ఉండిపోయింది. 82 ఏళ్ల వయసులో ఆమె కడుపులో స్టోన్ బేబీ ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. ఈ అరుదైన ఘటన 2013లో కొలంబియాలోని బొగోటాలోని వైద్యులు గుర్తించారు. 82 ఏళ్ల మహిళ తన తుండి ప్రాంతంలో నొప్పి కారణంగా తుంజులిటో ఆసుపత్రికి వచ్చింది. వైద్యులు ఎక్స్-రే, CT స్కాన్ చేశారు. అప్పుడు వారు షాకింగ్ విషయాన్ని గుర్తించారు. దీనిని లిథోపెడియన్ లేదంటే స్టోన్ బేబీ అని పిలుస్తారని వైద్యులు వెల్లడించారు. ఈ బేబీ స్టోన్ ఆమె శరీరం లోపల సుమారు 40 సంవత్సరాలుగా ఉన్నట్లు గుర్తించారు.


ఇంతకీ ఏంటీ స్టోన్ బేబీ?

గర్భాశయం వెలుపల, ఉదరంలో గర్భం సంభవించినప్పుడు స్టోన్ బేబీ లేదంటే లిథోపెడియన్ జరుగుతుంది. దీనిని సైన్స్ పరిభాషలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని పిలుస్తారు.  ఇది చాలా అరుదైనది. ప్రతి 10,000 గర్భాలలో 1 ఇలా జరిగే అవకాశం ఉందన్నారు వైద్యులు. పిండం చనిపోయి శరీరం దానిని గ్రహించలేకపోతే.. ఆ పిండం అలాగే ఉండిపోతుంది. శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడానికి, పిండాన్ని కాల్షియంతో కప్పి గట్టిగా మారుతుంది. దీనిని వైద్యులు లిథోపెడియన్ లేదంటే  స్టోన్ బేబీ అని పిలుస్తారు.

అత్యంత అరుదైన పరిస్థితి  

లిథోపెడియన్లు అనేవి అత్యంత అరుదైనవి. 1582లో మొదటిసారి ఈ కేసును గుర్తించారు.  ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 300 కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. అందుకే, ఇది అత్యంత అరుదైన కేసుగా వైద్యులు గుర్తించారు. ఇప్పుడు అల్ట్రాసౌండ్‌ లాంటి ఆధునిక వైద్య పరికరాలు సాధారణంగా ఎక్టోపిక్ గర్భాలను ముందుగానే గుర్తిస్తాయి. కాబట్టి లిథోపెడియన్‌లు ఇప్పుడు చాలా అరుదుగా ఉన్నాయి. బేబీ స్టోన్ పరిస్థితులు వైద్యులు, ప్రినేటల్ కేర్ అందుబాటులో లేని ప్రదేశాలలో జరుగుతాయి.


Read Also:  కిస్సింగ్ బగ్.. అమెరికాను వణికిస్తున్న ఈ కీటకం.. ఏం చేస్తుందో తెలుసా?

కొలంబియా ఉమెన్స్ స్టోరీ..

కొలంబియాలోని బేబీ స్టోన్ ను గుర్తించిన స్త్రీ దశాబ్దాలుగా ఈ కాల్షియఫైడ్ పిండాన్ని మోస్తున్నట్లు ఆమెకు కూడా తెలియదు. దాని బరువు 1.8 కేజీలు ఉన్నట్లు గుర్తించారు. వైద్యులు దానిని కనుగొన్న తర్వాత, సురక్షితంగా తొలగించడానికి వారు శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత ఆమెను తుంటి నొప్పి నెమ్మదిగా తగ్గింది.

మానవ శరీరం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ కేసు చూపిస్తుంది. ఎక్స్-రేలు, స్కాన్‌ల లాంటి సాధనాలతో, వైద్యులు ఇలాంటి అరుదైన పరిస్థితులను కనుగొని చికిత్స చేయవచ్చు. కొలంబియాలో లిథోపెడియన్ ఆవిష్కరణ సంవత్సరాలుగా దాగి ఉన్న రహస్యాలను సైన్స్ ఎలా వెలికితీస్తుందో చెప్పడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ అన్నారు వైద్యులు.

Read Also:  ఏంటీ.. టీ, కాఫీలు మానేస్తే అలాంటి కలలు వస్తాయా? పరిశోధనల్లో ఏం తేలిందంటే?

Related News

Diabetes:షుగర్.. ఎంతకీ కంట్రోల్ అవ్వడం లేదా ?

Honey Health Benefits: ఆరోగ్యానికి తీపి చిట్కా.. ఒక చెంచా తేనెతో చలికాలం సమస్యలన్నీ దూరం!..

Lung Cancer: ఊపిరితిత్తుల క్యాన్సర్.. చాలా మంది నిర్లక్ష్యం చేసే లక్షణాలివే !

Lower Cholesterol: మందులు లేకుండా కొలెస్ట్రాల్ తగ్గించే.. సహజ మార్గాలు ఏంటో తెలుసా ?

Massage benefits: ఆయుర్వేదం చెప్పే 5 మసాజ్ రహస్యాలు.. డాక్టర్లు కూడా సూచించే థెరపీలు

Liver Disease: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా ? అయితే లివర్ పాడైనట్లే !

Kidney Health: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఎలాంటి డ్రింక్స్ తాగాలి ?

Gas Geyser: ఇంట్లో గ్యాస్ గీజర్లు వాడుతున్నారా ? ఇవి తప్పక తెలుసుకోండి

Big Stories

×