IND Vs PAK : ఆసియా కప్ 2025లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు వాస్తవానికి ఇరు జట్లకు సంబంధించి జాతీయ గీతం ఆలపిస్తారు. అయితే తొలుత టాస్ గెలిచిన పాకిస్తాన్ జాతీయ గీతం పాడారు. పాకిస్తాన్ జాతీయ గీతం పాడే ముందు ఒక డీజే పాట వచ్చింది. జాలేబీ బేబీ సాంగ్ రావడంతో అంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఆ తరువాత పాకిస్తాన్ జాతీయ గీతం క్వామీ తరానా ప్లే చేశారు. పాకిస్తాన్ జాతీయ గీతం పాడిన తరువాత.. భారత జాతీయ గీతం జనగనమన పాడారు.
Also Read : IND Vs PAK : వివాదంలో ఐసీసీ బాస్ జైషా…అఫ్రిదితో కలిసి కూర్చొని !
మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ చేసింది. టీమిండియా టాస్ గెలవకపోయినప్పటికీ తొలుత ఫీల్డింగ్ చేసింది. పాకిస్తాన్, టీమిండియా రెండు జట్లు కూడా ఎలాంటి మార్పులు చేయకుండా తొలి మ్యాచ్ లో ఆడిన టీమ్ తోనే ఆడాయి. ఇక్కడ ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తొలి ఓవర్ బౌలింగ్ చేసిన హార్దిక్ పాండ్యా ఫస్ట్ బాల్ నే వైడ్ వేశాడు. ఆ తరువాత బంతికి పాకిస్తాన్ ఓపెనర్ అయూబ్ బుమ్రాకి క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. మరోవైపు బౌలింగ్ కి వచ్చిన బుమ్రా తన రెండో బంతినే మొహ్మద్ హారీస్.. హార్దిక్ పాండ్యా కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే..? బుమ్రా బౌలింగ్ లో హార్దిక్.. హార్దిక్ బౌలింగ్ లో బుమ్రా క్యాచ్ పట్టడం విశేషం.
పాకిస్తాన్ బ్యాటర్లలో ఫఖర్ జమాల్, పర్హాన్ వికెట్లు పడకుండా కొద్ది సేపు మాత్రమే అడ్డుకున్నారు. దీంతో అక్షర్ పటేల్ రంగంలోకి దిగి ఫఖర్ జమాన్(17) ని ఔట్ చేశాడు. అక్షర్ పటేల్ బౌలింగ్ లో తిలక్ వర్మ క్యాచ్ పట్టడంతో జమాన్ వెనుదిరిగాడు. అక్షర్ తన తరువాత ఓవర్ లో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ను పెవీలియన్ కి పంపాడు. అక్షర్ బౌలింగ్ లో బౌండరీ లైన్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. తొలి 10 ఓవర్లలో పాకిస్తాన్ జట్టు కేవలం 49/4 పరుగులు చేసింది. ఓవైపు వికెట్లు కోల్పోతున్నప్పటికీ.. మరోవైపు ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (40) కాస్త నిలకడగా ఆడాడు. చివర్లో షాహిన్ అఫ్రిది సిక్స్ లతో రెచ్చిపోవడంతో పాకిస్తాన్ 20 ఓవర్లలో 127 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. టీమిండియా 15.5 ఓవర్లలోనే 131 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (31), శుబ్ మన్ గిల్ (10) కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 47 నాటౌట్, శివమ్ దూబే నాటౌట్ గా నిలిచారు. పాకిస్తాన్ జట్టు టీమిండియాకి అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండింటిలో పోటీ ఇవ్వలేకపోయింది. మరోవైపు పాకిస్తాన్ అభిమానులే పాకిస్తాన్ జట్టును పొట్టు పొట్టుగాను తిట్టడం గమనార్హం.