India Smartphone Exports: భారతదేశం నుంచి మొబైల్ ఫోన్ల ఎగుమతులు ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయికి చేరాయి. ఇప్పటివరకు మొత్తం రూ.1 లక్ష కోట్లు దాటినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ విజయానికి ప్రధాన కారణం యాపిల్ కంపెనీ అని డేటా వెల్లడిస్తోంది. ఐఫోన్ల ఉత్పత్తి ఇప్పుడు భారత్‌లో విస్తృతంగా జరుగుతోంది. ఐఫోన్ 14, 15 మోడళ్లు ప్రధానంగా దేశంలోనే తయారై, అమెరికా, యూరప్, సౌదీ అరేబియా వంటి అంతర్జాతీయ మార్కెట్లకు భారీగా ఎగుమతి అవుతున్నాయి.
లక్షలాది యువతకు ఉపాధి అవకాశాలు
భారతదేశంలోని సామ్‌సంగ్, షియోమీ, ఓప్పో, వియవో వంటి కంపెనీలు కూడా ఉత్పత్తిని పెంచుతున్నప్పటికీ, ఎగుమతుల విషయంలో యాపిల్ ఒక అడుగు ముందుగా ఉంది. విశ్లేషకుల ప్రకారం, మొత్తం ఎగుమతుల్లో దాదాపు 65–70 శాతం వాటా ఐఫోన్లదేనని స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఫ్యాక్టరీలు ప్రధానంగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీలు లక్షలాది యువతకు ఉపాధి అవకాశాలు అందిస్తూ, స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా బలమైన మద్దతు ఇస్తున్నాయి.
భారత్ పై ప్రాధాన్యత పెరిగింది
గతంలో మొబైల్ ఫోన్ ఉత్పత్తి, ఎగుమతుల్లో చైనా, వియత్నాం, బంగ్లాదేశ్ వంటి దేశాలు ప్రధానంగా అధికారం చూపించేవి. కానీ ఇప్పుడు భారత్ కూడా ఆ జాబితాలో కీలకంగా నిలిచింది. అమెరికా, యూరప్ కంపెనీలు చైనాపై ఎక్కువ ఆధారపడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాయి. అలాగే, భారత్‌లోని ఉత్పత్తి సామర్థ్యం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, PLI వంటి పథకాల వల్ల భారత్ ప్రాధాన్యం మరింత పెరిగింది.
మేక్ ఇన్ ఇండియా
ఇది భారతదేశానికి భారీ విదేశీ మారక ద్రవ్య ఆదాయం కలిగిస్తుంది. ప్రతి కొత్త ఐఫోన్, ప్రతి పెద్ద ఎగుమతి పరిమాణం దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త శక్తిని ఇస్తుంది. యువతకు ఉద్యోగాలు, ఫ్యాక్టరీల అభివృద్ధి, స్థానిక వ్యాపారాలు భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ప్రత్యక్షంగా ప్రయోజనం చేస్తున్నారు. “మేక్ ఇన్ ఇండియా” కార్యక్రమం కేవలం నామమాత్రం కాదు, నిజమైన ఫలితాలను ఇస్తోందని ఈ విజయాలు చూపిస్తున్నాయి.
Also Read:Flight Tickets Offers: తక్కువ ధరకే విమాన టికెట్.. ఇండిగో రన్‌వే ప్రత్యేక ఆఫర్ వివరాలు
భారత్‌లో ఎగుమతులు 3 లక్షల కోట్లను దాటే అవకాశం
ప్రస్తుతం భారత్‌లో మొబైల్ ఫోన్ ఎగుమతులు చరిత్రలో లేని స్థాయిలో ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం చివరిలో మొత్తం ఎగుమతులు 3 లక్షల కోట్లను దాటే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. దీని అంకె ఇంకా పెరిగి అవకాశం ఉన్నా ఆశ్చపోవాల్సిన పనిలేదని తెలిపారు. దేశీయ కంపెనీలు, అంతర్జాతీయ బ్రాండ్లు, ప్రభుత్వ పథకాలు అన్నీ కలిసి భారతదేశాన్ని ప్రపంచానికి మొబైల్ ఫోన్ల సరఫరా కేంద్రంగా తీర్చిదిద్దాయి.
ప్రపంచానికి స్మార్ట్‌ఫోన్లు సరఫరా చేసే కేంద్రం
భారత్ కేవలం వినియోగదారుల దేశంగా మిగిలిపోకుండా, ప్రపంచానికి అత్యాధునిక స్మార్ట్‌ఫోన్లు సరఫరా చేసే శక్తివంతమైన కేంద్రంగా ఎదుగుతోంది. యాపిల్ ఆ ముందస్తు అడుగులు, ఇతర కంపెనీల సహకారం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు అన్నీ కలిపి భారతదేశం స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో ఒక కొత్త చరిత్ర సృష్టించాయి. ఇది ఆర్థిక, సామాజిక, యువతకు ఉద్యోగ అవకాశాల పరంగా ఒక విప్లవాత్మక మార్పును సూచిస్తుంది.
ఎగుమతుల విషయంలో గ్లోబల్ హబ్
భారతదేశం ఇప్పుడు కేవలం ఉత్పత్తి కేంద్రం కాదు, అంతర్జాతీయ మార్కెట్లో కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతి కొత్త ఐఫోన్, ప్రతి ఎగుమతి పరిమాణం, ప్రతి ఫ్యాక్టరీ అభివృద్ధి, భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఒక కొత్త శక్తిని ఇస్తున్నాయి. యాపిల్ ఆధిపత్యం, ఇతర కంపెనీల ఉత్సాహం, ప్రభుత్వ పథకాల ప్రోత్సాహం అన్నీ కలిపి భారత్ స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల విషయంలో గ్లోబల్ హబ్‌గా నిలవటానికి దారితీస్తున్నాయి.
షాక్‌లో ట్రంప్
అమెరికా అధ్యక్షుడు భారత్‌పై కొన్ని సుంకాలు విధిస్తున్న సమయంలో, భారత్ ఐఫోన్ ఎగుమతులలో టాప్‌లో ఉండటంపై అంతర్జాతీయ వర్గాల్లో సర్వత్రా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీంతో సోషల్ మీడియా వేదికలు హల్‌చల్ అవుతున్నాయి. కొందరు “ట్రంప్ మామ చూసావా?” అంటూ హాస్యంగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే పుష్పా సినిమా డైలాగ్ భారత్ తగ్గేదే లే అని భారత్ సాధించిన ఈ ఘన విజయాన్ని ప్రస్తావిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారత్ ఇప్పుడు వినియోగదారుల దేశం మాత్రమే కాకుండా, ప్రపంచానికి స్మార్ట్‌ఫోన్లను సరఫరా చేసే శక్తివంతమైన కేంద్రంగా నిలిచింది.